ఐరోపా
ఐరోపా | |
విస్తీర్ణం | 10,180,000 కి.మీ.² (3,930,000 చ.మై.) |
---|---|
జనాభా | 731,000,000 |
జనసాంద్రత | 70/కి.మీ.² (181/చ.మై.) |
ca. 50 | |
ప్రాంతీయత | ఐరోపా |
భాషా కుటుంబాలు | ఇండో-ఐరోపా Finno-Ugric Altaic Basque Semitic North Caucasian |
పెద్ద నగరాలు | ఇస్తాంబుల్, మాస్కో, లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సెలోనా, సెయింట్ పీటర్స్ బర్గ్, మిలాన్, బెర్లిన్, రోమ్, ఏథెన్స్, కీవ్, బుచారెస్ట్ |
టైం జోన్లు | UTC (ఐస్‌ల్యాండ్) నుండి UTC 5 (రష్యా) వరకు |
సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. ఐరోపా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం , నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా , ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది , కాస్పియన్ సముద్రం ఉన్నాయి.[1] విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా , వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక , రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు , జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.
రాజకీయ భౌగోళికం
[మార్చు]అనేక సిద్ధాంతాలు , విపులీకరణల తరువాత ఐరోపా ఖండాన్ని భౌగోళిక , రాజకీయ ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటిలో 50 దేశాలు గలవు. ఐరోపా సమాఖ్యలో 27 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. క్రింది పట్టిక ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తున్నది.[2]
ప్రాంతము లేదా ఉప-ప్రాంతము పేరు , పతాకము |
విస్తీర్ణం (కి.మీ²) |
జనాభా ( 2002 జూలై 1 నాటి అంచనా.) |
జనసాంద్రత (ప్రతి చ.కి.మీ.) |
రాజధాని |
---|---|---|---|---|
ఆలాండ్ (ఫిన్లాండ్) | 1,552 | 26,008 | 16.8 | మారీహామ్న్ |
అల్బేనియా | 28,748 | 3,600,523 | 125.2 | తిరానా |
అండోర్రా | 468 | 68,403 | 146.2 | అండోర్రా లా వెల్లా |
ఆస్ట్రియా | 83,858 | 8,169,929 | 97.4 | వియన్నా |
ఆర్మీనియా | 29,800 | 3,229,900 | 101 | యెరావాన్ |
అజర్‌బైజాన్ | 86,600 | 8,621,000 | 97 | బాకు |
బెలారస్ | 207,600 | 10,335,382 | 49.8 | మిన్స్క్ |
బెల్జియం | 30,510 | 10,274,595 | 336.8 | బస్సెల్స్ |
బోస్నియా , హెర్జెగొవీనా | 51,129 | 4,448,500 | 77.5 | సరజేవో |
బల్గేరియా | 110,910 | 7,621,337 | 68.7 | సోఫియా |
క్రొయేషియా | 56,542 | 4,437,460 | 77.7 | జగ్రెబ్ |
సైప్రస్ | 9,251 | 788,457 | 85 | నికోసియా |
చెక్ రిపబ్లిక్ | 78,866 | 10,256,760 | 130.1 | ప్రేగ్ |
డెన్మార్క్ | 43,094 | 5,368,854 | 124.6 | కోపెన్‌హాగన్ |
ఎస్టోనియా | 45,226 | 1,415,681 | 31.3 | టల్లిన్ |
ఫరోయె (డెన్మార్క్) | 1,399 | 46,011 | 32.9 | తోర్షావన్ |
ఫిన్లాండ్ | 336,593 | 5,157,537 | 15.3 | హెల్సెంకి |
ఫ్రాన్సు | 547,030 | 59,765,983 | 109.3 | పారిస్ |
జార్జియా | 69,700 | 4,661,473 | 64 | తిబ్లిసి |
జర్మనీ | 357,021 | 83,251,851 | 233.2 | బెర్లిన్ |
జిబ్రాల్టర్ (యునైటెడ్ కింగ్ డం) | 5.9 | 27,714 | 4,697.3 | జిబ్రాల్టర్ |
గ్రీసు | 131,940 | 10,645,343 | 80.7 | ఏథెన్సు |
గెర్నెసీ | 78 | 64,587 | 828.0 | సెయింట్ పీటర్ పోర్ట్ |
హంగేరి | 93,030 | 10,075,034 | 108.3 | బుడాపెస్ట్ |
ఐస్‌లాండ్ | 103,000 | 307,261 | 2.7 | రేక్‌జవిక్ |
ఐర్లండ్ రిపబ్లిక్ | 70,280 | 4,234,925 | 60.3 | డబ్లిన్ |
ఐసెల్ ఆఫ్ మ్యాన్ | 572 | 73,873 | 129.1 | డగ్లస్ |
ఇటలీ | 301,230 | 58,751,711 | 191.6 | రోమ్ |
జెర్సీ | 116 | 89,775 | 773.9 | సెయింట్ హెలియర్ |
కజకస్తాన్ | 2,724,900 | 15,217,711 | 5.6 | ఆస్తానా |
కొసావో | 10,887 | 2,126,708 | 220 | ప్రిస్టీనా |
లాత్వియా | 64,589 | 2,366,515 | 36.6 | రిగా |
లీచెన్‌స్టైన్ | 160 | 32,842 | 205.3 | వడూజ్ |
లిథువేనియా | 65,200 | 3,601,138 | 55.2 | విల్నియస్ |
లక్సెంబర్గ్ | 2,586 | 448,569 | 173.5 | లక్సెంబర్గ్ (నగరం) |
ఉత్తర మేసిడోనియా | 25,333 | 2,054,800 | 81.1 | స్కోప్జే |
మాల్టా | 316 | 397,499 | 1,257.9 | వల్లెట్టా |
మాల్డోవా | 33,843 | 4,434,547 | 131.0 | చిస్‌నావ్ |
మొనాకో | 1.95 | 31,987 | 16,403.6 | మొనాకో |
మాంటెనెగ్రో | 13,812 | 616,258 | 44.6 | పొడ్గోరికా |
నెదర్లాండ్స్ | 41,526 | 16,318,199 | 393.0 | ఆమ్‌స్టర్‌డామ్ |
నార్వే | 324,220 | 4,525,116 | 14.0 | ఓస్లో |
పోలెండు | 312,685 | 38,625,478 | 123.5 | వార్సా |
పోర్చుగల్ | 91,568 | 10,409,995 | 110.1 | లిస్బన్ |
రొమేనియా | 238,391 | 21,698,181 | 91.0 | బుచారెస్ట్ |
రష్యా | 17,075,400 | 142,200,000 | 26.8 | మాస్కో |
సాన్‌మారినో | 61 | 27,730 | 454.6 | సాన్ మెరీనో |
సెర్బియా (కొసావోతో కలుపుకుని) | 88,361 | 9,663,742 | 109.4 | బెల్‌గ్రేడ్ |
స్లొవేకియా | 48,845 | 5,422,366 | 111.0 | బ్రాటిస్లావా |
స్లొవేనియా | 20,273 | 1,932,917 | 95.3 | జుబ్లజానా |
స్పెయిన్ | 504,851 | 45,061,274 | 89.3 | మాడ్రిడ్ |
స్వాల్‌బార్డ్ , జాన్ మయేన్ దీవులు (నార్వే) |
62,049 | 2,868 | 0.046 | లాంగియర్‌బెన్ |
స్వీడన్ | 449,964 | 9,090,113 | 19.7 | స్టాక్‌హోమ్ |
స్విట్జర్లాండ్ | 41,290 | 7,507,000 | 176.8 | బెర్న్ |
టర్కీ | 783,562 | 70,586,256 | 93 | అంకారా |
ఉక్రెయిన్ | 603,700 | 48,396,470 | 80.2 | కీవ్ |
యునైటెడ్ కింగ్ డం | 244,820 | 61,100,835 | 244.2 | లండన్ |
వాటికన్ నగరం | 0.44 | 900 | 2,045.5 | వాటికన్ నగరం |
మొత్తం | 10,180,000 | 731,000,000 | 70 |
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Microsoft® Encarta® Online Encyclopedia 2007. ""Europe"". Archived from the original on 2007-12-14. Retrieved 2007-12-27.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "United Nations Statistics Division — Countries of Europe". Archived from the original on 2011-07-13. Retrieved 2008-06-10.
|
| ||||||||||||||||||||||||
ప్రపంచ ఖండాలు కూడా చూడండి |