ముగ్గురు మరాటీలు
ముగ్గురు మరాటీలు (1946 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సి.హెచ్.నారాయణ రావు, గోవిందరాజుల సుబ్బారావు, టి.జి.కమలాదేవి, కన్నాంబ, కుమారి, బెజవాడ రాజారత్నం, కస్తూరి శివరావు |
సంగీతం | ఓగిరాల రామచంద్రరావు |
నేపథ్య గానం | బెజవాడ రాజారత్నం |
గీతరచన | ప్రయాగ నరసింహశాస్త్రి, తాపీ ధర్మారావు |
నిర్మాణ సంస్థ | ప్రతిభా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ముగ్గురు మరాఠీలు చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య ప్రతిభా పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావుకు ఇది మూడవ సినిమా. ఈ చిత్రం ఘన విజయం సాధించి 100 రోజులుదాకా ప్రదర్శింపబడింది. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి ప్రజామోదం పొందింది.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ-మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
- ఎడిటింగ్: జి.డి.జోషి
- ఛాయాగ్రహణం: పి. శ్రీధర్
- పాటలు: తాపీ ధర్మారావు, ప్రయాగ నరసింహశాస్త్రి
- కళ: యస్. వి. యస్. రామారావు
- నృత్యం: వేదాంతం రాఘవయ్య
- సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
- నిర్మాత- దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- సిద్ధోజి - గోవిందరాజుల సుబ్బారావు
- రుక్కుబాయి - కన్నాంబ
- సోమోజి - సి.హెచ్.నారాయణరావు
- సుబంధి - జి.నారాయణరావు
- ఫిరోజి - అక్కినేని నాగేశ్వరరావు
- రఘుబాయి - టి.జి.కమలాదేవి
- తిమ్మోజి - కస్తూరి శివరావు
- అంశుబాయి - కుమారి
- బెజవాడ రాజరత్నం
కథ
[మార్చు]మహారాష్టక్రు చెందిన వీరులగాథ, ముగ్గురు మరాటీలు. బడేఁగావ్‌ను సిద్దోజి మహారాజు (గోవిందరాజుల సుబ్బారావు) పాలిస్తుంటాడు. అతని భార్య మహారాణి రుక్కూబాయి (కన్నాంబ). వారికి సంతానం లేదు. అన్నగారి కుమారులు సోమోజి (సిహెచ్.నారాయణరావు) సుబంధి (జి.నారాయణరావు), ఫిరోజి (అక్కినేని)లను పెంచి పెద్దచేస్తాడు. వారి పట్ల రుక్కుబాయి ద్వేషం పెంచుకొని, భర్త మనసులో విష బీజాలు నాటుతుంది. దానివలన సిద్దోజి, అన్న కుమారులను రాజ్యం నుంచి, పంపివేసి ముగ్గురికి 2 ఊళ్ళను ‘పత్తికోట’, ‘ధరణికోట’ల అధికారం ఇస్తాడు. వారి మేనకోడలు రఘుబాయి (టి.జి.కమలాదేవి), ఫిరోజి ప్రేమించుకుంటారు. రుక్కుబాయి వారిని విడదీయాలని, తన తమ్ముడు తిమ్మోజి (కస్తూరి శివరాం)తో ఆమెకు వివాహం చేయాలనుకుంటుంది. అన్నదమ్ములు ముగ్గురిని కోటకు పిలిపించి, సిద్దోజి వారిని ఖైదుచేసి, తాను ధరణికోటపై దండెత్తి, దాన్ని తగలబెడతాడు. ఒంటరిగా వున్న సోమోజి భార్య అంశుబాయి (కుమారి) మామగారిని ఎదిరించి ఓడిస్తుంది. అన్నదమ్ములు తప్పించుకుని వచ్చి, నిలువ నీడలేక, ఒక గొల్ల ఇంటిలో తల దాచుకుంటారు. ఎల్లమ్మదేవి గుడిలో పూర్వీకులు దాచిన నిధిని ఫిరోజి సాహసంలో సాధిస్తాడు. సిద్దోజి కుట్రతో మంత్రాల రామిగాడితో సోమోజిని చంపిస్తాడు. భర్త చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అంశుబాయి దానికోసం మరుదులను పంపుతుంది. ఆమె కుమారుడు పెద్దమరిది సుబంధి, రాజ భటులకు చిక్కుతారు. ఫిరోజి మరో సంస్థానానికి రాజవుతాడు. సుబంధిని, మనవడిని బలిచేయబోయిన మహారాజుకి ఒకవైపు అంశుబాయి ప్రజాసైన్యంతో, మరోవైపు ఫిరోజి తన సైన్యంతో వచ్చి వారి కాపాడడం, సిద్దోజికి, అంశుబాయికి మధ్య పోరులో, సిద్దోజి మరణించగా, ప్రాణత్యాగం చేసుకోబోయిన రుక్కుబాయిని తమ పెద్ద దిక్కుగా వుండమని, అందరూ కోరటం, ఆమెలో మార్పు వచ్చి, రఘుబాయిని, ఫిరోజి చేతిలో పెట్టటం, అందరూ ఆనందించటం చిత్రం ముగుస్తుంది [1].
పాటలు
[మార్చు]- ఆశా నేడు తీరుకదా నా ప్రతిన - పి. కన్నాంబ
- అపునాతనామనా మరోరి బైరన్న - కస్తూరి శివరావు
- చెల్‌చెల్ వయారి షికారి - టి.జి.కమలాదేవి, అక్కినేని
- దేవా ప్రేమమయా అంతు తెలియ - కస్తూరి శివరావు
- ఈ రోజే నా చిన్ని బావా వయ్యారి - టి.జి.కమలాదేవి
- ఎల్లమ్మ తల్లికి ఎన్ని నోళ్ళు - టి.జి.కమలాదేవి,కస్తూరి శివరావు బృందం
- జైజై భైరవ త్రిశూలధారి - పి. కన్నాంబ,అక్కినేని,టి.జి.కమలాదేవి
- జీవనము యమున జీవనము - బెజవాడ రాజరత్నం
- కరుణ మాని తన (బుర్రకథ) - ప్రయాగ నరసింహ శాస్త్రి బృందం
- మరులు నీపైగొంటిరా ఓ వన్నెకాడ - టి.జి.కమలాదేవి
- సతీ భాగ్యమె భాగ్యము కులసతి - పి. కన్నాంబ
- జై వీర హనుమాన్ చలో బ్రహ్మచారి దేఖో మై హుషారీ_కస్తూరి శివరావు
- తగులబెట్టెను కోటలు కుమ్మీరలో కోటపై దూకి (బుర్రకథ)_ ప్రయాగ నరసింహశాస్త్రి బృందం
- కృష్ణ కథ అహా కృష్ణకథ రాధాకృష్ణ కథ యమున_ బెజవాడ రాజారత్నం.
- వడకుమా రాటము భారతనారి కవచము_బెజవాడ రాజారత్నం .
మూలాలు
[మార్చు]- ↑ "ముగ్గురు మరాఠీలు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 05-05-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-27.
. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.