1997
Appearance
1997 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 |
దశాబ్దాలు: | 1970లు - 1980లు - 1990లు - 2000లు - 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]Mariam
[మార్చు]- జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండోసారి బాధ్యతలు చేపట్టాడు.
మార్చి
[మార్చు]- మార్చి 13: మదర్ థెరీసా స్థానంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సిస్టర్ నిర్మలను నాయకురాలిగా ఎన్నుకుంది.
- మార్చి 22: హేల్ బాప్ తోకచుక్క భూమికి అతిచేరువలో వచ్చింది.
ఏప్రిల్
[మార్చు]- ఏప్రిల్ 21: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవిని చేపట్టినాడు.
- ఏప్రిల్ 29: చైనాలో రెండు రైళ్ళు ఢీకొని 126 ప్రయాణీకులు మృతిచెందారు.
మే
[మార్చు]- మే 2: యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా టోనీ బ్లెయిర్ నియమితుడైనాడు.
జూలై
[మార్చు]- జూలై 1: హామ్కాంగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటన్ చైనాకు అప్పగించింది.
- జూలై 8: చెక్ రిపబ్లిక్, హంగేరి, పోలాండ్ దేశాలను కూటమిలో చేరవసిందిగా నాటో ఆహ్వానించింది.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని అధిష్టించాడు.
- ఆగష్టు 6: శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
డిసెంబర్
[మార్చు]- డిసెంబర్ 11: క్యోటో ప్రోటోకాల్‌ను ఐక్యరాజ్యసమితి కమిటీ ఆమోదించింది.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 22: ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1906)
- ఫిబ్రవరి 22: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)
- మార్చి 9: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)
- ఏప్రిల్ 10: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920)
- మే 24: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931)
- మే 28: కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (జ.1930)
- ఆగస్టు: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత. (జ.1925)
- ఆగష్టు 5: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922)
- ఆగష్టు 31: డయానా, వేల్స్ యువరాణి.
- సెప్టెంబర్ 5: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910)
- నవంబర్ 26: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (జ.1935)
- డిసెంబర్ 2: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (జ.1907)
- డిసెంబర్ 23: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (జ.1880)
- డిసెంబర్ 25: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ప్రదీప్.
- జ్ఞానపీఠ పురస్కారం : ఆలీ సర్దార్ జాఫ్రి
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: స్టీవెన్ చు, క్లాడ్ కోహెన్ టనోడ్జి, విలియం డి ఫిలిప్స్.
- రసాయనశాస్త్రం: పాల్ బోయెర్, జాన్ ఇ వాకర్, జెన్స్ సి స్కౌ.
- వైద్యశాస్త్రం: స్టాన్లీ బి ప్రుసినెర్.
- సాహిత్యం డేరియో ఫో.
- శాంతి: జోడి విలియమ్స్, మందుపాతరల వ్యతిరేక అంతర్జాతీయ ఉద్యమం.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ సి మెర్టన్, మిరాన్ షోల్స్.