విత్తనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పప్పుధాన్యాలు విత్తనాలు.

విత్తనము మొక్కలు తయారుచేసినవి.

దీనినే బీజము అని కూడా అంటారు. మొక్కగా మారుటకు ఉపయోగపడే చెట్టు యొక్క భాగాన్నే విత్తనం అని అంటారు.

విత్తనపు మొక్క

[మార్చు]

విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను విత్తనపు మొక్కలు అంటారు. విత్తనపు మొక్కను ఆంగ్లంలో సీడ్ ప్లాంట్ లేక స్పెర్మటోఫైటీ (Seed plant or Spermatophyte) అంటారు.

టెంక

[మార్చు]
మామిడి ముట్టెలోని పిక్కల నుంచి మామిడి పిక్క నూనెను తీయుదరు.

టెంకను ముట్టి అని కూడా అంటారు. మామిడి, బాదం, రేగు, కొబ్బరి వంటి చెట్ల పండులో లేక కాయలో ఒక విత్తనం మాత్రమే ఉంటుంది, ఈ విత్తనాలు పెద్దవిగా, గట్టిగా ఉంటాయి, ఇటువంటి చెట్ల యొక్క విత్తనాలను టెంకలు లేక ముట్టెలు అంటారు. తాటి కాయలో ఒకటి నుంచి నాలుగు ముట్టెలు ఉంటాయి. వాడుక భాషలో రేగు పండు విత్తనాలు చిన్నవిగా ఉండుట వలన వీటి విత్తనాలను రేగు విత్తనాలనే పిలుస్తారు.

విత్తనోత్పత్తి

[మార్చు]
పొద్దుతిరుగుడుపువ్వు గింజలు భీజోత్పత్తిని ప్ర్రారంభించిన మూడు రోజుల తరువాత

విత్తనం లేక బీజ కణము క్రమంగా పెరగడం ప్రారంభించడాన్ని బీజోత్పత్తి అంటారు. ఈ విధంగా విత్తనం లేక బీజ కణము నుండి మొక్క లేక శిలీంద్రం ఆవిర్భవిస్తుంది. సంవృతబీజవృంతం లేక వివృతబీజవృంతం నుండి అంకురం లేక నారుమొక్క అరంభమవడం భీజోత్పత్తికి ఉదాహరణ. అయినప్పటికి బీజకణోత్పత్తి నుండి ఒక బీజకణం పెరగడం ఉదాహరణకు హైఫా (దారపుకొమ్మ) నుండి బీజకణాలు పెరగడం కూడా బీజోత్పత్తి. చాలా సాధారణంగా జీవం ఉనికి లేక బీజం విశాలంగా విస్తరించేలా సాధించగలగడాన్ని సూచించడమే భీజోత్పత్తి.

నూనె గింజలు

[మార్చు]

వివిధ రకాల నూనెలను తయారుచేయడానికి ఉపయోగపడే గింజలు లేదా విత్తనాలు - నూనె గింజలు (Oil Seeds).

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విత్తనం&oldid=4237326" నుండి వెలికితీశారు