Jump to content

రామ్‌నగర్ (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°43′18″N 83°18′42″E / 17.721742°N 83.311652°E / 17.721742; 83.311652
వికీపీడియా నుండి
రామ్‌నగర్
సమీపప్రాంతం
రామ్‌నగర్ రోడ్డు
రామ్‌నగర్ రోడ్డు
రామ్‌నగర్ is located in Visakhapatnam
రామ్‌నగర్
రామ్‌నగర్
విశాఖట్నం నగర పటంలో రామ్‌నగర్ స్థానం
Coordinates: 17°43′18″N 83°18′42″E / 17.721742°N 83.311652°E / 17.721742; 83.311652
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530002
Vehicle registrationఏపి-31

రామ్‌నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం.[1] ఇది విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°43′18″N 83°18′42″E / 17.721742°N 83.311652°E / 17.721742; 83.311652 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ద్వారకా నగర్, అసీల్‌మెట్ట, డాబా గార్డెన్స్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

వాణిజ్యం

[మార్చు]

నగరంలోని ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాలలో ఒకటైన రామ్‌నగర్ ప్రాంతంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉన్నాయి.[4] ఇక్కడికి సమీపంలోని వాల్తేరు రోడ్డులలో ప్రధాన రహదారిలో దుస్తులు, వంటగది వస్తువులు, బూట్లు, బొమ్మలు, బహుమతులు మొదలైన వస్తువుల దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు, బేకరీలు కూడా ఉన్నాయి.

ఆస్పత్రులు

[మార్చు]

ఈ ప్రాంతంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, అపోలో హార్ట్ సెంటర్, లాజరస్ హాస్పిటల్స్, ఓమ్ని ఆర్కె ఆస్పత్రి వంటి కార్పొరేట్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి.

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రామ్‌నగర్ మీదుగా వెంకోజిపాలెం, అప్పుఘర్, వుడా పార్క్, ఏయు అవుట్‌గేట్, సిరిపురం, గవర్నర్ బంగ్లా, గ్రీన్ పార్క్, జగదాంబ సెంటర్, టర్నర్ చౌల్ట్రీ, పూర్ణా మార్కెట్, కుర్పాం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, దువ్వాడ రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. సిద్ధి వినాయక దేవాలయం
  2. వెంకటేశ్వర దేవాలయం
  3. మసీదు ఇ సిరాజ్

మూలాలు

[మార్చు]
  1. "Ramnagar, Sriram Nagar, Visakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 9 May 2021.
  2. "location". deccan chronicle. 11 September 2017. Retrieved 9 May 2021.
  3. "Ram Nagar , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 9 May 2021.
  4. "about". new Indian express. 30 April 2017. Retrieved 9 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 9 May 2021.