Jump to content

ప్రభా ఆత్రే

వికీపీడియా నుండి
ప్రభా ఆత్రే
ప్రభాఆత్రే
వ్యక్తిగత సమాచారం
జననం1932 సెప్టెంబరు 13
మూలంపూణే, భారతదేశం
మరణం2024 జనవరి 13(2024-01-13) (వయసు 91)
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
సంగీత శైలిఖయాల్, భజనలు, టుమ్రీలు. దాద్రా, గజల్, గీత్, నాట్య సంగీత్
వృత్తిహిందుస్తానీ సంగీతం
వాయిద్యాలుగాత్రం
క్రియాశీల కాలం1950 - ప్రస్తుతం

ప్రభా ఆత్రే (1932 సెప్టెంబరు 13 - 2024 జనవరి 13) ఒక కిరాణా ఘరానాకు చెందిన ఒక హిందుస్తానీ గాయని. ఈమెకు 2022 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.[1]

ప్రారంభ జీవితం, నేపథ్యం

[మార్చు]

ఈమె పూణే నగరంలో అదాసాహెబ్, ఇందిరాబాయి ఆత్రే దంపతులకు జన్మించింది. బాల్యంలో ఈమె, ఈమె సోదరి ఉషలకు సంగీతం పట్ల ఆసక్తి ఉండేది కానీ ఇద్దరూ సంగీతాన్ని వృత్తిగా స్వీకరించాలని భావించలేదు. ఈమె 8 యేళ్ల వయసులో ఈమె తల్లి ఇందిరాబాయి అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమెకు ఎవరో శాస్త్రీయ సంగీతం ద్వారా ఆ రుగ్మతలను తొలగించవచ్చని ఇచ్చిన సలహాను పాటించి కొంత సంగీతాన్ని నేర్చుకున్నది. ఆ సంగీత పాఠాలను విని ఈమెకు శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది.

ఈమె శాస్త్రీయ సంగీత శిక్షణ గురుకుల పద్ధతిలో నడిచింది. ఈమె ప్రారంభంలో విజయ్ కరందీకర్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఆ తర్వాత సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్ ల వద్ద ప్రత్యేక శిక్షణను పొందింది. ఈమెపై ఆమీర్ ఖాన్, బడే గులామ్‌ అలీఖాన్ ల ప్రభావం ఉంది. [ఆధారం చూపాలి]

ఈమె ఒక వైపు సంగీతం నేర్చుకుంటూనే సైన్సు, న్యాయశాస్త్రాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత సంగీతంలో పి.హెచ్.డి చేసింది.

విద్యార్హతలు

[మార్చు]
  • ఫెర్గూసన్ కాలేజి, పూనే విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి.
  • లా కాలేజి, పూనే విశ్వవిద్యాలయం నుండి బి.ఎల్.
  • గంధర్వ మహావిద్యాలయా మండలం నుండి సంగీత్ అలాంకార్ (మాస్టర్ ఆఫ్ మ్యూజిక్)
  • డాక్టర్ ఆఫ్ మ్యూజిక్
  • ట్రినిటీ కాలేజి ఆఫ్ మ్యూజిక్, లండన్ నుండి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ గ్రేడ్ -4
  • ఉత్తర భారత శాస్త్రీయ గాత్ర సంగీతంలో కిరణా ఘరానా నుండి సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్‌ల వద్ద శిక్షణ

వృత్తి

[మార్చు]

ప్రభా ఆత్రే తొలి రోజులలో మరాఠీ నాటకాలలో పాటలు పాడే పాత్రలను ధరించింది. ప్రస్తుతం ఈమె దేశంలోని కిరాణా ఘరానాకు చెందిన అనుభవజ్ఞులైన గాయకులలో మొదటి వరసలో ఉంది. ఈమె మొదటి ఎల్.పి.రికార్డు "మరు బిహాగ్" ఈమెపై ఆమిర్‌ఖాన్ యొక్క ప్రభావాన్ని స్పష్టంగా తెలుపుతుంది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఈమె పాత్ర ఎన్నదగినది. ఈమెకు ఖయాల్, టుమ్రీ, గజల్, దాద్రా, గీత్, నాట్య సంగీత్ మొదలైన ప్రక్రియలలో ప్రవేశం ఉంది. ఈమె 1969 నుండి విద్యార్థులకు సంగీత శిక్షణను ఇస్తున్నది.

గీతావళి

[మార్చు]

ఈమె ఈ క్రింది ఆడియో రికార్డులను విడుదల చేసింది.

  1. మరు బిహాగ్, కళావతి, ఖమజ్, టుమ్రీ
  2. నిరంజని - పురియ కళ్యాణ్, శంకర, బసంత్
  3. అనంత్ ప్రభ - లలిత, భిన్న షడ్జ, భైరవి, టుమ్రీ
  4. భాగ్యశ్రీ, ఖమజ్ టుమ్రీ
  5. జోగ్ కౌశ్, తోడి, టుమ్రీ
  6. మాలకౌశ్, దాద్రా
  7. చంద్రకౌశ్
  8. మధుకౌశ్
  9. మధువంతి, దేశి
  10. యమన్, భైరవ్
  11. శ్యాం కళ్యాణ్, బిహాగ్, రాగశ్రి, టుమ్రీ
  12. గజళ్ళు, భజనలు

స్వరకల్పనలు

[మార్చు]
  • ఈమె స్వయంగా అపూర్వ కళ్యాణ్, దర్బారీ కౌశ్, పత్‌దీప్ - మల్హర్, శివ్ కాళి, తిలంగ్-భైరవ్, రవి భైరవ్, మధుర్ కౌశ్ వంటి రాగాలను సృష్టించింది.
  • "నృత్యప్రభ" అనే నృత్యరూపకానికి సంగీతాన్ని సమకూర్చింది.
  • నెదర్‌ల్యాండ్ కు చెందిన సుసానె అబ్యూల్ జాజ్ సంగీతానికి స్వరకల్పన చేసింది.
  • పలు సంగీత నాటకాలకు స్వరకల్పన చేసింది.
  • స్వరంగిణి, స్వరాంజని అనే సంగీత పుస్తకాలను వ్రాసింది.

సంగీత సంబంధమైన కార్యకలాపాలు

[మార్చు]
  • ప్రభా ఆత్రే భారతీయ శాస్త్రీయ సంగీతం గురించి అనేక వ్యాసాలు వ్రాసింది. ఉపన్యాసాలు ఇచ్చింది. పలువురికి సంగీతం నేర్పించింది.
  • ఆల్ ఇండియా రేడియోలో సంగీత కార్యక్రమాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది.
  • మరాఠీ, హిందీ భాషలలో ఆకాశవాణి ఎ - గ్రేడ్ కళాకారిణి
  • సంగీత నాటకాలలోను, నాటికలలోను ప్రధాన స్త్రీ పాత్రలను ధరించింది.
  • ఈమె నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, కెనడా, కాలిఫోర్నియాలలోని పలు విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసింది.
  • ముంబైలోని ఎస్.ఎన్.డి.టి. మహిళావిశ్వవిద్యాలయం సంగీత శాఖకు అధిపతిగా, ప్రొఫెసర్‌గా పనిచేసింది.
  • 1992 ప్రాంతాలలో ఈమె "పండిట్ సురేష్ బాబు మానె & హీరాబాయి బరోడేకర్ సంగీత సమ్మేళనం"ను ఆరంభించింది. ప్రతియేటా డిసెంబరు నెలలో ఈ సంగీతోత్సవం ముంబై నగరంలో జరుగుతుంది.
  • 1981 నుండి "స్వరశ్రీ రికార్డింగ్ కంపెనీ"కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నది.
  • 1984లో కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యురాలు.
  • గత 22 సంవత్సరాలుగా పూణేలో పేరు పొందిన గాన్ వర్ధన్ అనే సంస్థకు అధ్యక్షురాలు.
  • ఈమె 2000లో "డాక్టర్ ప్రభా ఆత్రే ఫౌండేషన్"ను స్థాపించింది.
  • ఈమె పూణేలో స్వరమయి గురుకులాన్ని స్థాపించి సాంప్రదాయ పద్ధతులలో సంగీత శిక్షణను ఇస్తున్నది.

పురస్కారాలు

[మార్చు]
  • 1976 - ఆచార్య ఆత్రే సంగీత పురస్కారం.
  • జగద్గురు శంకరాచార్యులచే గానప్రభ బిరుదు.
  • 1990లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ పురస్కారాలు.[2]
  • 1991 - సంగీత నాటక అకాడమీ పురస్కారం.
  • కాళిదాస్ సమ్మాన్
  • 2011లో సంగీత నాటక అకాడమీ నుండి టాగూర్ అకాడమీ రత్న అవార్డు.
  • దీనానాథ్ మంగేష్కర్ అవార్డు.
  • హఫీజ్ అలీ ఖాన్ అవార్డ్
  • గోవింద్ లక్ష్మి అవార్డ్
  • గోదావరి గౌరవ పురస్కారము
  • ఆచార్య పండిట్ రామనారాయణ్ ఫౌండేషన్ అవార్డు
  • ఉస్తాద్ ఫయాజ్ అహ్మద్ ఖాన్ స్మారక పురస్కారము
  • కళాశ్రీ -2002
  • సంగీత్ సాధన అవార్డ్
  • పూణె విశ్వవిద్యాలయం నుండి జీవన సాఫల్య పురస్కారం

2011లో ఈమె పేరు మీద "స్వరయోగిని డా.ప్రభా ఆత్రే రాష్ట్రీయ శాస్త్రీయ సంగీత పురస్కారం" ప్రారంభించబడింది.

మరణం

[మార్చు]

ప్రభా ఆత్రే 91 ఏళ్ల వయసులో 2024 జనవరి 13న గుండెపోటుతో పూణేలో తుదిశ్వాస విడిచింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Padma awards: బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్‌". EENADU. Retrieved 2022-01-25.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
  3. "Renowned classical singer Prabha Atre doyen of Kirana Gharana dies at 92". The Week (in ఇంగ్లీష్). Retrieved 2024-01-13.
  4. V6 Velugu (13 January 2024). "విషాదం.. గుండెపోటుతో ప్రముఖ గాయని మృతి". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]