Jump to content

ఎముక మజ్జ

వికీపీడియా నుండి
(మూలుగ నుండి దారిమార్పు చెందింది)

ఎముక మజ్జ అనబడే ఈ మృదువైన కణజాలము ఎముక లోపలి భాగములో ఉంటుంది. ఇది మనుషులలో, ఇతర క్షీరదాల్లో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క మనిషిలో నాలుగు శాతం బరువు ఈ ఎముక మజ్జదే. ఎముక మజ్జలో ప్రతి రోజూ 50,000కోట్ల రక్త కణాల ఉత్పత్తి అవుతాయి. ఎముక మజ్జలో నుండి సూక్ష్మ రక్తనాళాల ద్వారా ఆ కణాలు రక్తము లోనికి కలుస్తాయి.

ఎముక మజ్జ రకాలు

[మార్చు]
ఎరుపు, పసుపు మజ్జలు

మనుషుల్లో రెండు రకాల మజ్జలున్నాయి.

మొదటి రకము
మెడులా ఒస్సియం రుబ్ర (medulla ossium rubra) అనగా ఎరుపు మజ్జ. ఈ మజ్జలో రక్తకణాల ఉత్పత్తి భాగమే ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలను, తెల్ల రక్తకణాలు, రక్త పటికలును ఉత్పతి చేస్తుంది.
రెండవది
మెడులా ఒస్సియం ఫ్లావా (medulla ossium flava) అనగా పసుపు మజ్జ. దీనిలో చాలా వరకు కొవ్వు కణాలుంటయి.

ఎముక మజ్జ పొర (స్ట్రోమా)

[మార్చు]

ఎముక మజ్జ పొర లేదా స్ట్రోమా రక్త కణాల ఉత్పత్తిలో ప్రత్యక్షముగా పాల్గొనదు. ఇది చాలా వరకు పసుపు మజ్జలోనే వుంటుంది. కానీ ఇది రక్త కణాల ఉత్పత్తి (హెమటోపొసిస్) కి అవసరమైన కొన్ని రకాల దోహక పదార్థములను ఉత్పత్తి చేయడము ద్వారా రక్త కణాల ఉత్పత్తిలో పరోక్షంగా తోడ్పడుతుంది. ఎముక మజ్జ పొరలోనున్న కణాలు.

ఎముక మజ్జ సరిహద్దు

[మార్చు]

ఎముక మజ్జ సరిహద్దు లేదా బోన్ మెరో బెరియర్ ఎముక మజ్జలోని కణాలను రక్త ప్రసరణలో కలవకుండా అడ్డుకుంటుంది. కేవలము బాగా పరిణితి లేదా అభివృద్ధి చెందిన కణాలు మాత్రమే వాటి పైన ఉన్న మాంసకృత్తుల సహాయముతో రక్త ప్రసరనలోనికి ప్రవేశిస్తాయి. కాని కొన్ని విభాజ్యకణములు (stem cells) రక్తప్రసరణలో కలుస్తుంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎముక_మజ్జ&oldid=4075662" నుండి వెలికితీశారు