వాఘా
వాఘా
ਵਾਹਗਾ / वाघा / واہگہ Wahga | |
---|---|
గ్రామం | |
దేశం | Pakistan |
ప్రావిన్స్ | పంజాబ్, పాకిస్తాన్ |
జిల్లా | లాహోర్ |
తహసీల్ | వాఘా టవున్ |
Time zone | UTC 5 (పి.ఎస్.టి) |
• Summer (DST) | 6 |
వాఘా (పంజాబీ(గురుముఖి): ਵਾਹਗਾ, English: Wagah,హిందీ:वाघा,ఉర్దూ:واہگہ) భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దును దాటే రహదారి సమీపంలో ఉన్న గ్రామం, సరుకు రవాణా టర్మినల్, రైల్వే స్టేషన్.[1] భారతదేశంలోని అమృత్‌సర్, పాకిస్తాన్‌లోని లాహోర్ నగరాలను కలిపే గ్రాండ్‌ట్రంక్ రోడ్డుపై ఈ గ్రామం నెలకొని ఉంది.
భారత్-పాక్ సరిహద్దు లాహోర్ నుండి 24 కిలోమీటర్లు (15 మై.) దూరంలోను, అమృత్‌సర్ నుండి32 కిలోమీటర్లు (20 మై.) దూరంలో ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం అట్టారి గ్రామానికి 3 కిలోమీటర్లు (1.9 మై.)ల సమీపంలో ఉంది.
పర్యావలోకనం
[మార్చు]వాఘా (పాకిస్తాన్‌లో వాహ్ఘా) భారత పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్‌క్లిఫ్ అవార్డ్ ప్రకారము గీచిన విభజనరేఖ సమీపంలో ఉన్న గ్రామం.[2] ఈ గ్రామం సరిహద్దురేఖకు పశ్చిమాన 600 మీటర్ల దూరంలో ఉంది. 1947లో దేశవిభజన సమయంలో భారతదేశంలోని అనేక మంది ముస్లిం ప్రజలు ఈ ప్రాంతం నుండే పాకిస్తాన్ దేశానికి వలస వెళ్ళారు. పాకిస్తాన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని వాఘా బార్డర్ అని పిలుస్తారు. కాగా భారతీయులుఇక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్న అట్టారి అనే గ్రామం పేరుతో దీనిని అట్టారి బార్డర్ అని పిలుస్తారు.
వాఘా బార్డర్ వేడుక లేదా బీటింగ్ రిట్రీట్ వేడుక
[మార్చు]ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది.[2] 1959నుండి ఈ ఆనవాయితీ ఉన్నది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది.
చిత్రమాలిక
[మార్చు]-
వాఘా బార్డర్ వద్ద పాకిస్తానీ గేటు
-
మహాత్మాగాంధీ చిత్రం ఉన్న భారత భవనం
-
మహమ్మద్ అలీ జిన్నా చిత్రం ఉన్న పాకిస్తానీ భవనం
-
వాఘాలో భారత సరిహద్దు రక్షణదళం (బి.ఎస్.ఎఫ్)
-
వాఘాలో భారత సరిహద్దు రక్షణదళానికి చెందిన మహిళాజవాన్లు
-
భారత, పాక్ దేశాల జాతీయపతాకాల అవనత వేడుకను తిలకిస్తున్న ప్రజలు
-
వాఘా బార్డర్ సమీపంలోని మైలురాయి
మూలాలు
[మార్చు]- ↑ "Mixed feelings on India-Pakistan border". BBC News. 14 August 2007.
- ↑ 2.0 2.1 Frank Jacobs (3 July 2012). "Peacocks at Sunset". Opinionator: Borderlines. The New York Times. Retrieved 15 July 2012.