ప్యాట్నీ
ప్యాట్నీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°26′25″N 78°29′43″E / 17.4403125°N 78.4953125°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC 5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 003 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
పాట్నీ (పాట్నీ సర్కిల్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాదులో వాణిజ్య కేంద్రంగా ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతంలో ఎం.ఆర్.పాట్నీ 1927లో స్థాపించిన పాట్నీ మోటార్స్, చారిత్రాత్మక మహబూబ్ కళాశాల ఉన్నాయి.[1] 1862లో సోమసుందరం ముదలియార్ అనే వ్యక్తి ప్రాథమిక విద్య కోసం ఇక్కడ మొదటి ప్రభుత్వ పాఠశాలను స్థాపించాడు. 1893లో చికాగోకు బయలుదేరే ముందు స్వామి వివేకానంద పెద్ద సభలో ప్రసంగించాడు.[2] ఈ కళాశాల భవనాన్ని వారసత్వ భవనంగా హుడాప్రకటించింది.[3]
ఈ ప్రాంతంలో అనేక బట్టల దుకాణాలు ఉన్నాయి. పాట్నీలోని దుకాణాలు చీరల కోసం ప్రత్యేకంగా ప్రాచూర్యం పొందాయి.[4] తాజ్ మహల్, హోటల్ తాజ్ ట్రిస్టార్, తాజ్ బెల్సన్స్, గ్రాండ్ మినర్వా వంటి రెస్టారెంట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, జనరల్ పోస్ట్ ఆఫీస్, మంజు సినిమా థియేటర్, కాష్ ఫర్నిచర్ మాల్, స్వాప్నలోక్ కాంప్లెక్స్ ఉన్నాయి.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో జగదీష్ నగర్ కాలనీ, చంద్రనగర్ కాలనీ, సింధీ కాలనీ, రసూల్‌పుర, పైగా కాలనీ,సికింద్రాబాదు, పారడైజ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్యాట్నీ మీదుగా సికింద్రాబాద్, సనత్‌నగర్, ఆల్విన్ కాలనీ, భరత్ నగర్, బోరబండ, కొండపూర్ నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Forum for better Hyderabad". : Forum For A Better Hyderabad. Archived from the original on 2016-03-03. Retrieved 2021-02-02.
- ↑ "A reason to celebrate". : The Hindu, Hyderabad. 2006-06-17. Archived from the original on 2012-11-09. Retrieved 2021-02-02.
- ↑ "64th Meeting Minutes,". : Hyderabad Urban Development Authority. 2006-05-27. Archived from the original on 21 July 2011. Retrieved 2021-02-02.
- ↑ "Hyderabad: A Dazzling Array of Shopping Possibilities". : Pushpitha Wijesinghe. 2010-06-24. Archived from the original on 25 July 2011. Retrieved 2021-02-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-02.