మద్దిలపాలెం
మద్దిలపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′18″N 83°19′23″E / 17.738224°N 83.323039°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530013 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
మద్దిలపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీరప్రాంతంలో కలిగి ఉన్న ప్రాంతం.[1] గతంలో ఇది విశాఖపట్నం వెలుపల ఒక చిన్న శివారు ప్రాంతంగా ఉండేది.[2]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]విశాఖపట్నంలోని ప్రధాన వాణిజ్య, నివాస శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ మద్దిలపాలెంలో అశోక్ లేలాండ్ ఆటో తయారీ, జయభేరి మారుతి సంస్థలు ఉన్నాయి. విశాఖపట్నం నగరంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఉంది.
రవాణా
[మార్చు]మద్దిలపాలెం, విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటి. విశాఖపట్నం బిఆర్టిఎస్ ఈ ప్రాంతాన్ని అసిల్ మెట్టతో కలుపుతోంది. మద్దిలపాలెం జంక్షన్ నగరంలో అత్యంత రద్దీగా ప్రాంతం. జంక్షన్ అసిల్ మెట్ట, ద్వారకా నగర్, మధురవాడ మొదలైన ప్రాంతాలకు రహదారులు ఉన్నాయి.[3]
మద్దిలపాలెం జాతీయ రహదారి ద్వారా కలుపబడి ఉంది. ఇక్కడ మద్దిలపాలెం బస్ స్టేషన్ ఉంది. ఎపిఎస్‌ఆర్‌టిసి ఆధ్వర్యంలో ఇక్కడినుండి విశాఖపట్నంలో అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]
విద్య
[మార్చు]ఇక్కడ అనేక విద్యాసంస్థలు, కోచింగ్-శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్, డాక్టర్ వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాలు ఇక్కడ ఉన్నాయి.
సౌకర్యాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలోరి పిఠాపురం కాలనీలో కళాభారతి ఆడిటోరియం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "location". maps of india. 12 February 2017. Retrieved 15 May 2021.
- ↑ "Maddilapalem Locality". www.onefivenine.com. Retrieved 15 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.
- ↑ "transport". new indian express. 14 September 2017. Retrieved 15 May 2021.