Jump to content

సాగర్ కె చంద్ర

వికీపీడియా నుండి
జననం1983 మే 17
విద్యాసంస్థఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (ఉస్మానియా విశ్వవిద్యాలయం)
ఫిలింమేకింగ్ (అమెరికా)
వృత్తిసినిమా దర్శకుడు
స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిగీతా రెడ్డి
తల్లిదండ్రులు
  • మారం రాంచంద్రారెడ్డి (తండ్రి)
  • సునీత (తల్లి)

సాగర్‌ కె చంద్ర, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] అయ్యారే (2012), అప్పట్లో ఒకడుండేవాడు[2] (2016), పవన్ కళ్యాణ్ హీరోగా 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' ఆధారంగా రూపొందిన భీమ్లా నాయక్‌ (2022) సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3]

జీవిత విషయాలు

[మార్చు]

సాగర్ చంద్ర, మే 17న మారం రాంచంద్రారెడ్డి, సునీత దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండలో జన్మించాడు. సాగర్ చంద్ర అసలు పేరు కళాసాగర్‌. తండ్రి నేతాజీ హైస్కూల్‌ను నడిపేవాడు, తల్లి గృహిణి. ఇంటర్‌ వరకు నల్గొండలోనే చదివిన సాగర్, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ఆ తరువాత మాస్టర్స్‌ డిగ్రీ (ఎం.ఎస్.) చదవడానికి అమెరికా వెళ్ళాడు.

సినిమారంగం

[మార్చు]

అమెరికాలో తను చదివే దక్షిణ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న ఓ ఫిల్మ్‌ స్కూల్‌ లో జరిగే షూటింగ్స్‌ చూడడంతోపాటు, కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయం వల్ల సాగర్ కు సినిమా దర్శకత్వంపై ఆసక్తి కలిగింది. తను కూడా ఫిల్మ్‌స్కూల్లో చేరి కోర్స్‌ పూర్తిచేశాడు. ఎం.ఎస్. చదువులతో పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళ తరువాత ఉద్యోగాన్ని వదిలి 2009లో హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం రవిబాబు (అమరావతి సినిమా), మధుర శ్రీధర్ రెడ్డిల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. 2012లో శివాజీ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో వచ్చిన అయ్యారే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు. కొంతకాలం కార్పోరేట్ యాడ్స్ చేశాడు. ఆ తరువాత 2016లో శ్రీవిష్ణు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు దర్శకత్వం వహించాడు.[4] సాగర్‌ కె చంద్ర తన మూడవ సినిమాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్‌ నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాడు.[5][6]

సినిమాలు

[మార్చు]
  1. అయ్యారే (2012)
  2. అప్పట్లో ఒకడుండేవాడు (2016)[7]
  3. భీమ్లా నాయక్‌ (2022)[8][9]
  4. టైసన్ నాయుడు[10]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, జిందగీ (31 December 2016). "అప్పట్లో కథ.. ఇప్పట్లో సినిమా!". అజహర్ షేక్, కంది సన్నీ. Retrieved 17 May 2021.
  2. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "సినిమా రివ్యూ: అప్పట్లో ఒకడుండేవాడు". Retrieved 17 May 2021.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (16 November 2020). "నేను పవర్‌స్టార్‌ అభిమానినే: సాగర్‌ కె.చంద్ర". www.andhrajyothy.com. Archived from the original on 23 November 2020. Retrieved 17 May 2021.
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (16 August 2020). "లోకల్‌ జీవితాన్ని గ్లోబల్‌గా చూపించాలి!". Archived from the original on 16 August 2020. Retrieved 17 May 2021.
  5. TV9 Telugu (26 October 2020). "ఈ కుర్ర డైరెక్టర్ నక్క తోక తొక్కాడు ! - Sagar K Chandra Movie With Pawan". TV9 Telugu. Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andrajyothy (27 July 2021). "ఖాకీ డ్రస్సులో పవర్ స్టార్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
  7. Sakshi (1 March 2022). "ఆ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి: దర్శకుడు". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
  8. Eenadu (27 February 2022). "పవన్‌తో సినిమా అనగానే.. షాకయ్యా." Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  9. Namasthe Telangana (28 February 2022). "పవన్‌ మాటలు బాధ్యత పెంచాయి". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  10. Andhrajyothy (3 January 2024). "బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.

బయటి లంకెలు

[మార్చు]