భరత్‌పూర్ (రాజస్థాన్)
భరత్‌పూర్
లోహాగర్ | |
---|---|
Nickname: లోహాగర్ | |
Coordinates: 27°13′N 77°29′E / 27.22°N 77.48°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | భరత్‌పూర్ |
Founded by | భరత్ |
Named for | భరత్- ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రక యోధుడు |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | భరత్‌పూర్ నగరపాలక సంస్థ |
Elevation | 183 మీ (600 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 2,52,838 |
భాషలు | |
• అధికార | హిందీ , ఆంగ్లం |
Time zone | UTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్‌కోడ్ | 321001 |
ప్రాంతపు కోడ్ | ( 91) 5644 |
ISO 3166 code | RJ-IN |
Vehicle registration | RJ-05 |
భరత్‌పూర్, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీకి దక్షిణాన 180 కి.మీ. (110 మైళ్లు), రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 178 కి.మీ. (111 మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు పశ్చిమాన 55 కి.మీ (34మైళ్లు), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుండి 38 కి.మీ. (24 మైళ్లు) దూరంలో ఉంది.ఇది భరత్‌పూర్ జిల్లాకు, విభాగానికి పరిపాలనా ప్రధాన కేంద్రం.భరత్‌పూర్ భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) లో ఒక భాగం.[2] పూర్వపు ఈ నగరం భరత్‌పూర్ రాజ్యానికి రాజధాని.2014 లో 65 వార్డులతో నగరపాలక సంస్థగా మారింది.[3][4]
ఇది సముద్రమట్టానికి 183 మీ (600 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. దీనిని "తూర్పు గేట్వే టు రాజస్థాన్" అని కూడా పిలుస్తారు. భరత్‌పూర్కోటను "లోహాగఢ్" అని పిలుస్తారు.[5]
చరిత్ర
[మార్చు]భరత్‌పూర్ రాచరిక రాష్ట్రమైన భరత్‌పూర్ రాజధాని. భరత్‌పూర్ నగరం 19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ముట్టడికి గురైంది.రాజ్‌పుతానాలు బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి రాచరిక రాష్ట్రాలలో ఇది ఒకటి.
జనాభా గణాంకాలు
[మార్చు]భరత్‌పూర్ నగరాన్ని భరత్‌పూర్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి వచ్చే మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం భరత్‌పూర్ నగర జనాభా 252,342 మంది కాగా, వారిలో పురుషులు 133,780 ఉండగా, స్త్రీలు 118,562 మంది ఉన్నారు. భరత్‌పూర్ నగరంలో 252,342 జనాభా ఉన్నప్పటికీ; దాని పట్టణ / మెట్రోపాలిటన్ పరిధి జనాభా 252,838, ఇందులో 134,040 మంది పురుషులు, 118,798 మంది మహిళలు ఉన్నారు.[6]
జనాభా పెరుగుదల చార్టు
[మార్చు]సంవత్సరం | జనాభా |
---|---|
1891 | 43,000
|
1911 | 44,000
|
1941 | 35,500
|
1951 | 37,300
|
1961 | 49,800
|
1971 | 69,400
|
1981 | 1,05,200
|
1991 | 1,56,900
|
2001 | 2,05,235
|
2011 | 2,52,838
|
2014 | 3,20,559
|
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- రాజారాం: ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి జాట్ నాయకుడు. సింసిని అధిపతి.
- మహారాజా చురామన్ సింగ్: రెండవ జాట్ నాయకుడు. రాజారాం సోదరుడు
- రాజా ముఖమ్ సింగ్: మూడవ జాట్ నాయకుడు. చురామన్ సింగ్ కుమారుడు
- బదన్ సింగ్: భరత్‌పూర్ రాష్ట్ర స్థాపకుడు. రావు చురమన్ సింగ్ మేనల్లుడు.
- మహారాజా సూరజ్ మాల్: భరత్‌పూర్‌కు జాట్ పాలకుడు.
- మహారాణి కిషోరి: సూరజ్ మాల్ భార్య
- మహారాజా జవహర్ సింగ్: సూరజ్ మాల్ కుమారుడు.
- మహారాజా రతన్ సింగ్: జవహర్ సింగ్ సోదరుడు
- మహారాజా కేహ్రీ సింగ్: రతన్ సింగ్ వారసుడు.
- మహారాజా నిహాల్ సింగ్: సూరజ్ మాల్ నాల్గవ కుమారుడు.
- మహారాజా రంజిత్ సింగ్: కేహ్రీ సింగ్ వారసుడు.
- మహారాజా రణధీర్ సింగ్: రంజిత్ సింగ్ వారసుడు.
- మహారాజా బల్దియో సింగ్: రామ్ సింగ్ సోదరుడు.
- మహారాజా బల్వంత్ సింగ్: బల్దియో సింగ్ కుమారుడు.
- మహారాజా జశ్వంత్ సింగ్: బల్వంత్ సింగ్ కుమారుడు.
- మహారాజా రామ్ సింగ్: జశ్వంత్ సింగ్ కుమారుడు.
- మహారాజా కిషన్ సింగ్: రామ్ సింగ్ వారసుడు.
- మహారాజా బ్రిజేంద్ర సింగ్: కిషన్ సింగ్ వారసుడు.
- విశ్వేంద్ర సింగ్: భరత్‌పూర్ రాష్ట్ర సిన్‌సిన్వర్ జాట్ పాలకుల వారసుడు, రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుడు.
- మహారాజా నహర్ సింగ్: మహారాజు.
ఇది కూడ చూడు
[మార్చు]ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Rajasthan (India): State, Major Agglomerations & Cities – Population Statistics, Maps, Charts, Weather and Web Information". citypopulation.de. Retrieved 1 January 2021.
- ↑ "NCR expanded to include Bhiwani, Bharatpur". The Hindu. Chennai, India. 2 July 2013.
- ↑ "Bharatpur to be a Municipal Corporation". Business Standard. Jaipur, India. 19 Feb 2014.
- ↑ "Vasundhara's cabinet decides to make Bharatpur a Municipal Corporation". News 18. Jaipur, India. 19 Feb 2014.[permanent dead link]
- ↑ "Bharatpur – Eastern Gateway to Rajasthan". Archived from the original on 5 October 2013.
- ↑ "Bharatpur City Population Census 2011-2021 | Rajasthan". www.census2011.co.in. Retrieved 2021-02-27.