వెంగల్ చక్కరాయ్
వెంగల్ చక్కరాయ్ | |
---|---|
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు | |
In office 1949–1957 | |
అంతకు ముందు వారు | శ్రీపాద్ అమృత్ డాంగే |
తరువాత వారు | ఎస్ఎస్ మీరాజ్కర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వెంగల్ చక్కరాయ్ చెట్టియార్ 1880 జనవరి 17 |
మరణం | 1958 జూన్ 14 | (వయసు 78)
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. |
వెంగల్ చక్కరాయ్ చెట్టియార్ ( 1880 జనవరి 17 - 1958 జూన్ 14) తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ట్రేడ్ యూనియన్ కార్యకర్త.[1] ఎఐటియుసి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
తొలి జీవితం
[మార్చు]చక్కరాయ్ 1880, జనవరి 17న హిందూ చెట్టియార్ కుటుంబంలో జన్మించాడు. మద్రాస్ లోని స్కాటిష్ మిషన్ స్కూల్ లో ప్రాథమిక విద్యను, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో మాధ్యమిక విద్యను పూర్తిచేశాడు. 1901లో తత్వశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత మద్రాస్ లా కాలేజీలో న్యాయవిద్యను చదివి, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.
వృత్తిజీవితం - ఉద్యమం
[మార్చు]డానిష్ మిషన్ రూమ్‌లో 1913లో చక్కరాయ్ క్రైస్తవ బోధకునిగా చేరి, అందులో ఇరవై సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు. మహాత్మాగాంధీ శిష్యుడిగా చేరి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు.[2] 1941 నుండి 1942 వరకు మద్రాస్ మేయర్‌గా పనిచేశాడు. అతను 1954 నుండి 1957 వరకు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
మరణం
[మార్చు]వెంగల్ చక్కరాయ్ 1958, జూన్ 14న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Chakkarai, Vengal (1981). Vengal Chakkarai: a selection. Library of Indian Christian theology. Christian Literature Soc.
- ↑ Burbank, Ray. "Vengal Chakkarai: Indian Freedom Fighter and Christian Theologian" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-07. Retrieved 2021-09-07.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)
- Schouten, Jan Peter (2008). Jesus as Guru: The image of Christ among the Hindus and Christians in India. Rodopi. pp. 117–119.
అంతకు ముందువారు జి. జానకిరామ్ చెట్టి |
చెన్నై నగర మేయర్లు 1941-1942 |
తరువాత వారు సి. తడులింగ ముదలియార్ |