Shortcuts: WD:VAND, WD:VD

Wikidata:దుశ్చర్య

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Vandalism and the translation is 95% complete.
Outdated translations are marked like this.

వికీడేటా సమగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో చేసే చర్యయే "దుశ్చర్య". అదృష్టవశాత్తూ దుశ్చర్యను గమనించడం, వెనక్కి తిప్పడం కూడా తేలికే. ఇక్కడ దుశ్చర్య నిషిద్ధం. పదేపదే చేసేవారు నిరోధానికి గురి కావచ్చు.

దుశ్చర్య అంటే ఏమిటి?

దుశ్చర్యల్లో అనేక రకాలున్నాయి:

తుడిచివేయడం
ఉన్న సరైన సమాచారాన్నంతటినీ తీసివేయడం. తప్పుడు సమాచారాన్ని తీసేసే సదుద్దేశంతో కూడా ఇవి జరిగే అవకాశం ఉన్నందున, తుడిచివేతల పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. అంశాల పేరుబరిలో తుడిచివేత కష్టం కాబట్టి, ఇతర పేరుబరుల్లోనే ఈ దుశ్చర్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
గ్రాఫిటీ
స్టేట్మెంట్ల పేజీలో "హాయ్", "హలో" వంటి పదాలను, చెత్త మాటలు, బూతులు, నిందలు మొదలైన వాటిని చేర్చడం.
మస్కా
అంశాల్లోకి కావాలని తప్పుడు సమాచారాన్ని చొప్పించడం లేదా చెడగొట్టే ఉద్దేశంతో ఈసరికే ఉన్న సమాచారాన్ని తప్పుగా చూపించడం
పేజీతరలింపు దుశ్చర్య
పేజీపేరును ఓ చెత్తపేరుకో, అర్థంపర్థం లేని పేరుకో మార్చడం. పేజీ తరలింపును ఆటోకన్ఫర్మ్‌డ్ వాడుకరులు మాత్రమే చెయ్యగలరు. ప్రధాన పేరుబరి లోని పేజీలను (అంటే అంశాలను) తరలించడం సాధ్యం కాదు కాబట్టి, వికీడేటాలో ఈ రకపు దుశ్చర్య ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే తక్కువ సమస్యాత్మకం.
దొంగచాటు దుశ్చర్య
లింకులను, స్టేట్‌మెంట్లనూ మార్చేయడం లాంటి చూసీ చూడగానే తెలిసిపోని దుశ్చర్య
మూస దుశ్చర్య
పైన వివరించిన పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని వాడి మూసల్లో చేసే దుశ్చర్య. మూసలి అనేక వేల పేజీల్లో కనిపిస్తాయి కాబట్టి వీటిలో చేసే దుశ్చర్య చాలా తీవ్రమైనది. అయితే, పై కారణం వలననే అనేక మూసలను సంరక్షించి ఉంచారు.
ఇంకా ఉన్నాయి...
ప్రాజెక్టును చెడగొట్టేందుకు దుశ్చర్యలు చేసేవారికి అనేక ఇతర పద్ధతులున్నాయి.

ఏది దుశ్చర్య కాదు?

సాధారణంగా చెప్పాలంటే, వికీడేటాను మెరుగుపరచే సదుద్దేశంతో చేసే పనేదీ దుశ్చర్య కాదు. ఉదాహరణకు, కొత్త వాడుకరులు చేసే ప్రయోగాత్మక దిద్దుబాట్లు వికీడేటాలో రచనలు చేయాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తాయి. ఈ ప్రయోగాలు చేసేందుకు గాను, Wikidata Sandbox (Q4115189) వంటి సముచితమైన స్థానాన్ని వీరికి చూపించాలి. అనుభవజ్ఞులు ప్రాజెక్టుకు ఉపయోగపడే పనులు చేసే క్రమంలో, తాము చేసేది సరైన పనే తలంపుతో, తప్పు సమాచారాన్ని చొప్పించే అవకాశం ఉంది. లేదా టైపింగు పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఆయా వాడుకరులతో చర్చించి ఆ తప్పులను చెయ్యవచ్చు. లేదా సాధ్యమైతే, నేరుగా సరుచేసెయ్యవచ్చు. ఇదంతా దుశ్చర్య కాదు, మనిషి చేసిన పొరపాటు. మరి కొంతమందికి అసలు ఇలాంటి ప్రాజెక్టుల్లో పనిచెయ్యగల సామర్థ్యం, శక్తియుక్తులూ ఉండవు; ఇదొక చిక్కు పైస్థితే గానీ, దుశ్చర్య కాదు.

అసలు మూలం అంతా ఉద్దేశం లోనే ఉంది—ఉద్దేశం ప్రాజెక్టును చెడగొట్టాలనా లేక మెరుగుపరచాలనా? ఏది దుశ్చర్య, ఏది కాదు అని నిర్ధారించేందుకు ఎడిటర్లు, నిర్వాహకులూ ప్రజ్ఞను (కామన్ సెన్సును) వాడాలి.

దుశ్చర్యతో వ్యవహారం

దుశ్చర్యతో వ్యవహరించే ప్రాథమిక పద్ధతి ఇది:

  1. దుశ్చర్యతో వ్యవహరించే తొలి అంగ అది జరిగింది అని కనుగొనడం. అనుమానాస్పద దిద్దుబాట్ల కోసం ఇటీవలి మార్పులను, కొత్త పేజీల చిట్టానూ, మీ వీక్షణ జాబితానూ గమనిస్తూ ఉండడమనేది దుశ్చర్యను గుర్తించడానికి ఏ ఎడిటరైనా చెయ్యదగ్గ మూడు పనులు.
  2. దుశ్చర్యను కనుగొన్నాక, "undo" లేదా "restore" బొత్తాలను వాడి పేజీని దుశ్చర్యకు ముందున్న కూర్పుకు తీసుకువెళ్ళవచ్చు. ఈ మార్పును తనిఖీ చేసినట్లుగా గుర్తు పెట్టాలి ([Mark this page as patrolled]).
  3. "rollback" బొత్తం కూడా "undo" బొత్తం చేసే పనే చేస్తుంది. కానీ వెనక్కి తిప్పిన దిద్దుబాట్లను తనిఖీ చెయ్యని ఇటీవలి మార్పుల నుండి తీసేస్తుంది. నిర్వాహకులకు, రోల్‌బ్యాకర్లకు, స్టీవార్డులకు, సార్వత్రిక నిర్వాహకులకూ, సార్వత్రిక రోల్‌బ్యాకర్లకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోల్‌బ్యాక్ హక్కుల కోసం Wikidata:Requests for permissions/Other rights#Requests for the rollbacker right వద్ద అభ్యర్ధించవచ్చు.
  4. దుశ్చర్యను తొలగించాక, అది చేసినవారి చర్చాపేజీలో హెచ్చరికలు చెయ్యవచ్చు. వారి ప్రవర్తన అవాంఛనీయమని, మరింత సకారాత్మకమైన పనులు చెయ్యమనీ కోరండి.
  5. దుశ్చర్య చేసినవారు ఆ పని కొనసాగిస్తూ ఉంటే, నిర్వాహకులెవరైనా ఆ వాడుకరిని నిరోధించవచ్చు. నిర్వాహకేతరులు దుశ్చర్య చేసేవారిపై WD:AN వద్ద ఫిర్యాదు చెయ్యవచ్చు. ప్రాజెక్టును మరింతగా చెడగొట్టకుండా ఉండేందుకు నిరోధిస్తారు. చాలా కాలంగా దుశ్చర్యలు చేస్తున్నవారు, పెద్దసంఖ్యలో దిద్దుబాట్లు చేస్తూ దుశ్చర్యకు పాల్పడేవారూ ఏ హెచ్చరిక లేకుండా నిరోధానికి గురి కావచ్చు.
  6. ఏదైనా పేజీలో అనేక మంది పదేపదే దుశ్చర్యలు చేస్తూ ఉంటే, ఆ పేజీని పాక్షికంగా సంరక్షించవచ్చు (ఇది ఆటోకన్ఫర్మ్‌డ్ కాని వాడుకరులు ఆ పేజీలో దిద్దుబాట్లు చెయ్యకుండా నిరోధిస్తుంది), లేదా పూర్తి స్ంరక్షణ చెయ్యవచ్చు (నిర్వాహకేతరులెవ్వరూ దిద్దుబాట్లు చెయ్యలేరు). పేజీ సంరక్షణ విధానం ప్రకారం నిర్వాహకులు పేజీని సంరక్షిస్తారు.

చెయ్యకూడనివి

దుశ్చర్యలు జరుగుతున్నాయి కదా అని అంశాన్ని తొలగించమని అభ్యర్ధించరాదు. దుశ్చర్యను తేలిగ్గా తీసేసి, పేజీని దుశ్చర్యకు ముందరి స్థితికి తిసుకువెళ్లవచ్చు. (అసలు అంశాన్ని సృష్టించినదే దుశ్చర్య ద్వారా అయితే, తొలగింపే దానికి తగిన చర్య. అంశపు చరిత్రను చూడండి.)

ట్రోల్‌లకు ఆహారం వెయ్యకండి. దుశ్చర్యలు చేసేవారిలో ఎక్కువమంది, అది సరదాగా ఉంటుంది కాబట్టి చేస్తారు. వికీడేటా వాడుకరులు వారి చర్చాపేజిలకు వెళ్ళి కోపంతో వాళ్ళ తప్పుడు పనుల గురించి ఉపన్యాసాలు చెబుతే వాళ్ళకు మరింత సరదాగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. దుశ్చర్యలకు పాల్పడేవారు నిర్మాణాత్మకమైన పనులు చేసేందుకు ఆసక్తిగా లేరని మీకు అనిపిస్తే, వారిని నిరోధించమని నిర్వాహకు లెవరికైనా తెలియజేయండి.

ఇవి కూడా చూడండి