భట్టోజి ధీక్షితులు
భట్టోజీ ధీక్షితుడు 17వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్ర సంస్కృత వ్యాకరణవేత్త, సిద్ధాంత కౌముది రచయిత. ఇతను పాణిని యొక్క వ్యాకరణ పద్ధతుల పునరుద్ధరణలో ఎక్కువగా రచనలు చేశాడు. అందుకొరకు పాణిని యొక్క సూత్రాలను బోధనా ప్రయోజనాల కోసం వ్యాఖ్యానంతో ఏర్పాటు చేసే వివరణాత్మక రచనలు చేశాడు. ఇందుకు గల కారణం పాణిని వ్యాకరణం పురాతన కాలంలోన గొప్ప సంస్కృత వ్యాకరణకారుల కారులచేత గుర్తించబడినది, క్లిష్టరూపముగా ఉండుటయే అను పండితుల అభిప్రాయము. ఈయన రచనను అతని విద్యార్థి వరదరాజులు మూడు సంక్షిప్త రూపాల్లో సవరించారు. అతను దేశస్థ బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు.
సిద్ధాంత కౌముది
[మార్చు]సిద్ధాంత కౌముది అనేది అష్టాధ్యాయిపై భట్టోజీ దీక్షిత (17వ శతాబ్దపు ఆరంభదశలో) చే రచించబడిన ప్రసిద్ధ సంస్కృత వ్యాఖ్యానం మఱియు ఇది పాణిని రచనల కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిందని నమ్ముతారు. ఇది పాణిని యొక్క సూత్రాలను సముచితమైన శీర్షికల క్రింద అమర్చబడి, క్రమబద్ధంగా మఱియు అనుసరించడానికి సులభమైన వివరణను అందిస్తుంది.
సూత్రాలు రెండు భాగాలుగా అమర్చబడ్డాయి - మొదటి భాగం వివరణ నియమాలు, సంధిలు, కారకములు, స్త్రీ లింగ నిర్మాణం, సమాసములు, సంజ్ఞా ప్రకరణముగా నిర్మించబడింది. ద్వితీయ భాగం సంయోగం, ప్రాథమిక ప్రత్యయాలు, వేద వ్యాకరణం మఱియు ఉచ్ఛారణలతో నిర్మించబడింది.
సిద్ధాంత కౌముదిపై వ్యాఖ్యానాలు
[మార్చు]బాలమనోరమ
[మార్చు]వాసుదేవ దీక్షితులచే రచించబడిన బాలమనోరమ సిద్ధాంత కౌముదిపై అత్యంత ప్రసిద్ధ వ్యాఖ్యానాలలో ఒకటిగా గుర్తించబడుతున్నది. అతను కారకాలను వివరిస్తూ చాలా వివరాలను ఉదహరించుట ద్వారా ఇది ప్రారంభకులకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నది. (ఇక్కడ బాల అనగా "పిల్లలు").
ప్రౌఢమనోరమ
[మార్చు]ప్రౌఢమనోరమ అనేది సిద్ధాంత కౌముదిపై భట్టోజీ ధీక్షితుడు రాసిన స్వీయ వ్యాఖ్యానం. సిద్ధాంత కౌముది మఱియు ప్రౌఢమనోరమ రెండింటిపై తరువాతి కాలంలో అనేక మంది వ్యాఖ్యానాలు రచించారు.
తత్త్వ బోధిని
[మార్చు]జ్ఞానేంద్ర సరస్వతి రచించిన తత్త్వ బోధిని అనేది ప్రౌఢమనోరమ యొక్క వ్యాఖ్యాన రచన. ఇందులో పండిత ప్రశంసతో కూడిన వ్యాకరణ ఉదాహరణములు ఎక్కువుగా కనబడును.
అనువాదాలు
[మార్చు]- బాబూరామ్, "సంవత్ 1868, సాకే 1733" (అంటే 1811)
- భువనేష్ వారి ఆశ్రమ (1904)
- శ్రీస చంద్ర వాసు, వామన్ దాస్ వాసు, అలహాబాద్ (1906)
- ed. పివి నాగనాథ శాస్త్రి (1990), మోతీలాల్ బనార్సిదాస్, ISBN 81-208-0679-4
- ed. SC వాసు, మోతీలాల్ బనార్సిదాస్ (2003) ISBN 978-81-208-1290-1
- పుల్లెల శ్రీరామచంద్రుడు దీనికి టీకా వివరణతో అనువదించెను. ఇది ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో దొరుకుచున్నది.
- 6 సంపుటాలలో భట్టోజీ దీక్షిత ఆంగ్ల అనువాదం సిద్ధాంత కౌముది
- http://laghusiddhanta.vedicsociety.org/ Archived 2023-04-11 at the Wayback Machine