Jump to content

భవానీపట్న

అక్షాంశ రేఖాంశాలు: 19°54′36″N 83°07′41″E / 19.91°N 83.128°E / 19.91; 83.128
వికీపీడియా నుండి
భవానీపట్న
పైనుండీ సవ్య దిశలో: దూరదర్శన్ టవరు, ఫుర్లిజరణ్, దుర్గా మండపం, మాణికేశ్వరి మందిర్, రైల్వే స్టేషను, బస్టాండు
పైనుండీ సవ్య దిశలో: దూరదర్శన్ టవరు, ఫుర్లిజరణ్, దుర్గా మండపం, మాణికేశ్వరి మందిర్, రైల్వే స్టేషను, బస్టాండు
భవానీపట్న is located in Odisha
భవానీపట్న
భవానీపట్న
Coordinates: 19°54′36″N 83°07′41″E / 19.91°N 83.128°E / 19.91; 83.128
దేశం India
రాష్ట్రం ఒడిశా
Named forభవానీ శంకరుని పేరిట
Elevation
248 మీ (814 అ.)
జనాభా
 (2011)
 • Total83,756
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC 5:30 (IST)
PIN
766001, 766002
Telephone code06670
Vehicle registrationOD-08
UN/LOCODEIN BWIP

భవానీపట్న ఒడిషా రాష్ట్రం కలహండి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ప్రధాన కేంద్రం. భవానీపట్న అనేపేరు ఇక్కడి ప్రధానమైన దేవుడు భవానీ-శంకర్ పేరు మీద వచ్చింది. భవానీపట్న పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. పురపాలక సంఘంలో ఇరవై వార్డులున్నాయి.

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన ప్రకారం, [1] భవానీపట్న జనాభా 69,045. మొత్తం పట్టణ ప్రాంత జనాభా 83,756. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7,407, ఇది భవానీపట్న (M) మొత్తం జనాభాలో 10.73%. స్త్రీ పురుష లింగ నిష్పత్తి 945గా ఉంది. అంతేకాకుండా, ఒరిస్సా రాష్ట్ర సగటు 941తో పోలిస్తే భవానీపట్నలో పిల్లల లింగ నిష్పత్తి 911గా ఉంది. అక్షరాస్యత 85.00%. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో పురుషుల అక్షరాస్యత 90.95% కాగా, స్త్రీల అక్షరాస్యత 78.72%.

మొత్తం జనాభాలో, 23,705 మంది పని లేదా వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. వీరిలో 18,666 మంది పురుషులు కాగా, 5,039 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 23,705 మంది శ్రామిక జనాభాలో, 84.55% మంది ప్రధానమైన పనుల్లో నిమగ్నమై ఉండగా, మొత్తం కార్మికులలో 15.45% మంది ఉపాంత పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

భాష, సాహిత్యం

[మార్చు]

కలహండి ప్రజలు మాట్లాడే భాష ఒరియా భాష లోని కలహండియా మాండలికం. దీనిని స్థానికంగా కలహండి అని పిలుస్తారు. అర్జీ, కలహండి ఎక్స్‌ప్రెస్ వంటి స్థానిక వారపత్రికలు ప్రామాణిక ఒడియా, కలహండి భాషలలో ప్రచురిస్తారు. కుయ్, భత్రి (ఒడియా లోని మరొక మాండలికం), పార్జీ, భుంజియా. వంటి ఇతర భాషలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. భుంజియా భాష సుమారుగా 7000 మంది ఆదివాసీలు మాట్లాడతారు.

భౌగోళికం, శీతోష్ణస్థితి

[మార్చు]

భవానీపట్న 19°54′N 83°10′E / 19.9°N 83.17°E / 19.9; 83.17 వద్ద, [2] సముద్రమట్టం నుండి 248 మీ. ఎత్తున ఉంది. భవానీపట్న పెద్ద పర్వతాలు, పీఠభూముల మధ్యలో ఉంది. దాని తూర్పు సరిహద్దులో తూర్పు కనుమలున్నాయి.

శీతోష్ణస్థితి

[మార్చు]

భవానీపట్నలో ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంటుంది. మార్చి నుండి జూన్ వరకు మినహా ఉష్ణోగ్రతలు ఏడాది పొడవునా మితంగా ఉంటాయి. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఏప్రిల్-మేలో ఉష్ణోగ్రత కొన్నిసార్లు 48 °C (118 °F) కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవి నెలలలో వడ గాలులు కూడా ఉంటాయి. పట్టణ వార్షిక వర్షపాతం 1,300 మిల్లీమీటర్లు (51 అం.). ఎక్కువగా వర్షాకాలం జూన్ చివరి నుండి అక్టోబరు ప్రారంభం వరకు ఉంటుంది. శీతాకాలాలు నవంబరు నుండి జనవరి వరకు ఉంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత కనిష్ఠంగా 5 °C (41 °F) వరకు పడిపోవచ్చు

శీతోష్ణస్థితి డేటా - Bhawanipatna (1981–2010, extremes 1968–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.5
(95.9)
39.5
(103.1)
42.3
(108.1)
45.9
(114.6)
47.8
(118.0)
48.3
(118.9)
39.5
(103.1)
37.7
(99.9)
35.7
(96.3)
36.0
(96.8)
38.0
(100.4)
34.5
(94.1)
48.3
(118.9)
సగటు అధిక °C (°F) 28.5
(83.3)
32.3
(90.1)
35.5
(95.9)
39.5
(103.1)
41.0
(105.8)
36.1
(97.0)
31.1
(88.0)
30.3
(86.5)
31.1
(88.0)
31.4
(88.5)
29.4
(84.9)
28.2
(82.8)
32.9
(91.2)
సగటు అల్ప °C (°F) 12.5
(54.5)
15.6
(60.1)
20.3
(68.5)
24.7
(76.5)
26.8
(80.2)
25.9
(78.6)
24.3
(75.7)
23.6
(74.5)
23.3
(73.9)
20.5
(68.9)
15.8
(60.4)
12.7
(54.9)
20.5
(68.9)
అత్యల్ప రికార్డు °C (°F) 4.5
(40.1)
6.0
(42.8)
8.5
(47.3)
16.0
(60.8)
14.5
(58.1)
14.0
(57.2)
14.0
(57.2)
13.0
(55.4)
13.0
(55.4)
11.5
(52.7)
7.4
(45.3)
5.2
(41.4)
4.5
(40.1)
సగటు వర్షపాతం mm (inches) 8.9
(0.35)
11.7
(0.46)
17.3
(0.68)
21.4
(0.84)
39.4
(1.55)
196.2
(7.72)
281.0
(11.06)
315.2
(12.41)
199.1
(7.84)
79.1
(3.11)
10.0
(0.39)
9.4
(0.37)
1,188.7
(46.80)
సగటు వర్షపాతపు రోజులు 0.6 0.9 1.5 2.0 2.8 8.4 12.7 12.8 9.2 3.8 0.7 0.6 55.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 46 43 35 33 34 54 74 77 75 66 55 49 54
Source: India Meteorological Department[3][4]

రవాణా

[మార్చు]

వైమానికం

[మార్చు]

పట్టణం నుండి 22 కి.మీ. దూరంలో ఉత్కళా ఎయిర్‌స్ట్రిప్ (VEUK) ఉంది. మరొకటి, లంజిగర్ ఎయిర్‌స్ట్రిప్ ( 58 కి.మీ., 36 మై. ) అనేది VIP, చార్టర్డ్ విమానాలను నిర్వహించే ప్రైవేట్ ఎయిర్‌స్ట్రిప్. సమీపంలోని ఇతర విమానాశ్రయం ఛత్తీస్‌గఢ్‌, రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం 262 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం 427 కి., మీ. దూరంలో ఉంది.

రైలు

[మార్చు]

భవానీపట్న రైల్వే స్టేషన్ 2012 ఆగస్టు 12 న ప్రారంభించారు.[5][6] ఇది లంజిగఢ్-జునాగర్ రైలు మార్గంలో ఉంది. ప్రస్తుతం భవానీపట్న నుండి భువనేశ్వర్, రాయ్‌పూర్, సంబల్‌పూర్‌లకు 3 రైళ్లు (1 ఎక్స్‌ప్రెస్మ్ 2 ప్యాసింజర్లు) నడుస్తున్నాయి. కేసింగ రైల్వే స్టేషన్ భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్ మొదలైన అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

రోడ్డు

[మార్చు]

భవానీపట్నాన్ని వివిధ నగరాలకు కలిపే హైవేలు :

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. Falling Rain Genomics, Inc - Bhawanipatna
  3. "Station: Bhawani patna Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 131–132. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M160. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  5. "Bhawanipatna railway station opens". The New Indian Express. Archived from the original on 2013-05-21. Retrieved 2013-05-22.
  6. "East Coast Railway". Eastcoastrail.indianrailways.gov.in. 2012-08-12. Retrieved 2013-05-22.