శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా | |
---|---|
జిల్లా | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా కేంద్రము | పుట్టపర్తి |
పరిపాలనా విభాగాలు |
|
విస్తీర్ణం | |
• Total | 8,925 కి.మీ2 (3,446 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 18,40,000 |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
Time zone | UTC 05:30 (IST) |
Website | https://srisathyasai.ap.gov.in/ |
శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో పాత అనంతపురం జిల్లాలో నుండి ఏర్పడింది. జిల్లా కేంద్రం పుట్టపర్తి. శ్రీ సత్య సాయి జిల్లాలో పెద్ద పట్టణం హిందూపురం
జిల్లా చరిత్ర
[మార్చు]పుట్టపర్తి అసలు పేరు గొల్లపల్లి. ఆ ప్రాంతమంతా పాము, చీమల పుట్టలు ఎక్కువగా ఉండటంతో. పుట్టపల్లి అని పేరు వచ్చింది. కాలక్రమేణా పుట్టపర్తి అయింది. ఈ జిల్లా చిత్రావతి నది ఒడ్డున ఉంది. 2022 లో అనంతపురం జిల్లాను విభజించి, శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు.[1]
భౌగోళిక స్వరూపం
[మార్చు]శ్రీ సత్య సాయి జిల్లా (పుట్టపర్తి) 13° -40′ 14°- 6′ ఉత్తర అక్షాంశం 76°-88′ 78°-30′ తూర్పు రేఖాంశం మధ్య ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో అనంతపురం జిల్లా, తూర్పున వైఎస్ఆర్ జిల్లా & అన్నమయ్య జిల్లాలు, పశ్చిమ నైరుతి సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 8,925 కి.మీ.
జిల్లా లోని పట్టణాలు
[మార్చు]జనగణన
[మార్చు]జిల్లా పరిధిలో జనాభా మొత్తం 18.4 లక్షలు.[ఆధారం చూపాలి]
పరిపాలనా విభాగాలు
[మార్చు]జిల్లా పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలు, 4 రెవెన్యూ డివిజన్లు, 32 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. పుట్టపర్తి రెవెన్యూ డివిజను కొత్తగా ఏర్పడింది.[2][3]
రెవెన్యూ డివిజన్లు, మండలాలు
[మార్చు]- కదిరి రెవెన్యూ డివిజన్
- ధర్మవరం రెవెన్యూ డివిజన్
- పుట్టపర్తి రెవెన్యూ డివిజన్
- పెనుకొండ రెవెన్యూ డివిజన్
పట్టణాలు
[మార్చు]రాజకీయ విభాగాలు
[మార్చు]లోక్‌సభ నియోజకవర్గం
[మార్చు]- హిందూపురం: దీని పరిధిలోని రాప్తాడు శాసనసభ నియోజకవర్గం పాక్షికంగా మాత్రమే జిల్లాలో ఉంది. రాప్తాడు, ఆత్మకూరు మండలాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి.[3]
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]- కదిరి
- ధర్మవరం
- పుట్టపర్తి
- పెనుకొండ
- మడకశిర (ఎస్.సి.రిజర్వుడ్)
- రాప్తాడు (పాక్షికం), దీని పరిధిలోని రాప్తాడు, ఆత్మకూరు మండలాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి.[3]
- హిందూపురం
విద్యా సౌకర్యాలు
[మార్చు]- శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పలువిద్యాసంస్థలున్నాయి. సంగీత విద్యాలయం ఉంది. మేనేజిమెంటు కళాశాల పుట్టపర్తి లో, పాలీటెక్నిక్ ధర్మవరం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హిందూపురంలో ఉన్నాయి.
పరిశ్రమలు
[మార్చు]- ధర్మవరం అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రం.
- జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు రామగిరి ప్రాంతాలలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి.
- పారిశ్రామికపరంగా గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, మోటారు కారు (కియా)
దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]- ప్రశాంతి నిలయం, పుట్టపర్తి: సత్యసాయి చేత స్థాపించబడిన అనేక సంస్థలు, అత్యాధునిక నైపుణ్యాల ఆసుపత్రి ఉన్నాయి.
- శ్రీ శృంగేరి ఆలయం, పుట్టపర్తి: 1.8 ఎకరాల విస్తీర్ణంలో సుందర ప్రకృతి నేపథ్యంలో ఉంది.
- వీరభద్ర స్వామి దేవాలయం, లేపాక్షి: ఈ ఆలయం విజయనగరాజుల కాలంనాటిది. ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు. సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీద నిలువెత్తు గాయకులు, నృత్యకారిణిల శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో దగ్గరలో 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించిన నంది శిలావిగ్రహం ఉంది.
- తిమ్మమ్మ మర్రిమాను, కదిరి: 5 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద మర్రిచెట్టు. 1989లో అతిపెద్ద వృక్షంగా గిన్నీస్ రికార్డులకు ఎక్కింది.
- బట్రేపల్లి వాటర్ ఫాల్స్, కదిరి: వర్షాకాలంలో ప్రవహించే జలపాతం
- శ్రీలక్ష్మీనారాయణాలయం, కదిరి: ఈ ఆలయంలోని విగ్రహం స్వేదజలాలను స్రవిస్తూ ఉండడం ఒక ఆధ్యాత్మిక అద్భుతం.
- మడకశిర కోట, మడకశిర: పురాతన కోట
జిల్లా ప్రముఖులు
[మార్చు]- సత్యసాయి బాబా ఆధ్యాత్మికవేత్త.
- ఫాదర్ ఫెర్రర్. ఆర్డిటి వ్యవస్థాపకుడు. సమాజ సేవకుడు.
- పరిటాల రవి రాజకీయ నాయకుడు మాజీ మంత్రి.
- ఎన్. రఘువీరా రెడ్డి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడుు
చిత్ర మాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ DES 2022, p. 15.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ 3.0 3.1 3.2 "సరికొత్త అనంత". ఆంధ్రజ్యోతి. 2022-04-04. Retrieved 2022-04-18.
వెలుపలి లంకెలు
[మార్చు]- DES (2022). DISTRICT HAND BOOK OF STATISTICS - Sri Sathya Sai district (PDF).