Jump to content

మూసారాంబాగ్

అక్షాంశ రేఖాంశాలు: 17°22′23″N 78°30′59″E / 17.3730°N 78.5164°E / 17.3730; 78.5164
వికీపీడియా నుండి
మూసారాంబాగ్‌
సమీపప్రాంతం
మూసారాంబాగ్‌ is located in Telangana
మూసారాంబాగ్‌
మూసారాంబాగ్‌
తెలంగాణలో ప్రాంతం ఉనికి
మూసారాంబాగ్‌ is located in India
మూసారాంబాగ్‌
మూసారాంబాగ్‌
మూసారాంబాగ్‌ (India)
Coordinates: 17°22′23″N 78°30′59″E / 17.3730°N 78.5164°E / 17.3730; 78.5164
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC 5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 036
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

మూసారాంబాగ్‌ (మూసా రామ్ బాగ్), తెలంగాణలోని హైదరాబాదు నగర పాత శివారు ప్రాంతం.[1][2] 18వ శతాబ్దంలో నిజాం రాజులకు సేవలందించిన ఫ్రెంచ్ మిలటరీ కమాండర్ మోన్సియూర్ రేమండ్ పేరు మీదుగా ఈ ప్రాంతానికి "మూసా-రామ్-బాగ్" అని పేరు పెట్టబడింది. బాగ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఈ ప్రాంతం ఒకప్పుడు భారీ పచ్చదనంతో నిండివుండేది. ఇక్కడి ఆస్మాన్ ఘర్ ప్యాలెస్ సమీపంలో రేమండ్ సమాధి కూడా ఉంది.

చరిత్ర

[మార్చు]

రెండవ అసఫ్ జా, నిజాం అలీ ఖాన్కు మోన్సియూర్ రేమండ్ సన్నిహిత మిత్రుడయ్యాడు. 2వ నిజాం గౌరవం పొందడమేకాకుండా స్థానిక ప్రజల ప్రేమను, నమ్మకాన్ని కూడా రేమండ్‌ సంపాదించుకున్నాడు. ముస్లింలకు, మూసా రహీమ్ గా, హిందువులకు మూసా రామ్ పేరొందాడు.[3][4]

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

మూసారాంబాగ్ ప్రాంతంలో నివసించేవారి అవసరాల కొరకు ఇక్కడ అనేక దుకాణాలు ఉన్నాయి. కాపిటల్ (అకా షామ్), బావార్చి వంటి హైదరాబాదీ రెస్టారెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దూరదర్శన్ టీవీ టవర్ కూడా ఉంది. 

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మూసారాంబాగ్ కు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడ మూసారాంబాగ్ మెట్రో స్టేషను కూడా ఉంది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Soon you can earn while you pee". IBN Live. Archived from the original on 17 ఏప్రిల్ 2014. Retrieved 13 December 2020.
  2. "14 injured in wall collapse at Moosarambagh". Times of India. Archived from the original on 2012-07-08. Retrieved 13 December 2020.
  3. "When a French Revolution-modelled Army contingent was established in Hyderabad". The Hindu. The Hindu.
  4. Luther, Narendra. Hyderabad, A Biography. Oxford University Press. p. 117. ISBN 019567535-5.