షిరామిన్ పుణ్య క్షేత్రం
షిరామిన్ పుణ్య క్షేత్రం 白峯神宮 | |
---|---|
మతం | |
అనుబంధం | షింటో |
దైవం | ఎంపరర్ జున్న్ఇన్, ఎంపరర్ సుటోకు |
ప్రదేశం | |
భౌగోళిక అంశాలు | 35°01′49″N 135°45′11″E / 35.0303°N 135.753°E |
షిరామిన్ పుణ్య క్షేత్రం (Shiramine Shrine (白峯神宮, షిరామిన్ జింగు)) కమిగ్యో-కు,క్యోటో లోని షింటో పుణ్యక్షేత్రం.[1]
చక్రవర్తి జున్నిన్ [1], చక్రవర్తి సుటోకు ల కామిని పూజించడానికి అంకితం అయిన పుణ్య క్షేత్రం. ఈ షిరామిన్ పుణ్యక్షేత్రంలో చక్రవర్తి సుటోకు జ్ఞాపకార్థం ఏటా-సెప్టెంబర్ మధ్యలో రెండు నోహ్ ప్రదర్శనలు జరుగుతాయి. [2]
ఈ క్షేత్రం క్రీడలకు, మరీ ముఖ్యంగా సాకర్‌కు దేవుడుగా ప్రసిద్ధి చెందిన షిరామిన్ దైవం, సెయిడై మయోజిన్‌కు కూడా నిలయం. [3]
క్రీడలకు అదృష్ట ఆకర్షణ గా పేరుపొందిన షిరామిన్ పుణ్యక్షేత్రంలో, ఆరాధకులను ఆకర్శించే అదృష్ట తాయెత్తుగా కనౌవా (叶う輪 ) బాగా ప్రాచుర్యం పొందింది.
ఈ పుణ్య క్షేత్రాన్ని 1871లో, క్రమానుగతంగా ప్రభుత్వ-మద్దతు గల పుణ్యక్షేత్రం గాను,రాజ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా అనుసంధానమైన కాన్పే-షా(Kanpei-sha)గా గుర్తించారు. [4] ఈ కాన్పే-షా లు రాజ కుటుంబాల గౌరవాన్ని పొందిన పుణ్యక్షేత్రాలు. ఈ కాన్పే-షా వర్గపు పుణ్య క్షేత్రాలు చక్రవర్తులు, రాజ కుటుంబ సభ్యులు లేదా రాజ కుటుంబాల ఆదరణ పొందిన ప్రముఖ పరివారాలు పవిత్రంగా భావించే అభయారణ్యాల మధ్య ఉంటాయి. [5] 1940 వరకు, మధ్య శ్రేణి లేదా కాన్పే- ఛూష(Kanpei-chūsha) ఇంపీరియల్ పుణ్యక్షేత్రాల స్థాయి మందిరం గా ఉండి, షిరమిన్ -గు [6] గా గుర్తింపు పొందింది. 1940లో, షిరమైన్ స్థాయిని కాన్పే-టైష(Kanpei-taisha) గా అత్యున్నత స్థాయి కి మార్చారు. అప్పటి నుండి, ఈ క్షేత్రం షిరామిన్ జింగూ గా వ్యవహారంలో ఉంది. [7]
పండుగలు
[మార్చు]షుంకి రీతైసై పండుగ
ఘనమైన వసంతపు పండుగ (గ్రాండ్ ఫెస్టివల్ ఆఫ్ స్ప్రింగ్)
ఏప్రిల్ 14
కెమారి 10:30 ఉదయం
బుడో(武道)షౌరీసై
(ఫెస్టివల్ ఆఫ్ బుడో(武道))
మే 5
జపనీస్ బుడో ప్రదర్శన ఉదయం 9:00 నుండి (రోజంతా)
సెడైమ్యుజిన్ రీసై ఫెస్టివల్
జూలై 7
కెమారి 2:00 సాయంత్రం
కొమాచి-ఒడోరి 4:30 సాయంత్రం
గమనికలు
[మార్చు]
ప్రస్తావనలు
[మార్చు]- పోన్సన్బై-ఫేన్, రిచర్డ్ ఆర్థర్ బ్రబాజోన్. (1959) జపాన్ యొక్క ఇంపీరియల్ హౌస్. క్యోటో: పోన్సన్బై మెమోరియల్ సొసైటీ. OCLC 194887
- (1962) షింటో , పుణ్యక్షేత్రాలలో అధ్యయనాలు. క్యోటో: పోన్సన్బై మెమోరియల్ సొసైటీ. OCLC 399449
- (1963) ది విసిసిట్యూడ్స్ ఆఫ్ షింటో. క్యోటో: పోన్సన్బై మెమోరియల్ సొసైటీ.
బాహ్య లింకులు
[మార్చు]- షిరమైన్ పుణ్యక్షేత్రం అధికారిక సైట్ (ఇంగ్లీష్, జపనీస్)
- ఫోటోలు (叶う輪 కనౌవా) Archived 2021-12-20 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ponsonby-Fane, Richard. (1959). The Imperial House of Japan, p. 126.
- ↑ Kerr, Amy. "Noh Plays at Shiramine Shrine." September 2008.
- ↑ "Japan shrine keeps ancient soccer alive and kicking," Reuters. July 17, 2007.
- ↑ Ponsonby-Fane, Richard. (1959). The Imperial House of Japan, p. 124.
- ↑ Institute for Japanese Culture and Classics, Kokugakuin University: Glossary of Shinto Names and Terms, Kampei Taisha.
- ↑ Ponsonby-Fane. Imperial, p. 125.
- ↑ Ponsonby-Fane, Richard. (1963). The Vicissitudes of Shinto, p. 394.