హసన్ జిల్లా
?హసన్ కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13°04′N 76°06′E / 13.06°N 76.1°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా 5:30) |
హసన్ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా , ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం హసన్ నందే ఉంది.
చరిత్ర
[మార్చు]హసన్ చరిత్ర సుమరుగా 5వ శతాబ్దం నుండి ప్రారంభమైనట్లుగా గుర్తించబడుతోంది. హాల్మాడి గ్రామంలోని కదంబ రాజులు వేయించిన శిలాశాసనమే దీనికి సాక్షి. కదంబ వంశం తరువాత 11వ శతాబ్దంలో హొయసల వంశం ఈ ప్రదేశాన్ని పరిపాలించింది. 11 నుండి 14వ శతాబ్దం వరకు హోయస్ల రాజుల రాజధాని ద్వారసముద్ర. ఇప్పటి హళేబేడు గ్రామంలో ఈ రాజధాని అవశేషాలు కనిపిస్తాయి. మొదట్లో హోయస్ల రాజులు జైన మతాన్ని పాటించగా, ఆ తరువాతి హోయస్ల రాజులు శైవాన్ని పాటించారు. కానీ ఈ రాజ వంశీయులు అన్ని మతాలను సమాన దృష్టితో చూసేవారని చెప్పడానికి హళిబేడులోని శివుని దేవాలయమైన హొయసలేశ్వర దేవాలయం, బేలూరులోని విష్ణువు దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం సాక్షి.
శిలా శాసనాలు
[మార్చు]కదంబ వంశానికి చెందిన రాజులు కన్నడ భాషలో మొట్టమొదటి శిలశాసనం బేలూరు తాలుకాలోని హల్మాడి గ్రామంలో ఉంది. హసన్ జిల్లాలోని శ్రావణబెళగొళలోనే అత్యధిక కన్నడ శిలాశాసనాలు లభిస్తున్నాయి. శ్రావణబెళగొళలో మరాఠీ శిలశాసనాలు కూడా ఉన్నాయి.
హసన్ పేరు వెనుక కథ
[మార్చు]హసన్ పేరు వెనుక రెండు కథలు ఉన్నాయి 1) ఈ హసన్ మొదటి పేరు సింహసనపురి ఒక వాదన 2) హసన్ పట్టణంలో ఉన్న హసనాంబాదేవి వలన ఈ పట్టణానికి ఈ పేరు వచ్చిందనేది మరో వాదన 3).హసన్ గారు ముహమ్మదు ప్రవక్త మనుమడు .అలీ ఫాతిమా ల సంతానం.ఖురాన్ సంకలనం చేయించిన ఖలీఫా.
హసన్ జిల్లా సరిహద్దులు
[మార్చు]హసన్ జిల్లాకు ఈశాన్యాన తుముకూరు జిల్లా, ఆగ్నేయం వైపు మాండ్య జిల్లా, దక్షిణం వైపు మైసూరు జిల్లా, నైఋతి వైపు కొడగుజిల్లా, పశ్చిమం వైపు దక్షిణ కన్నడ జిల్లా, వాయువ్యం వైపు చిగ్‌మగళూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.హసన్ జిల్లా విస్తీర్ణం ೬೮೧೪ చ.కి.మి. ఈ జిల్లా జనాభా 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ೧೭,೨೧,೩೧೯. ఇది 1991 జనాభా లెక్కల కంటే ೯.೬೬ శాతం హెచ్చు.
భౌగోళిక ఉనికి
[మార్చు]హసన్ జిల్లాలో రెండు ముఖ్య భౌగోళిక భాగాలు ఉన్నాయి. మొదటిది మలనాడు పర్వత శ్రేణులు రెండవది పీఠభూమి భాగం. మలనాడు పర్వతశ్రేణులు పశ్చిమ కనుమలలో భాగం. ఈ జిల్లాలో ప్రముఖ నది హేమవతి ఈ నది కావేరి నదికి ఉపనది. పశ్చిమ కనుమల్లో భాగమైన మలనాడు కొండలలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అమిత జంతు-వృక్ష సంపద ఉంది. ఈ జిల్లాలో అనేక కాఫీ తోటలు ఉన్నాయి. మొట్ట మొదటి కాఫీ తోట ೧೮೪೩ సంవత్సరం వేయబడింది.
పరిపాలన నిమిత్తం హసన్ జిల్లాను 8 తాలుకాలుగా విభజించారు.
దర్శించవలసిన ప్రదేశాలు
[మార్చు]హసన్ జిల్లాలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రావణబెళగొళ. శ్రావణబెళగోళలో ೫೭ ఎత్తు ఉన్నగోమటేశ్వరుడి విగ్రహం ఏకశిలా విగ్రహాలలో అతిపెద్ద విగ్రహం.హళేబీడులో హోయ్సళేశ్వర దేవాలయం , బేలూరులో ఉన్న చెన్నకేశవ దేవాలయం హోయస్ల శిల్పకళాచాతుర్యానికి తార్కాణాలు.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]హసన్ నుండి కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరు, మైసూర్, తుముకూర్, షిమోగ, చిత్రదుర్గ పట్టణాల రైలుస్టేషన్లకు రైలు సౌకర్యం ఉంది.