Jump to content

రమేష్ బైస్

వికీపీడియా నుండి
రమేష్ బైస్
2024లో రమేష్ బైస్
ఝార్ఖండ్ రాష్ట్ర 10వ గవర్నరు
In office
2021 జులై 14 – 2023 ఫిబ్రవరి 12
ముఖ్యమంత్రిహేమంత్ సోరెన్
అంతకు ముందు వారుసీ.పీ. రాధాకృష్ణన్
త్రిపుర రాష్ట్ర 18వ గవర్నరు
In office
2019 జులై 29 – 2021 జులై 6
ముఖ్యమంత్రివిప్లవ్ కుమార్ దేవ్
అంతకు ముందు వారుకెప్టెన్ సింగ్ సోలంకి
తరువాత వారుసత్యదేవ్ నారాయణ్ ఆర్య
రాయ్‌పూర్ లోక్‌సభ సభ్యుడు
In office
1996–2019
తరువాత వారుసునీల్ కుమార్ సోని
In office
1989–1991
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
In office
2004 జనవరి 9 – 2004 మే 23
ప్రధాన మంత్రిఅటల్ బిహారి వాజపేయి
ఘనుల శాఖ కేంద్ర రాష్ట్ర మంత్రి
In office
2003 జనవరి 29 – 2004 జనవరి 8
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
అంతకు ముందు వారుఉమా భారతి
తరువాత వారుమమతా బెనర్జీ
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి
In office
2000–2003
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
కేంద్ర రసాయన , ఎరువుల శాఖ మంత్రి
In office
1999 అక్టోబరు 13 – 2000 సెప్టెంబరు 30
ప్రధాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
వ్యక్తిగత వివరాలు
జననం (1947-08-02) 1947 ఆగస్టు 2 (వయసు 77)
రాయ్‌పూర్, సెంట్రల్ ప్రావిన్సులు, బెరార్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశం)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిరమాబాయి
సంతానం3

రమేష్ బైస్, (జననం 1948 ఆగస్టు 2) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2023 ఫిబ్రవరి 18 నుండి 2024 జులై 30 వరకు వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసారు. అంతకు ముందు అతను జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.[1][2] ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు.1999 నుండి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా ఉన్నాడు. ఇతను రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 9 వ (1989), 11 వ (1996), 12 వ, 13 వ, 14 వ (2004), 15 ఇంకా 16 వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బైస్ 1948 ఆగస్టు 2 న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాయ్‌పూర్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ) లో ఒక హిందూ క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఖోమలాల్ బైస్. భోపాల్ పట్టణంలో బైస్ తన హయ్యర్ సెకండరీ విద్య BSE ను పూర్తి చేశాడు. ఇతనికి 1969 మే 23న రాంబాయి బైస్ తో వివాహమైనది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బైస్ వృత్తిరీత్యా వ్యవసాయదారుడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

1978 లో రాయ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు బైస్ మొదటిసారి ఎన్నికయ్యాడు. మందిర్ హసోద్ నియోజకవర్గం నుండి 1980 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచాడు, ఆ తరువాత దఫా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్యనారాయణ శర్మ చేతిలో ఓడిపోయాడు. 1989లో రాయపూర్ నియోజకవర్గం నుండి మొట్టమొదటి సారి 11వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన బైస్ ఆ తరువాత క్రమంగా 12,13,14,16వ లోక్‌సభ ఎన్నికలు కూడా గెలుపొందాడు.

బైస్ 2019 జూలై నుండి 2021 జూలై వరకు త్రిపుర రాష్ట్ర 18 వ గవర్నర్‌గా పనిచేశాడు[4], 2021 జూలై 14 నుండి 2023 ఫిబ్రవరి 12 వరకు జార్ఖండ్ 10 వ గవర్నర్‌గా పనిచేసాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Governor designate Ramesh Bais reaches Ranchi, to take oath on Wednesday". United News of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
  2. "Tripura On Road To Development, Says Outgoing Governor Ramesh Bais". Outlook (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
  3. "Current Lok Sabha Members Biographical Sketch". 5 September 2004. Archived from the original on 5 September 2004. Retrieved 21 July 2019.
  4. Sarkar, Ipsita (20 July 2019). "Centre appoints new Governors in 6 states, Anandiben Patel transferred to UP". Zee News (in ఇంగ్లీష్). Retrieved 21 July 2019.
  5. "Ramesh Bais takes oath as Jharkhand Governor". The Hindu (in Indian English). PTI. 2021-07-14. ISSN 0971-751X. Retrieved 2021-07-15.{{cite news}}: CS1 maint: others (link)

బాహ్య లింకులు

[మార్చు]