Jump to content

బి. వై. రాఘవేంద్ర

వికీపీడియా నుండి
బి. వై. రాఘవేంద్ర

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 నవంబరు 2018 (2018-11-06)
ముందు బి.ఎస్.యడ్యూరప్ప
నియోజకవర్గం షిమోగా
పదవీ కాలం
2009 (2009) – 2014 (2014)
ముందు సారెకొప్ప బంగారప్ప
తరువాత బి.ఎస్.యడ్యూరప్ప
నియోజకవర్గం షిమోగా

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-16) 1973 ఆగస్టు 16 (వయసు 51)
షికారిపూర్ , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ), భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు బి.ఎస్.యడ్యూరప్ప, మైత్రా దేవి
జీవిత భాగస్వామి తేజస్విని
సంతానం 2
మూలం [1]

బుకనకెరె యడ్యూరప్ప రాఘవేంద్ర (జననం 16 ఆగస్టు 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

బి. వై. రాఘవేంద్ర తన తండ్రి బి.ఎస్.యడ్యూరప్ప అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ బంగారప్పపై 52,893 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2018 ఉప ఎన్నికల్లో షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బి. వై. రాఘవేంద్ర 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మధు బంగారప్పపై 52,148 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గీతా శివరాజ్‌కుమార్ పై 2,43,715 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. The Hindu (4 June 2024). "B.Y. Raghavendra gets elected to parliament for fourth time" (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  2. The New Indian Express (19 April 2024). "Karnataka: Raghavendra, wife have assets worth Rs 73.41 crore" (in ఇంగ్లీష్). Retrieved 28 July 2024.
  3. TV9 Bharatvarsh (4 June 2024). "B Y Raghavendra BJP Candidate Election Result: कर्नाटक B Y Raghavendra Shimoga लोकसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. TimelineDaily (18 March 2024). "BY Raghavendra: Aiming For A Fourth Win From Family Bastion" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.