Jump to content

రజస్వల

వికీపీడియా నుండి
(పుష్పవతి నుండి దారిమార్పు చెందింది)

యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని రజస్వల లేదా పుష్పవతి (Menarche) అవడము అంటారు. సాధారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ అంటారు.

బహిస్ట రకములో ఏముంటుంది: ప్రతి నెల అండము విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొరలో తయారవుతుంది. బహిష్ట ఫ్లో (రక్తము) (consists of a combination of fresh and clotted blood with endometrial tissue) మంచి, చెడు రక్తము, విచ్ఛిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారుగా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.

ఆలస్యంగా రజస్వల అవడము

[మార్చు]

కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు రజస్వల కారు. ఇటువంటివారికి ప్రైమరీ ఎమెనూరియా కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు - ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.

కారణాలు

[మార్చు]
  • విపరీతమైన డైటింగు చేయడం
  • ఎడతెరిపిలేని వ్యాయామాలద్వారా బాగా బరువుతగ్గడము
  • పోషకాలు, పోషకాహారము అందకపోవడము
  • స్థూలకాయము
  • దీర్ఘకాళిక అనారోగ్యము
  • పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు
  • థైరాయిడ్ సమస్యలు
  • అండకోశ వ్యాధులు, మున్నగునవి.

వైద్యం

[మార్చు]

కారణాలు అనేకము కాబట్టి గైనకాలజీ వైద్యురాలి దగ్గర పరీక్ష చేయించి సలహా పొందవలెను.

ముందస్తు యవ్వనం

[మార్చు]

జీవన శైలిలో మార్పుల కారణంగా 8 ఏళ్లలోపే అమ్మాయిల్లో నెలసరి రావడం జరుగుతుంది. [1]

పాటించవలసిన జాగ్రత్తలు

[మార్చు]

బహిష్టు సమయంలో ఆడపిల్లలు / స్త్రీలు సాధ్యమైనంత వరకూ శారీకశ్రమ చేయరాదు. పురుషులకు దూరంగా ఉండవలెను. మాంసాహారము, మసాలాలు, వేడిచేసే ఆహారపదార్ధాలు భుజించరాదు.

ఇవీ చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Health : ముందస్తు యవ్వనం ముంచుకు రావడానికి కారణాలేంటి?". EENADU. Retrieved 2022-01-25.
"https://te.wikipedia.org/w/index.php?title=రజస్వల&oldid=3888596" నుండి వెలికితీశారు