Jump to content

మమతా కులకర్ణి

వికీపీడియా నుండి
మమతా కులకర్ణి
జననం (1972-04-20) 20 ఏప్రిల్ 1972 (age 52)[1]
ముంబై, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1991–2003
జీవిత భాగస్వామివికీ గోస్వామి

మమతా కులకర్ణి భారతీయ చలనచిత్ర నటి. ఈమె బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్‌సే బడా కిలాడి, బాజీ తదితర హిందీ సినిమాలలో నటించడం ద్వారా పేరు సంపాదించింది. ఈమె మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగణ్, బాబీ డియోల్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సల్మాన్ ఖాన్, గోవిందా, అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్, మోహన్ బాబు మొదలైన హీరోల సరసన నటించింది.

జీవితం

[మార్చు]

మమతా కులకర్ణి మహరాష్ట్రలోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ముంబై మాజీ కమీషనర్. ఈమె జుహులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదివింది. చిన్నప్పటి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలవైపు మొగ్గు చూపింది. తర్వాత మోడలింగ్ లో అవకాశాలు వచ్చాయి. తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి.

2025 కుంభమేళాలో సన్యాసం తీసుకుంది.[2] అయితే ఈ నిర్ణయం వివాదాస్పదం కావడంతో ఆమెకు సన్యాస దీక్ష ఇచ్చిన కిన్నెర అఖాడా నుంచి ఆమెను బహిష్కరించారు.[3]

వివాదాలు

[మార్చు]

ఈమె నట జీవితం, అనంతర జీవితం వివాదాల మయంగా ఉంది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై టాప్‌లెస్‌గా పోజు ఇవ్వడంతో ఈమె పేరు మారుమ్రోగింది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై వచ్చిన వివాదంతో కోర్టుచే అభిశంసించ బడి జరిమానా కూడా కట్టింది. కోర్టుకు హాజరు కావడానికి ఎవరూ గుర్తుపట్టాకుండా బురఖా ధరించి ఇస్లాం వర్గీయుల ఆగ్రహాన్ని చవిచూచింది. మాఫియా డాన్ ఛోటారాజన్‌ను మచ్చిక చేసుకుని సినిమా అవకాశాలు దక్కించుకుందని ఈమెపై పుకార్లు ఉన్నాయి. సినిమాలకు స్వస్తి చెప్పాక ఈమె ఒక ఎన్.ఆర్.ఐ. వ్యాపారిని వివాహం చేసుకుని న్యూయార్కులో నివసించింది. తరువాత కొన్నాళ్లకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమై దుబాయిలో తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ విక్కీ గోస్వామితో కలిసి సహజీవనం చేసింది.[4]. విక్కీ గోస్వామికి దుబాయ్-నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేసే వ్యాపారం ఉండేది. అతనిని వివాహమాడిన అనంతరం మమతా కులకర్ణి కూడా డ్రగ్స్ కి బాగా బానిస అయ్యింది. కాగా వీరు సాగిస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం గుట్టు 2014 లో రట్టు కాగా అప్పటి థానే పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపగా అప్పటికి విక్కీ గోస్వామి పోలీస్ వారి విచారణకు సహకరించకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రెండు సంవత్సరాల పాటు విచారణ జరిపిన పోలీసులు విక్కీ గోస్వామితోపాటు మమతా కులకర్ణి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.[5]

మమత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

[మార్చు]
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1992 దొంగా పోలీస్ మోహన్‌బాబు కె.ఎస్.ప్రకాష్
1992 ప్రేమశిఖరం ప్రశాంత్ సత్య
1992 బ్రహ్మ మోహన్‌బాబు బి.గోపాల్

మూలాలు

[మార్చు]
  1. Mamta Kulkarni turns 40 – Birthday Suite: Mamta Kulkarni Archived 2014-08-21 at the Wayback Machine. Entertainment.in.msn.com (20 April 2012). Retrieved on 20 July 2013.
  2. "Mamta Kulkarni: అప్పుడు మోడల్‌.. యాక్టర్‌.. ఇప్పుడు సన్యాసిని "మహామండలేశ్వర్‌"". EENADU. Retrieved 2025-01-27.
  3. "Mamta Kulkarni: కిన్నెర అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ.. కారణం ఇదే". EENADU. Retrieved 2025-01-31.
  4. ఎస్., సత్యబాబు (9 September 2012). "కహాహై సబ్‌సే బడా ఖిలాడి". సాక్షి ఫన్‌డే. Retrieved 17 April 2017.
  5. "నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందుకున్న సీనియర్ హీరోయిన్". Archived from the original on 2017-03-30. Retrieved 2017-04-17.

బయటు లింకులు

[మార్చు]