point
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మొన,కొన, అగ్రము,బిందువు.
- a steel point for engraving పోగర.
- the very point కొట్టకొన.
- but now to the point మెట్టకు ముఖ్యమేమంటే.
- the troops landed at the point తండుకొస భూమిలో దిగినది, కొసభూమి యనగా సముద్రములో నాలికవలెపోయివుండే భూమి, రావి ఆకు కొనవలె వుండే భూమి.
- matter విషయము, ప్రమేయముసంగతి.
- regarding this point యీ విషయమును గురించి.
- this is a very important pointయిది అతి ముఖ్యమైన విషయము.
- this is the great point యిది ముఖ్యము.
- this is no great point యిది వొక అతిశయము కాదు.
- he saw the matter in another point of view అతనికి వేరే విధముగా తోచినది.
- in a legal point of view ధర్మ శాస్త్ర ప్రకారముగా.
- I do not see the point of this verse యీ పద్యము యొక్క కిటుకు నాకు తెలియదు.
- I will make a point of doing this నేను దీన్ని అవస్యము చేస్తున్నాను.
- I wish you will come to the point పరిష్కారముగా చెప్పు.
- a point of time నిమిషము.
- just at that point I arrived ఆ సమయానికి వస్తిని.
- in point of fact మెట్టుకు.
- this is a case in point యిదిసరియైన వుదాహరణము.
- this is a quotation in point యిది తగిన వుదాహరణము.
- the pointof honour మాసము.
- they consider it a point of honour never to surrender their arms ఖడ్గనష్టము మాన నష్టమని అనుకొంటారు none.
- equal him in point of learning విద్యావిషయములో వాడికి యెవడు యీడు లేదు.
- he was at the point of death వాడు చచ్చేగతిగా వుండినాడు,వానికి కాలము ముగిసినది.
- I was on the point of telling him వాడితో చెప్పక తప్పినాను.
- a cow on the point of calving యీనమోపుదలగా వుండే ఆవు.
- he was armed at all point s వాడు ఆయుధసన్నద్ధుడై వుండెను.
- he carried his point జయించినాడు, గెలిచినాడు.
- a mathematical point బిందుdiacritical points used in Persian ఫార్సీ భాషలో అక్షరమునకు కింద మీదవేసే అకార, ఉకారాది సంజ్ఞలుగా వుండే చుక్కలు.
- every point was properly guardedఆయా స్థలములో బందోబస్తుగా పారా పెట్టి వుండెను.
- the eight points of the compassఅష్టదిక్కులు.
- the intermediate eight points E. N. E. &c..
- విదిక్కులు.
- a string with a tag దూర్చడానికి సులభముగా మొనకు సీసపుకూచి గొట్టము వేసిన తాడు.
- Point blank స్పష్టముగా, సరిగ్గా.
క్రియ, విశేషణం, చూపుట.
- he pointed his finger at them వాండ్లను వేలితో చూపినాడు.
- he pointed the gun at the fort ఆ ఫిరంగిని కోటకు సూటిగా పెట్టినాడు.
- or sharpen వాడి చేసుట పదును పెట్టుట కూచిగా చెక్కుట.
- he pointd the stakeఆ వాసమును కూచిగా చెక్కినాడు.
- he pointed out the difference భేదమును చూపినాడు.
- I will point out another way వేరే వుపాయము చెప్పుతాను.
క్రియ, నామవాచకం, చూపుట.
- this points north wards యిది వుత్తరాభిముఖముగా వున్నది.
- that leaves point upwards ఆ యాకులపై మొనలుగా వున్నవి.
- as a dog doesవేటలో కుక్క కొన్ని పక్షులను చూపుట.
- they pointed at him వాణ్ని వేలితో చూపినారు.
- this expression points at you యిది నిన్ను వుద్దేశించి చెప్పిన మాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).