Jump to content

ride

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to travel on horseback, to travel in a vehicle; tobe borne గుర్రము మొదలైన వాహన మెక్కి వెళ్ళుట.

  • the boy rode upon a stick ఆ పిల్లకాయ కర్ర గుర్రము మీద సవారి చేసినాడు.
  • he rode to town సవారెక్కి పట్నానికి వెళ్ళినాడు.
  • he left the child ride upon his shoulder ఆ బిడ్డ ను భుజము మీద కూర్చుండ బెట్టుకొన్నాడు.
  • to ride on horseback గుర్రమెక్కి పోవుట.
  • he rode at me గుర్రాన్ని నా మీద విడిచినాడు.
  • to ride in a palankeen పల్లకెక్కిపోవుట, పల్లకీలో పోవుట.
  • he rode in a carriage బండెక్కి పోయినాడు.
  • he rode away వాడు సవారెక్కి పోయెను.
  • he rode round the hil గుర్రమెక్కి ఆ కొండను చుట్టుకొని వచ్చినాడు.
  • (regarding vessels it means standing still)the ship rode out the storm ఆ గాలికి వాడ లంగరు వేశినది వేశి నట్టే వుండినది, కదలకుండా వుండినది.
  • the ships ride at anchor ఆ వాడలు లంగరుచేశి వున్నవి.

క్రియ, విశేషణం, సవారి చేసుట, యెక్కి పోవుట.

  • he rides an elephant యేనుగు సవారి చేస్తాడు.
  • he rode my horse నా గుర్రాన్ని సవారి చేసినాడు, నా గుర్రమెక్కి పోయినాడు.
  • he rode ten miles గుర్రమెక్కి ఆమడ దూరము పోయినాడు.
  • he taught the boy to ride the high horse ఆ పిల్ల కాయకు గుర్రపు సవారి నేర్పినాడు.
  • he rode the high horse వాడు నిండా గర్వించి వున్నాడు.
  • they are priest-ridden వీండ్లు గురు వెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాండ్లు, వీండ్లను గురువు పశువుల వలె ఆడిస్తాడు.

నామవాచకం, s, సవారి, వాహనమెక్కి పోవడము.

  • there is a ride round the hill ఆ కొండ చుట్టూ గుర్రమెక్కి పోవడానికి దారి వున్నది.
  • he took a ride వాహన మెక్కి పోయినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ride&oldid=942841" నుండి వెలికితీశారు