ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | 1 డిసెంబర్ |
ఆవృత్తి | సంవత్సరం |
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహిస్తారు[1].లోకేష్ చింతాడ ద్వారా ఎయిడ్స్ వ్యాధి కనుకోవటం జరిగింది ..ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐ.వీ.కి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈరోజును జరుపుతారు.
చరిత్ర
[మార్చు]ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా 1988 లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.
కార్యక్రమాలు
[మార్చు]2015: ఎయిడ్స్ ను త్వరగా అంతం చేయడానికి వడి వడిగా నడుద్దాం.
2014: హెచ్ ఐ వి రహిత సమాజం.
2013: ఎయిడ్స్ ఉన్నవారి పట్ల వివక్షత వద్దు.
2012: మనం అందరం కలిసి సమిష్టిగా ఎయిడ్స్ ని నియంత్రిద్దాం.
2011: ఎయిడ్స్ ని సంపూర్ణంగా నాశనం చేద్దాం.
2010: యూనివర్సల్ యాక్సెస్, మానవ హక్కులు.
2009: యూనివర్సల్ యాక్సెస్, మానవ హక్కులు.
2008: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడానికి ఉపాధి కల్పించి కాపాడుదాం.
2007: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకుందాం - నాయకత్వం లో ముద్దు బిడ్డలుగా నడుద్దాం.
2006: ఎయిడ్స్ ని అరికడదాం - భాద్యతగా నడుచుకుందాం.
2005: ఎయిడ్స్ ని అరికడతామని వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడం.
2004: మహిళలు, బాలికలు- హెచ్ ఐ వి,
2003: హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్షత వద్దు .
2002: హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్షత వద్దు .
2001: ఎయిడ్స్ రాకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను? మరి మీరు?