Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2011

వికీపీడియా నుండి

2011 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

1వ వారం
వీరవాసరం గ్రామం

వీరవాసరము, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండల కేంద్రము

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
2వ వారం
భైషజ్యగురు బుద్ధుడు

భైషజ్యగురు బుద్ధుడు మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. కొరియాకు చెందిన కంచు విగ్రహం ఈ బొమ్మలో ఉంది.

ఫోటో సౌజన్యం: డేనియల్ క్రేగ్
3వ వారం
విశాఖపట్నం ఓడరేవు

విశాఖపట్టణం ఓడరేవు ఒక సహజసిద్ధమైన ఓడరేవు. "డాల్ఫిన్స్ నోస్" అనే కొండ కారణంగా ఈ రేవులో పెద్ద అలలు అదుపులో ఉంటాయి.

ఫోటో సౌజన్యం: Sureshiras
4వ వారం
నేలకొండపల్లి స్తూపం సమీపదృశ్యం

నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. పరిరక్షణ లేక శిధిలమౌతున్న స్తూపాన్ని ఇక్కడ చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: దీపశిఖ
5వ వారం
అక్కమహాదేవి

అక్క మహాదేవి ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. గోదాదేవి వలెనే ఈమె శ్రీశైల మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరుని సమకాలికురాలు

ఫోటో సౌజన్యం: Amarrg
6వ వారం


కింగ్ జార్జి ఆసుపత్రి

కింగ్ జార్జి ఆసుపత్రి, విశాఖపట్నం నగరంలో పేరెన్నికగన్న ప్రభుత్వ వైద్యశాల.

ఫోటో సౌజన్యం: కడియాల చైతన్య
7వ వారం

[[బొమ్మ:|300px|center|alt=తురిమెళ్ళ కనక సురబేశ్వర మందిరం]] తురిమెల్ల, ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన గ్రామము. తురిమెళ్ళ సమీపంలో గుండ్లకమ్మ నదిప్రక్కన కనక సురబేశ్వర మందిరం

ఫోటో సౌజన్యం: Ramireddy
8వ వారం
గరుడారూఢుడైన విష్ణువు

బ్యాంగ్‌కాక్ లోని ఒక హోటల్ ముందు శిల్పం - గరుడునిపై విష్ణువు

ఫోటో సౌజన్యం: Benutzer:Hdamm
9వ వారం
బాపు మెచ్చుకొన్న బాబు కార్టూన్

"కొలను వెంకటదుర్గాప్రసాద్", బాబు అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్యంగ్యచిత్రకారుడు. తరిగిపోతున్న "ఱ" (బండీ రా)వినియోగం గురించి అతను వేసిన ఈ చిత్రం బాపు ప్రశంసలు పొందింది.

ఫోటో సౌజన్యం: శివా
10వ వారం
బోయింగ్ 777 కాక్‌పిట్

బోయింగ్ 777 అనేది ఒక సుదూర, వైడ్-బాడీ కలిగిన రెండు ఇంజిన్ల జెట్ విమానం. ఈ విమానంలో కాక్‌పిట్ బొమ్మ ఇక్కడ ఉన్నది

ఫోటో సౌజన్యం: Bill Abbott
11వ వారం
కట్టంగూర్ పశువుల సంత

కట్టంగూర్, నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఈ గ్రామంలో జరిగే పశువుల సంతను ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
12వ వారం


హోళీ పండుగ

హోలీ అనేది రంగుల పండుగ , హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాలలో ఉంటున్న భారతజాతి వారు కూడా జరుపుకుంటారు.

ఫోటో సౌజన్యం: మిధున్ కుమార్ అల్లు
13వ వారం


(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది.

ఫోటో సౌజన్యం: డా.పి.మురళీ కృష్ణ
14వ వారం
మైసూర్ రాజభవన ప్రవేశ ద్వారం

మైసూర్ రాజభవనం కర్ణాటకలో పర్యటించే వారికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.

ఫోటో సౌజన్యం: రవికిరణ్ కాజా
15వ వారం


పిల్లలమర్రి వృక్షం

పిల్లలమర్రిచెట్టు , మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
16వ వారం
కెమెరా అబ్స్క్యురా

ఫొటోగ్రఫీ ప్రక్రియకు మూలమైన కెమెరా - కెమెరా అబ్స్క్యురా - దీనిద్వారా ఒక చిత్రం ఛాయను ఒక తెరపై పడేలా చేసేవారు.

ఫోటో సౌజన్యం: Denniss
17వ వారం

[[బొమ్మ:|225px|center|alt=పెంచలకోన]] పెంచలకోన పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా రాపూరుకు 35 కి.మీ దూరంలో ఉంది. ఏప్రిల్ లో జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారు.

ఫోటో సౌజన్యం: మాల్యాద్రి
18వ వారం


తులసీరాం కార్టూను

తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో వేల కార్టూన్లను ప్రచురించినవాడు తులసీరాం. ఇతని అసలు పేరు 'షరాఫ్ తులసీ రామాచారి'.

ఫోటో సౌజన్యం: శివ
19వ వారం
విస్సన్నపేట

విస్సన్నపేట, కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
20వ వారం
మహిషాసురుడు

మైసూరు నగరంలో చాముండి కొండపైన మహిషాసురుని విగ్రహం

ఫోటో సౌజన్యం: సర్వజ్ఞ
21వ వారం
విశాఖపట్నం

ఆకాశం నుండి విశాఖపట్నం పట్టణ దృశ్యం

ఫోటో సౌజన్యం: Candeo_gauisus
22వ వారం
హైదరాబాదు యాబిడ్స్

హైదరాబాదు నగరంలో అబీడ్స్ ఒక ప్రాంతం. ఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠీలో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.

ఫోటో సౌజన్యం: వీర శశిధర్
23వ వారం
పొన్నూరు పట్టణం దృశ్యం

పొన్నూరు, గుంటూరు జిల్లాలొ ఒక మండలము మరియు పట్టణము. ఈ పట్టణం గుంటూరు, చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
24వ వారం
గిద్దలూరు చర్చి

గిద్దలూరు, ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. ఈ వూరిలోని సి.ఎస్.ఐ. చర్చిని ఈ బొమ్మలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
25వ వారం
నరసింహావతారము

దశావతారాలలో నాలుగవదైన నరసింహావతారము.
1760 కాలానికి చెందిన పటచిత్రం.

ఫోటో సౌజన్యం: Los Angeles County Museum of Art
26వ వారం


ఒమన్‌లో జబల్ అక్దర్ ప్రాంతంలో ఇల్లు

జబల్ అక్దర్ అనేవి ఒమన్ దేశంలోని కొన్ని పర్వత శ్రేణులు. ఆ కొండలలో ఒక ఇంటిని ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: అంబటి శ్రీధర్
27వ వారం

[[బొమ్మ:|300px|center|alt={{{caption}}}]] కువెంపు విశ్వవిద్యాలయం లోని దూరవిద్యా విభాగం

ఫోటో సౌజన్యం: Kkm010
28వ వారం
{{{caption}}}

తెలుగు విశ్వవిద్యాలయంలో గల డాఁ నందమూరి తారకరామా రావు కళామందిరం

ఫోటో సౌజన్యం: Hindustanilanguage
29వ వారం
{{{caption}}}

పురివిప్పి ఆడుతున్న తెలుపు నెమలి

ఫోటో సౌజన్యం: Mpradeep
30వ వారం

[[బొమ్మ:|300px|center|alt={{{caption}}}]] లేపాక్షి లో గల నంది విగ్రహం

ఫోటో సౌజన్యం: Maheshkhanna
31వ వారం
{{{caption}}}

మణిపాల్ విశ్వ విద్యాలయం

ఫోటో సౌజన్యం: JVRKPRASAD
32వ వారం
{{{caption}}}

తణుకు పెరవలి రోడ్డులో కల కాటన్ విగ్రహము

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
33వ వారం

[[బొమ్మ:|300px|center|alt={{{caption}}}]] పెంచలకోన

ఫోటో సౌజన్యం: మాల్యాద్రి
34వ వారం


యళ్ళాయపాలెం సంత

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం గ్రామం సంతలో ఒక దృశ్యం

ఫోటో సౌజన్యం: జితేష్
35వ వారం

[[బొమ్మ:‎|200px|center|alt=యశోద కృష్ణ సినిమా పోస్టర్]] యశోద కృష్ణ సినిమా పోస్టర్

ఫోటో సౌజన్యం: http://www.kaddvd.com/
36వ వారం
మత సామరస్యం సందేశం

మత సామరస్యం గురించిన సందేశంతో ఉన్న ఒక బోర్డు. కాశ్మీర్లో ఉన్నది.

ఫోటో సౌజన్యం: శశికాంత్
37వ వారం
రంగాపురం దేవాలయంలో శిల్పం

రంగాపురం (లింగపాలెం), పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామము. ఈ వూరిలోని శ్రీ భూనీళాసమేత సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో లక్ష్మీదేవి శిల్పం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
38వ వారం
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుండి నీరు వదిలిన దృశ్యం

ఈ వారం లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి నీరు వదిలేరు..ఎత్తు నుండి ఉరకలు వేస్తూ కృష్ణానది దిగువకు దూకే దృశ్యం

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు
39వ వారం

[[బొమ్మ:|300px|center|alt=పునర్నిర్మిత నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలు]] అనుపు, గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ రిజార్వయర్ ముంపు గ్రామము. భారత ప్రభుత్వ పురావస్తు శాఖ తవ్వకాలలో బయలు పడ్డ నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలను అనుపు గ్రామంలో పునర్మించారు. ఆ పునర్మినాత శిధిలాలలో ఒక శిధిలం ఈ ఫొటో .

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు
40వ వారం


మచిలీపట్నం కోనేరు సెంటర్

మచిలీపట్నం కోనేరు సెంటర్

ఫోటో సౌజన్యం: Ganeshk
41వ వారం


ఇస్లామీయ లిపి కళాకృతి

ఇస్లామీయ లిపీ కళాకృతులు - ఉస్మానియా సామ్రాజ్యం, సుల్తాన్ మహమూద్ II, యొక్క సంతకం. దీనిలోని వ్రాత "మహమూద్ ఖాన్, తండ్రి అబ్దుల్ హమీద్, ఎల్లప్పుడూ విజేయుడు

ఫోటో సౌజన్యం: Saperaud
42వ వారం
రామప్ప దేవాలయం

రామప్ప దేవాలయం

ఫోటో సౌజన్యం: శంకర్ కర్నాటి - కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
43వ వారం
కెనడా అత్యున్నత న్యాయస్థానం పార్లమెంట్ హిల్ మీద నుంచి చూసినపుడు కనిపించే దృశ్యం

కెనడా అత్యున్నత న్యాయస్థానం పార్లమెంట్ హిల్ మీద నుంచి చూసినపుడు కనిపించే దృశ్యం

ఫోటో సౌజన్యం: LogosV.
44వ వారం


రంగవల్లి

ఒక ఇంటిముందు వేసిన ముగ్గు లేదా రంగవల్లి

ఫోటో సౌజన్యం: రాజశేఖర్
45వ వారం


సీత చూడామణిని తీసుకొంటున్న హనుమంతుడు

సీత చూడామణిని తీసుకొంటున్న హనుమంతుడు - రామాయణం సుందర కాండములోని విషయం - హంపి హజారరామాలయంలోని శిల్పం

ఫోటో సౌజన్యం: సోహమ్ బెనర్జీ
46వ వారం

[[బొమ్మ:|200px|center|alt=గరిబాల్ది.]] గిసేప్పి గరిబాల్ది.

ఫోటో సౌజన్యం: Belissarius
47వ వారం


సినిమా టిక్కెట్లకోసం కోలాహలం

ఏలూరులో సినిమా టిక్కెట్లకోసం కోలాహలం. కృష్ణ సినిమా ఆడుతున్న సందర్భంగా తీయబడిన ఫొటో.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
48వ వారం
గరుత్మంతునిపై లక్ష్మి, విష్ణువు

గరుత్మంతునిపై విష్ణువు, లక్ష్మి - 1730 కాలపునాటి చిత్రం

ఫోటో సౌజన్యం: Los Angeles County Museum of Art
49వ వారం
శ్రీకృష్ణరాయబారం నాటకం

ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం వారు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం పౌరాణిక నాటకంలోని ఒక దృశ్యం

ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె.ఎస్.పాపారావు
50వ వారం


మొదటి రంగుల ఫొటోగ్రాఫ్

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్అనే పరిశోధకుడు 1861 లో ప్రపంచంలో మొట్ట మొట్టమొదటి పూర్తి రంగుల చాయా చిత్రాన్ని తీసాడు.

ఫోటో సౌజన్యం: Scanned from The Illustrated History of Colour Photography
51వ వారం


గిద్దలూరు టొమేటో మార్కెట్

గిద్దలూరు టొమేటో మార్కెట్

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి
52వ వారం
శ్రీ సీతారాముల పరివారం

రామాయణం భారతదేశంలో ప్రసిద్ధ ఇతిహాసం.
జీలకర్రగూడెం ఆలయంలో
సీతారాముల పరివారం శిల్పాలు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు