లంగ్‌డంగ్
లంగ్‌డంగ్,భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని లంగ్‌డంగ్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.ఇది అస్సాంలోని టిన్సుకియానుండి 150 కిలోమీటర్ల దూరంలోఉంది.ఈ పట్టణం లంగ్‌డంగ్ జిల్లా ఏర్పడకముందు తిరప్ జిల్లా పరిధిలో ఉంది.లంగ్‌డంగ్ పట్టణం జిల్లా పరిపాలనా ముఖ్యపట్టణంగా, తిరప్ జిల్లా దక్షిణభూభాగం వేరుచేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 17 వ జిల్లాగా లంగ్‌డంగ్ జిల్లాను 2012 మార్చి, 19న కొత్తగా రూపొందించారు.[1]
గణాంకాలు
[మార్చు]లంగ్‌డంగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని లంగ్‌డంగ్ జిల్లాలో నోటిఫైడ్ ఏరియా నగరం. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం లంగ్‌డంగ్ నోటిఫైడ్ ఏరియాలో 4,234 జనాభా ఉంది, వారిలో 2,258 మంది పురుషులు, 1,976 మంది మహిళలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 717, ఇది లంగ్‌డంగ్ మొత్తం జనాభాలో 16.93%గాఉంది. లంగ్‌డంగ్ నోటిఫైడ్ ఏరియాలో, స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 938 కు వ్యతిరేకంగా (875) గా ఉంది. అంతేకాక, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సగటు 972 తో పోల్చితే, లంగ్‌డంగ్ పిల్లల లింగ నిష్పత్తి 806 గా ఉంది.అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 65.38% కన్నా (68.50%) ఎక్కువ .పురుషుల అక్షరాస్యత 77.16% కాగా, మహిళల అక్షరాస్యత రేటు 58.76%గా ఉందిలంగ్‌డంగ్ నోటిఫైడ్ ఏరియాలో మొత్తం 926 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది, దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ సరఫరా చేస్తుంది.లంగ్‌డంగ్ నోటిఫైడ్ ఏరియా పరిమితుల్లోని రహదారులను నిర్మించడానికి, నిర్వహించటానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం ఉంది.[2]
మతాలు ప్రకారం పట్టణ జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం లంగ్‌డంగ్ పట్టణ జనాభా 4234 మొత్తంలో హిందువులు 19.44%, ముస్లింలు 2.17%, క్రిష్టియన్లు 75.96%, సిక్కులు 0.09%,బౌద్ధులు 0.90%,జైనులు 0.09%, ఇతరులు 1.35% మంది నివసిస్తున్నారు.[2]
మూలాల
[మార్చు]- ↑ "Longding – Arunachal Pradesh". www.arunachalpradesh.gov.in. Retrieved 2021-05-13.
- ↑ 2.0 2.1 "Longding Notified Area City Population Census 2011-2021 | Arunachal Pradesh". www.census2011.co.in. Retrieved 2021-05-13.