ఫరూఖ్‌నగర్ మండలం
స్వరూపం
(ఫరూఖ్ నగర్ మండలం నుండి దారిమార్పు చెందింది)
ఫరూఖ్ నగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°04′40″N 78°12′04″E / 17.0778°N 78.2011°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | ఫరూఖ్ నగర్ |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,12,633 |
- పురుషులు | 57,361 |
- స్త్రీలు | 55,272 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.95% |
- పురుషులు | 69.32% |
- స్త్రీలు | 46.01% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఫరూఖ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మండల కేంద్రమైన ఫరూఖ్‌నగర్ను షాద్‌నగర్ అని కూడా అంటారు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
మండల జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 1,12,458. ఇందులో పురుషుల సంఖ్య 57,299, స్త్రీల సంఖ్య 55,159. అక్షరాస్యుల సంఖ్య 68042.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 280 చ.కి.మీ. కాగా, జనాభా 112,633. జనాభాలో పురుషులు 57,361 కాగా, స్త్రీల సంఖ్య 55,272. మండలంలో 26,214 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రంగసముద్రం
- మొగలిగిద్ద
- ఎలికట్ట
- నాగులపల్లి
- చట్టాన్‌పల్లి
- దూసకల్
- కొండన్నగూడ
- కొంగగూడ
- వెల్జర్ల-2
- బుచ్చిగూడ
- అల్లిసాబ్గూడ
- వెల్జర్ల-3
- సోలిపూర్
- హాజీపల్లి
- కిషన్‌నగర్
- చౌలపల్లి (పశ్చిమ)
- కందివనం
- చించోడ్
- భీమారం
- కంసాన్పల్లి
- విట్యాల్
- జోగమ్మగూడ
- వెల్జర్ల -1
- అన్నారం
- చిలకమర్రి (చెలక)
- కమ్మదనం
- గంట్లవెల్లి
- రాయికల్
- తిమ్మాజిపల్లి
- బూర్గుల్
- సేరిగూడ మధురాపూర్
- మధురాపూర్
- ఫరూఖ్‌నగర్
- సూర్యారావుగూడ
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు
మండలంలోని ప్రముఖులు
[మార్చు]- బూర్గుల రామకృష్ణా రావు:హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ మండలానికి చెందిన వ్యక్తి. 1915 నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది. పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం ఈ మండంలోని బూర్గుల గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అవరతణకు వీలుగా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లంకెలు
[మార్చు]