వారసిగూడ
వారసిగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°25′05″N 78°30′47″E / 17.418°N 78.513°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
వార్డు | వార్డు నెం. 11 సర్కిల్ నెం. 18 |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC 5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 061 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
వారసిగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాదు సమీపంలో ఉంది.[1] ఈ ప్రాంతానికి వారిస్ నవాబ్ పేరును పెట్టారు.
పద వివరణ
[మార్చు]వారసిగూడ అనే పేరు వారిస్, గూడ అనే రెండు పదాల నుండి వచ్చింది. హైదరాబాద్ నిజాం నుండి బహుమతిగా ఈ భూమిని పొందిన వారిస్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించాడు. గూడ అంటే జనాభా ఉన్న ప్రాంతం అని అర్థం. ఈ ప్రాంతం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిమితుల్లోకి వస్తుంది
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో ఎల్ఎన్ నగర్, పార్సిగుట్ట, అంబర్ నగర్, మహమూద్గుడ, బౌద్ధ నగర్, మాధురి నగర్, పార్సిగుట్ట, స్కందగిరి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
సంస్కృతి
[మార్చు]ఇస్లామిక్ మత ప్రార్థనా స్థలాలు జామియా మసీదు అల్-కౌసర్, మసీదు ఇ ఫిర్దాస్, మసీదు ఇ సామి వో హుస్సేన్, మసీదు-ఇ-నూర్-ఇ-మొహమ్మదియా మొదలైన మసీదులు ఉన్నాయి.
హిందూ మత ప్రార్థనా స్థలాలు శ్రీ ఉమాచంద్రమౌలేశ్వరస్వామి దేవాలయం, సీతారామాంజనేయస్వామి దేవాలయం, షిరిడి సాయిబాబా దేవాలయం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం[2] మొదలైన దేవాలయాలు ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది. కాకతీయ టెక్నో స్కూల్, జ్యోతి మోడల్ హైస్కూల్, సుమిత్రా హైస్కూల్, జవహర్ ఇంగ్లీష్ హైస్కూల్, బాలాజీ హైస్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, నేతాజీ పబ్లిక్ హైస్కూల్ మొదలైన పాఠశాలలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వారసిగూడ మీదుగా 86 నెంబరు గల బస్సు సికింద్రాబాద్ నుండి కోఠి వరకు, 107జె నెంబరు గల బస్సు సికింద్రాబాద్ నుండి దిల్‍సుఖ్‍నగర్ వరకు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Warasiguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Sri SubrahmanyaSwamy Devalayam". srisubrahmanyaswamydevalayamskandagiri.org. Retrieved 2021-01-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.