వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 11
స్వరూపం
- 1754: స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ బ్లాక్ కార్బన్ డయాక్సైడ్ (CO2)ను కనుగొన్నాడు.
- 1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడినది.
- 1897: బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం (మ.1927).
- 1924: భారతీయ వ్యంగ్య చిత్రకారుడు అబు అబ్రహాం జననం (మ.2002).
- 1932: నాట్యావధాన కళాస్రష్ట ధారా రామనాథశాస్త్రి జననం (మ.2016).
- 1935: మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు. (చిత్రంలో)
- 1948: బీహార్ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ జననం.
- 1983: భారతదేశ వ్యాపారవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా మరణం (జ.1894).
- 1988: సాధారణ ప్రజా లైసెన్సు (జీ పీ యల్) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది
- 2013: భారతదేశ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకుడు విద్యా చరణ్ శుక్లా మరణం (జ.1929).