Jump to content

సమంతభద్ర (జైన సన్యాసి)

వికీపీడియా నుండి
ఆచార్య

సమంతభద్ర
సమంతభద్ర
వ్యక్తిగతం
జననంసా.శ 2వ శతాబ్దం
మతంజైన మతం
తెగదిగంబర సాంప్రదాయం
ప్రముఖ కృషిరత్నాకరండ శ్రావకాచార, ఆప్త మీమాంస, జినశతకం

సమంతభద్ర దిగంబర సాంప్రదాయానికి చెందిన జైన సస్యాసి. ఈయన సా.శ 2 వ శతాబ్దంలో జీవించాడు.[1][2] ఈయన అనేకాంతవాదం అనే జైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన రచనల్లో రత్నాకరండ శ్రావకాచార ముఖ్యమైనది. ఈయన ఉమాస్వామి కంటే తరువాతి వాడు, పూజ్యపాదుడి కంటే ముందువాడు.

జీవితం

[మార్చు]

సమంత భద్రుడు సా.శ 150 నుంచి 250 మధ్యలో జీవించి ఉండవచ్చు. చోళుల కాలంలో దక్షిణ భారతదేశానికి చెందినవాడు. ఈయన ఒక కవి, తర్కశాస్త్రజ్ఞుడు, పేరొందిన భాషా శాస్త్రవేత్త.[3] దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని వ్యాప్తి చేసినవాడిగా ఈయనకు పేరుంది.[4]

సమంతభద్రుడు విరాగిగా ఉన్న తొలి రోజుల్లో ఈయనకు భస్మక అనే వ్యాధి సోకింది. దీనివల్ల ఈయనకు ఎంత తిన్నా తీరని ఆకలి వేసేది.[5] దిగంబర సన్యాసులు రోజుకి ఒకసారి కంటే ఎక్కువ తినరు. దీని వల్ల ఆయన ఎంతో ఆకలి బాధను భరించాడు. చివరికి తన గురువును సల్లేఖన (ఆమరణ నిరాహార దీక్ష) అనుసరించేందుకు అనుమతి కోరాడు. ఆయన అందుకు అనుమతించక సన్యాసాన్ని విడిచిపెట్టి జబ్బును నయం చేసుకోమన్నాడు.[5] జబ్బు నయం అయిన తర్వాత మళ్ళీ సన్యాసం స్వీకరించి గొప్ప ఆచార్యుడిగా పేరు తెచ్చుకున్నాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Gokulchandra Jain 2015, p. 82.
  2. Champat Rai Jain 1917, p. iv.
  3. Natubhai Shah 2004, p. 48.
  4. Natubhai Shah 2004, p. 49.
  5. 5.0 5.1 Vijay K. Jain 2015, p. xviii.
  6. Vijay K. Jain 2015, p. xx.