Jump to content

హరిభౌ బగాడే

వికీపీడియా నుండి
హరిభౌ కిసన్‌రావ్ బగాడే
హరిభౌ బగాడే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 జూలై 2024
ముందు కల్రాజ్ మిశ్రా

పదవీ కాలం
12 నవంబర్ 2014 – 25 నవంబర్ 2019
డిప్యూటీ విజయరావు భాస్కరరావు ఆటి
ముందు దిలీప్ వాల్సే-పాటిల్
తరువాత నానా పటోల్

ఆహార & పౌర సరఫరాల మంత్రి
పదవీ కాలం
1997 – 1999

హార్టికల్చర్ & ఉపాధి హామీ మంత్రి
పదవీ కాలం
1995 – 1997

మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2014 – July 2024
ముందు కళ్యాణ్ కాలే
తరువాత ఖాళీగా
నియోజకవర్గం ఫూలంబ్రి
పదవీ కాలం
1985 – 2004
ముందు కేశవరావు ఔతాడే
తరువాత కళ్యాణ్ కాలే
నియోజకవర్గం ఔరంగాబాద్ తూర్పు

వ్యక్తిగత వివరాలు

జననం (1945-08-17) 1945 ఆగస్టు 17 (వయసు 79)
ఫులంబ్రి, ఔరంగాబాద్ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం రాజ్ భవన్, జైపూర్, రాజస్థాన్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

హరిభౌ కిసన్‌రావ్ బగాడే (జననం 17 ఆగస్టు 1945) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతనిని 2024 జులై 27న రాజస్థాన్ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించింది.[1][2] మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014లో మహారాష్ట్ర శాసనసభ స్పీకరుగా పనిచేసాడు.[3] అతను భారతీయ జనతా పార్టీ నాయకుడు.

చిన్ననాటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త, సభ్యుడు అయిన హరిభౌ బాగ్డే, మరాఠ్వాడా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని పెంచడంలో కీలకపాత్ర పోషించాడు. రాజకీయ వర్గాల్లో "నానా"గా ప్రసిద్ధి చెందాడు. 1980 భారతీయ జనసంఘ్‌లో ఉన్నారు.

అతను 1985లో ఔరంగాబాద్ తూర్పు స్థానం నుండి మొదటిసారిగా మహారాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యాడు. [4] అతను 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కళ్యాణ్ కాలేపై ఫులంబ్రి నియోజకవర్గం నుండి గెలుపొందాడు,[5] andఅదే నియోజకవర్గం నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాడు. 2014లో మహారాష్ట్రలో బీజేపీ తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అతను మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నియమితులయ్యారు. అతను మహారాష్ట్ర ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ మంత్రి, అతను మహారాష్ట్ర రాష్ట్ర బిజెపి పార్టీ గ్రామీణ ప్రాంత నాయకుడుగా చూడబడ్డాడు.

2024 జులై 27 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ గవర్నర్‌గా హరిభౌ బగాడేను నియమించారు.[6]

జననం

[మార్చు]

హరిభౌ కిసన్‌రావ్ బగాడే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలోని చిట్టెపింపల్‌గావ్‌లో 1945 ఆగస్టు 17న జన్మించాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (28 July 2024). "RSS leader Haribhau Kisanrao Bagde appointed new governor of Rajasthan". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  2. The Indian Express (28 July 2024). "Nine states get new Governors: Gulab Chand Kataria for Punjab, Santosh Gangwar goes to Jharkhand" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  3. "BJP's Haribhau Bagde unanimously elected Maharashtra's Assembly Speaker". The Economic Times. 12 November 2014. Retrieved 6 April 2021.
  4. "Madhya Pradesh Assembly Election Results in 1985".
  5. "Bagde haribhau Kisan(Bharatiya Janata Party(BJP)):Constituency- Phulambri(AURANGABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2014-06-07.
  6. Mallick, Ashesh (28 July 2024). "President appoints 6 new Governors including Om Prakash Mathur, Santosh Gangwar, reshuffles 3 others". India TV News. Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.