Jump to content

సవారి (2020 సినిమా)

వికీపీడియా నుండి
సవారి
సవారి సినిమా పోస్టర్
దర్శకత్వంసాహిత్ మోత్కూరి
రచనసాహిత్ మోత్కూరి
నిర్మాతసంతోష్ మోత్కూరి
నిషాంక్ రెడ్డి కుదితి
తారాగణంనందు, ప్రియాంక శర్మ
ఛాయాగ్రహణంమొనీష్ భూపతిరాజు
కూర్పుసంతోష్ మేనం
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్
విడుదల తేదీs
7 ఫిబ్రవరి, 2020
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సవారి 2020, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాణ సారథ్యంలో సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ తదితరులు నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

కథా నేపథ్యం

[మార్చు]

రాజు (నందు), త‌న‌కు ప్రాణమైన బాద్ షా అనే గుర్రంతో బ‌స్తీలో నివసిస్తుంటాడు. ఆ గుర్రంపై స‌వారీకి తిప్పుతూ డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. అయితే ఆ గుర్రానికి గుండె జ‌బ్బు రావడంతో అందుకు సంబంధించిన ఆపరేష‌న్ చేయాల్సివ‌స్తుంది. అందుకోస‌మే డ‌బ్బు సంపాదిస్తుంటాడు. మ‌రోవైపు భాగీ (ప్రియాంకా శ‌ర్మ‌) అనే గొప్పింటి అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే స‌డ‌న్‌గా ఓరోజు బాద్ షా మాయం అయిపోతుంది. ఆ గుర్రం కోసం పిచ్చోడిలా తిరుగుతుంటాడు. ఆ గుర్రం ఏమైంది? భాగీతో ప్రేమాయ‌ణం ఎన్ని మ‌లుపులు తిరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]
  • నందు (రాజు)
  • ప్రియాంక శర్మ (భాగీ)
  • గుర్రం (బాద్ షా)
  • శివ కుమార్ (శాండీ)
  • శ్రీకాంత్ రెడ్డి గంట (కాశీ)

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: సాహిత్ మోతుకురి
  • నిర్మాణం: సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి కుడితి
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: మొనీష్ భూపతిరాజు
  • కూర్పు: సంతోష్ మేనం
  • నిర్మాణ సంస్థ: కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్

నిర్మాణం

[మార్చు]

ఈ చిత్రానికి నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు.[1] రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు మొదట ప్రకటించారు; అయితే, ఆ వార్తలు అబద్ధమని తేలింది.[2] ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలలో గుర్రం, నందు, ప్రియాంక శర్మలు నటించారు.[3][4][5] ఈ చిత్రంలో మురికివాడకు చెందిన వ్యక్తిగా నందు నటించాడు.[6]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి పాటలను శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.[7] "నీ కన్నులు" అనే పాట 2019 అక్టోబరు నెలలో విడుదలైంది.[8] పూర్ణాచారి రాసిన "ఉండిపోవా నువ్విలా" పాట విడుదలైన తర్వాత అందరిని అలరించింది.[9]

విడుదల

[మార్చు]

ఈ చిత్రం 2020, ఫిబ్రవరి 7న విడుదలైంది.[6][10][11] "సినిమాలోని డ్రామా సరిగా లేదు" అని ఫిల్మ్ కంపానియన్ రాసింది.[12] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 2.5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రం అంతగా నచ్చకపోయినా ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తుంది" అని పేర్కొంది.[13]

మూలాలు

[మార్చు]
  1. "Savaari trailer: Geetha Madhuri surprised over Nandhu's bold act - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  2. ""My next film set against a village backdrop," says actor Nandu - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  3. "Of a horse and a hero". Telangana Today. Retrieved 2020-10-27.
  4. "'Savaari' first look: Rustic rom-com from independent filmmaker Saahith Mothkuri - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  5. "'Savaari' teaser: The story of a horse, a man and his lady love - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  6. 6.0 6.1 "'I am happy Savaari is garnering attention'". Telangana Today. Retrieved 2020-10-27.
  7. "I have to thank music buffs for making Savaari's songs a hit: Shekar Chandra - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  8. "Nee Kannulu from the film Savaari is a peppy number - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  9. ""I'm a very independent and self-motivated individual," says lyricist Purna Chary". The Times of India. April 25, 2020. Retrieved 2020-10-27.
  10. "Nandu and Priyanka Sharma starrer 'Savaari' set for a grand release on Feb 7 - Times of India". The Times of India. Retrieved 2020-10-27.
  11. "5 Telugu movies we can't wait to see this Friday". The Times of India. February 4, 2020. Retrieved 2020-10-27.
  12. Menon, Vishal (May 30, 2020). "Revisiting Telugu Film Savaari On Aha: An Overlong, Melodramatic Man-Horse Bromance That Has Its Moments". Retrieved 2020-10-27.
  13. "Savaari Movie Review: Savaari is an entertaining rom-com despite the flaws". Retrieved 2020-10-27 – via timesofindia.indiatimes.com.

ఇతర లంకెలు

[మార్చు]