ప్రవీణ్ జయవిక్రమ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పెరుమప్పెరుమ అరాచ్చిగే కవీషా ప్రవీణ్ జయవిక్రమ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మొరటువా, శ్రీలంక | 1998 సెప్టెంబరు 30|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 156) | 2021 ఏప్రిల్ 29 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 మే 23 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 199) | 2021 జూన్ 29 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 91) | 2021 సెప్టెంబరు 12 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 జూన్ 11 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 29 July 2022 |
పెరుమప్పెరుమ అరాచ్చిగే కవీషా ప్రవీణ్ జయవిక్రమ, శ్రీలంక క్రికెటర్. జాతీయ జట్టు కోసం క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో ఆడాడు. 2021 ఏప్రిల్ లో శ్రీలంక క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]
జననం, విద్య
[మార్చు]పెరుమప్పెరుమ అరాచ్చిగే కవీషా ప్రవీణ్ జయవిక్రమ 1998, సెప్టెంబరు 30న శ్రీలంకలోని మొరటువాలో జన్మించాడు. మొరటువాలోని సెయింట్ సెబాస్టియన్స్ కళాశాలలో, కలుతరలోని హోలీ క్రాస్ కళాశాలలో విద్యను అభ్యసించాడు.[2]
దేశీయ క్రికెట్
[మార్చు]2019 జనవరి 11న 2018–19 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3] ఫస్ట్-క్లాస్ అరంగేట్రం ముందు 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[4] 2019-20 ఇన్విటేషన్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ కోసం 2019 డిసెంబరు 15న తన లిస్ట్ ఎ క్రికెటం లోకి అరంగేట్రం చేశాడు.[5] 2020 జనవరి 4న 2019–20 ఎప్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6]
2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ బ్లూస్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2022 జూలైలో లంక ప్రీమియర్ లీగ్మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ చేత సంతకం చేయబడ్డాడు.[8]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2021 ఏప్రిల్ లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు.[9] 2021 ఏప్రిల్ 29న బంగ్లాదేశ్‌పై శ్రీలంక తరపున తన టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[10] అరంగేట్రం మొదటి ఇన్నింగ్స్‌లో 92 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు,[11] టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన శ్రీలంక తరపున ఐదవ బౌలర్‌గా రికార్డు సాధించాడు.[12] రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున మొదటి బౌలర్‌గా, టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రంలో పది వికెట్లు తీసిన మొత్తం మీద 16వ బౌలర్‌గా నిలిచాడు.[13][14] టెస్ట్ క్రికెట్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అరంగేట్రం చేసిన అత్యుత్తమ బౌలింగ్ ఇది, 2008లో జాసన్ క్రెజ్జా తర్వాత అరంగేట్రంలోనే 10 వికెట్లు తీసిన మొదటి బౌలర్ ఇతడు.[15]
2021 జూన్ లో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు శ్రీలంక జట్టులో జయవిక్రమ ఎంపికయ్యాడు.[16] 2021 జూన్ 29న ఇంగ్లాండ్‌పై శ్రీలంక తరపున వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.[17] 2021 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[18] 2021 ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్జట్టులో ఎంపికయ్యాడు.[19]
2021 సెప్టెంబరులో 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో జయవిక్రమ ఎంపికయ్యాడు.[20] 2021 సెప్టెంబరు 12న శ్రీలంక తరపున దక్షిణాఫ్రికాపై టీ20 అరంగేట్రం చేసాడు.[21]
మూలాలు
[మార్చు]- ↑ "Praveen Jayawickrama". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
- ↑ http://www.holycross.8m.net/index.htm
- ↑ "Group B, Premier League Tournament Tier A at Colombo, Jan 11-13 2019". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
- ↑ "U-19 Cricket: Kamindu to lead Sri Lanka U19s at ICC Youth WC". Sunday Times (Sri Lanka). 11 December 2017. Retrieved 2023-08-22.
- ↑ "Group D, SLC Invitation Limited Over Tournament at Panadura, Dec 15 2019". ESPNcricinfo. ESPN Inc. 15 December 2019. Retrieved 2023-08-22.
- ↑ "Group A, SLC Twenty-20 Tournament at Colombo (PSS), Jan 4 2020". ESPNcricinfo. ESPN Inc. 4 January 2020. Retrieved 2023-08-22.
- ↑ Weerasinghe, Damith (9 August 2021). "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 2023-08-22.
- ↑ "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPNcricinfo. ESPN Inc. 6 July 2022. Retrieved 2023-08-22.
- ↑ Gaur, Akshat (17 April 2021). "Sri Lanka announces 18-man squad for Bangladesh Test series". Cricket Times. Retrieved 2023-08-22.
- ↑ "2nd Test, Kandy, Apr 29 - May 3 2021, Bangladesh tour of Sri Lanka". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
- ↑ "Jayawickrama's dream debut blunts Bangladesh on moving day". International Cricket Council. 1 May 2021. Retrieved 2023-08-22.
- ↑ "Sri Lanka vs Bangladesh, 2nd Test Day 3: Sri Lanka still have the edge over Bangladesh". Cricket World. 1 May 2021.
- ↑ "Statistics / Statsguru / Test matches / Bowling records". ESPNcricinfo. ESPN Inc. 3 May 2021. Retrieved 2023-08-22.
- ↑ "Jayawickrama helps Sri Lanka clinch first series win of 2021". International Cricket Council. 3 May 2021. Retrieved 2023-08-22.
- ↑ Isam, Mohammad (3 May 2021). "Praveen Jayawickrama's stunning debut seals Sri Lanka's dominant victory". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
- ↑ "Sri Lanka squad for England T20I and ODI series". Sri Lanka Cricket. 8 June 2021. Retrieved 2023-08-22.
- ↑ "1st ODI, Chester-le-Street, Jun 29 2021, Sri Lanka tour of England". ESPNcricinfo. ESPN Inc. 29 June 2021. Retrieved 2023-08-22.
- ↑ "Bhanuka Rajapaksa picked for India ODIs, T20Is; Kumara, Rajitha return from injuries". ESPNcricinfo. ESPN Inc. 16 July 2021. Retrieved 2023-08-22.
- ↑ Fernando, Andrew Fidel (30 August 2021). "Kusal Perera back in limited-overs squads after recovering from Covid-19". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
- ↑ Fernando, Andrew Fidel (10 September 2021). "Theekshana and Rajapaksa surprise picks in Sri Lanka's T20 World Cup squad". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
- ↑ "2nd T20I (N), Colombo (RPS), Sep 12 2021, South Africa tour of Sri Lanka". ESPNcricinfo. ESPN Inc. 12 September 2021. Retrieved 2023-08-22.