understand
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, విశేషణం, తెలుసుకొనుట, గ్రహించుట.
- he understands English వానికి ఇంగ్లిషువచ్చును.
- he does not understand accounts వానికి లెక్కలు రావు.
- I do not understand this business ఆ పని నాకు తెలియదు, అది యెటిపనో నాకు తెలియదు.
- by this I understand that he will not come యిందువల్ల వాడు రాడని తోచినది.
- do you understand me ? yes నీకుఅర్థమైనదా, అర్థమైనది.
- do youunderstand me ? నేను చెప్పినది నీకు తెలిసినదా, నా మాటకునీకు అర్థమైనదా.
- I do not understand your going there without permission నా సెలవులేక నీవు అక్కడికి పోవడము యెటువంటిది.
- I understand that he is gone వాడు వెళ్ళినాడట.
- he gave them to understand that he would complain against them మీ మీద ఫిరియాదుచేయబోతానని వాండ్లకు యెరుక చేసినాడు.
- in this verse we must understand the word king యీ శ్లోకములో రాజు అనే పేరును అధ్యాహారము చేసుకోవలసినది.
- here we must understand the nominative case యిక్కడ కర్తను తెచ్చుకోవలసినది, యిక్కడ కర్తభావిస్తున్నది.
- that word is understood, not expressed యిక్కడ ఆ శబ్ధముభావిస్తున్నది గాని కంఠరవేణ చెప్పబడలదు.
- By " Relations " I do not understand his brothers బంధువులు అనే శబ్దము వున్న గాని అన్నదమ్ములని నాకు భావము కాలేదు.
- on understanding that he would pay the money I went away వాడు ఆరూకలు చెల్లిస్తాడని తెలిశినందు మీదట వెళ్ళిపోయినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).