పంట వలయాలు
పంటచేలలో వలయాలు అనేవి సాధారణంగా తృణధాన్యాల చేలలో పంటను కొంతమేర చదును చేసి ఏర్పరచే ఆకృతులు. వీటిని ఇంగ్లీషులో క్రాప్ సర్కిల్, క్రాప్ ఫార్మేషన్, కార్న్ సర్కిల్ అని అంటారు. క్రాప్ సర్కిల్ అనే పదాన్ని మొదట 1980ల ప్రారంభంలో కోలిన్ ఆండ్రూస్ ఉపయోగించాడు. ట్రూమాన్ స్టేట్ యూనివర్శిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన టానెర్ ఎడిస్, పంటచేలో ఏర్పడే వలయాలన్నీ "బూటకపు పనుల పరిధిలోకి వస్తాయి" అని చెప్పాడు. ఇవి ప్రకృతి సహజంగానే ఏర్పడతాయనీ లేదా గ్రహాంతర వాసులు వీటిని ఏర్పరుస్తున్నారనీ కొన్ని పెడవాదాలు (ఫ్రింజ్ థియరీలు) ఉన్నప్పటికీ, వాటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. పంటచేలలో కనబడే ఈ వలయాలన్నిటికీ మానవులే కారణమని చెప్పేందుకు హేతువులున్నాయి
1970ల నుండి పంట వలయాల నివేదికల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిపై శాస్త్రీయ అధ్యయనం జరిగింది చాలా తక్కువ. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సర్కిల్‌లు ల్యాండ్‌స్కేప్ అంతటా విస్తరించి లేవు. రోడ్లకు దగ్గరగా, మధ్యస్థం నుండి బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతాలలోను, స్టోన్‌హెంజ్ లేదా అవెబరీ వంటి సాంస్కృతిక వారసత్వ స్మారక చిహ్నాల దగ్గరా ఇవి కనిపిస్తాయి. 1991లో, డౌగ్ బోవర్, డేవ్ చోర్లీ అనే ఇద్దరు మోసగాళ్లు అనేక వలయాలను సృష్టించామని చెప్పుకున్నారు. వాళ్ళు సృష్టించిన వలయాల్లో ఒక దానిని పరిశీలించిన ఒక పరిశోధకుడు, అవి మానవులు తయారు చేయడం అసాధ్యం అని చెప్పడంతో వాళ్ళు అలా ఇంగ్లండ్ అంతటా అనేక వలయాలను సృష్టించారు.[1]
ఈ ఆకృతులన్నీ రాత్రికిరాత్రే ఏర్పడతాయి.[2] అయితే కొన్ని పగటిపూటనే ఏర్పడినట్లు తెలిసింది. [3] ఈ పంట ఆకృతులకు విరుద్ధంగా, కొన్ని పురావస్తు అవశేషాల వలన కూడా పొలాల్లో వృత్తాలు, చతురస్రాల ఆకారాలలో ఆకృతులు ఏర్పడతాయి. కానీ అవి రాత్రికిరాత్రే ప్రత్యక్షం కావు. పైగా ఎప్పుడూ ఒకేచోట ఉంటాయి. 2003లో యు.కె.లో కనిపించిన పంటచేల వలయాల్లో దాదాపు సగం, ఆవెర్బెరీ రాతి వృత్తాల ప్రదేశానికి 15 చదరపు కిలోమీటర్లు (5.8 చ. మై.) లోపే ఏర్పడ్డాయి.
బోవర్, చోర్లీ
[మార్చు]తమను తాము చిలిపి వ్యక్తులు అని చెప్పుకునే డౌగ్ బోవర్, డేవ్ చోర్లీ అనే ఇద్దరు 1978లో చెక్కతో కూడిన ప్లాంక్, తాడు, బేస్ బాల్ టోపీతో అమర్చిన సాధారణ సాధనాలను ఉపయోగించి ఈ దృగ్విషయాన్ని ప్రారంభించామని చెప్పి 1991లో వార్తలకెక్కారు.[4] తమ వాదనను నిరూపించుకోవడానికి వాళ్ళు, జర్నలిస్టుల ముందు హడావుడి చేశారు; పాట్ డెల్గాడో అనే"సెరియోలాజిస్ట్" (పంట వలయాలకు సంబంధించిన పారానార్మల్ వివరణల సమర్థకుడు) ఆ వలయాన్ని పరిశీలించి అది ప్రామాణికమైనదేనని ప్రకటించాడు. ఆ తరువాత అది అది బూటకమని వెడైంది.[1][4][5] 1966 నుండి ఆస్ట్రేలియన్ వలయాల నుండి ప్రేరణ పొంది, బోవర్, చోర్లీలు 1987 కి ముందున్న అన్ని వలయాలు, 1978-1991లో ఏర్పడ్డ వాటిలో 200 కంటే ఎక్కువ వలయాలనూ (ఇవి కాక మరో 1,000 వలయాలు కూడా ఆ సమయంలో ఏర్పడ్డాయి) తామే సృష్టించామని పేర్కొన్నారు. ఫిజిక్స్ వరల్డ్‌లో వ్రాస్తూ, ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ టేలర్ ఇలా అన్నాడు, "వారు సృష్టించిన పిక్టోగ్రాఫ్‌లు పంట కళాకారులలో రెండవ తరంగాన్ని ప్రేరేపించాయి. వీటి సృష్టి తగ్గకపోగా, పంట వలయాలు అనేది అంతర్జాతీయ దృగ్విషయంగా పరిణామం చెందింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏటా వందలాది అధునాతన పిక్టోగ్రాఫ్‌లు కనిపిస్తున్నాయి."[2]
సృష్టి
[మార్చు]పంట వలయాలపై శాస్త్రీయ ఏకాభిప్రాయం ఏమిటంటే - అవి బూటకాలు గానో, ప్రకటనలు గానో లేదా ఒక కళగానో మానవులే నిర్మించారు.[6] ఒక వ్యక్తి లేదా సమూహం ఓ పంట చేలో ఆకారాన్ని నిర్మించడానికి అత్యంత విస్తృతంగా తెలిసిన పద్ధతి ఏమిటంటే, తాడుకు ఒక చివర రాటకు కట్టేసి, మరొక చివర మొక్కలను నలిపి చదును చేసేలా ఒక బోర్డుకి కట్టి, ఆ బోర్డును పొలంలో తిప్పడం. పారానార్మల్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారు పంట వలయాల లక్షణాలన్నీ మోసగాళ్ళు తయారు చేసారని చెప్పేదానికి పూర్తిగా అనుగుణంగా ఉంటాయి.
బోవర్, చోర్లీలు దక్షిణ ఇంగ్లాండ్‌లో పంట వలయాలను తయారు చేసినట్లు 1991 లో మొదటిగా ఒప్పుకున్నారు.[2] కొందరు వ్యక్తులు వాటిని నమ్మడానికి నిరాకరించినప్పుడు, అవి సహజ కారణాల వల్లనే ఏర్పడ్డాయని నిరూపించడానికి ఉద్దేశపూర్వకంగా సరళ రేఖలు, చతురస్రాలను ఆ వలయాలకు జోడించారు. వాటిని మరింతగా కాపీ కొడుతూ, ప్రపంచంలోని అనేక దేశాలలో సంక్లిష్టమైన సర్కిల్‌లు కనిపించడం ప్రారంభించాయి. GPS, లేజర్ల సహాయంతో అత్యంత క్లిష్టమైన నిర్మాణాలను కూడా తయారు చేయవచ్చని భౌతిక శాస్త్రవేత్తలు సూచించారు. 2009 లో, వరుసగా మూడు రాత్రులలో ఒక వృత్తం ఏర్పడింది. కొన్ని సగంలో ఆగిన వలయాలతో అసంపూర్తిగా మిగిలిపోయాయి.[2]
పంట వలయాలను మానవాతీత శక్తులు సృష్టించాయి అనే వాదనపై ఉన్న ప్రధాన విమర్శ ఏమిటంటే, ఈ మూలాలకు సంబంధించిన సాక్ష్యాలు - ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలతో సహా - అసలే లేవు. పైగా, కొన్ని మానవులే చేసిన చిలిపి పనులని గుర్తించారు. మరికొన్నింటిని కూడా మానవులే చేసారని వివరించే ఆధారాలున్నాయి. కొందరు పరిశోధకులు పంట వలయాలను "నిజమైన విషయమే" నని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఆ వలయాలను సృష్టించిన, ఆ మోసాన్ని డాక్యుమెంటు చేసిన వ్యక్తులు వాటిని ఖండించారు. బోవర్, చోర్లీలు, పాట్ డెల్గాడో,[4][7] వెసెక్స్ స్కెప్టిక్స్, ఛానల్ 4 కు చెందిన టెరెన్స్ మీడెన్ తదితరులు అవి మోసాలని నిర్థారించారు.[8][7][9] కార్ల్ సాగన్, 1997 లో రాసిన పుస్తకం ది డెమోన్-హాంటెడ్ వరల్డ్: సైన్స్ యాజ్ ఎ క్యాండిల్ ఇన్ ది డార్క్‌లో, పంట వలయాలు బోవర్, చోర్లీ వంటి మోసగాళ్ళు సృష్టించినవేనని నిర్ధారించాడు. UFOlogist లు బూటకాలను నిర్థారించే సాక్ష్యాలను కావాలని విస్మరిస్తారనీ, తద్వారా తమ మానవాతీత శక్తుల సిద్ధాంతాన్ని నమ్ముతారనీ అతను చెప్పాడు.[10] ఇంకా చాలా మంది, సంక్లిష్టమైన పంట వలయాలను ఎలా సృష్టించవచ్చో ప్రదర్శించారు.[11] సైంటిఫిక్ అమెరికన్ 1991లో ఉత్తర ఇంగ్లాండ్‌లో క్రాప్ సర్కిల్‌లను తయారు చేయడం ప్రారంభించిన మాట్ రిడ్లీ రాసిన ఒక కథనాన్ని ప్రచురించింది. సాధారణ సాధనాలను ఉపయోగించి పరిశీలకులను మోసం చేయగల చేయడం ఎంత సులభమో అతను రాసాడు. అతను ది వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి "నిపుణుల" గురించి రాస్తూ, ఇంకా అర్థం కాని దృగ్విషయాల పట్ల ప్రజలు అతీంద్రియ వివరణలను ఎందుకు విశ్వసించాలనుకుంటున్నారో, తేలికగా ఎలా మోసపోతారో వివరించాడు. పంట వలయాలను సృష్టించే పద్ధతులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కగా లభ్యమౌతున్నాయి.
కొన్ని సంస్థలు డబ్బులిచ్చి పంట వలయాలను సృష్టింపజేసి తమ వ్యాపార ప్రకటనలుగా ఉపయోగించుకుంటాయి.[12][n 1] అనేక పంట వలయాలు గుండె-బాణం వంటి మానవ సంబంధ చిహ్నాలను చూపుతాయి.[n 2]
మానవులే వీటిని సృష్టించారని రుజువు చేసే సాక్ష్యాలు మానవేతర సిద్ధాంతాన్ని కీంచపరచేందుకు చేసే ప్రయత్నమేనని మానవేతర శక్తుల సిద్ధాంతాన్ని నమ్మేవారు విమర్శిస్తారు.[14] దీని గురించి కుట్ర సిద్ధాంతాన్ని కూడా కొందరు చేస్తారు. వలయాల మూలాల గురించి ప్రజల్లో తికమక కలిగించేందుకు ప్రభుత్వాలు బూటకపు ఆధారాలను నాటుతున్నాయి=ని వాళ్ళు వాదిస్తారు. [14][15] రిడ్లీ, వార్తాపత్రికలలో ప్రతికూల కథనాలను వ్రాసినప్పుడు, అతను "ప్రభుత్వ తప్పుడు సమాచారాన్ని" వ్యాప్తి చేస్తున్నాడనీ, UK మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ MI5 కోసం అతను పని చేస్తున్నాడనీ ఆరోపించారు.[8] దానిపై రిడ్లీ స్పందిస్తూ, చాలా మంది సెరియోలజిస్టులు పుస్తకాలు రాసి అమ్ముకోవడం, పంట పొలాలకు వ్యక్తిగత పర్యటనలను ఏర్పాటు చేయడం ద్వారా ధనార్జన చేస్తున్నారనీ, తమ స్వార్థ ప్రయోజనాల కోసం హేతుబద్ధమైన వివరణలను తిరస్కరిస్తారనీ అన్నాడు.[8][16]
1980లు, 1990 లలో వచ్చిన సైన్స్ ఇల్లస్ట్రేటెడ్ వంటి సైన్స్ పత్రికల్లో, మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మొక్కలు వంగిపోయాయని వివరించే కథనాలు వచ్చాయి. ఆ కథనాల్లో మానవ ప్రభావం లేకపోవడం, అసాధారణ రేడియేషన్‌ను కొలవడం వంటి తీవ్రమైన నివేదికలు కూడా ఉన్నాయి. నేడు, దీన్ని సూడోసైన్స్‌గా పరిగణిస్తున్నప్పటికీ, ఆ సమయంలో ఇది తీవ్రమైన పరిశోధనకు సంబంధించినదే. GPS అందుబాటులో లేని ఆ రోజుల్లో, ఆ సంఘటనల వెనుక ఏదో తెలియని శక్తి ఉందనే అంశానికి ఎక్కువ ప్రచారం ఉండేది.[17]
ఇతర వివరణలు
[మార్చు]వాతావరణం
[మార్చు]విచిత్రమైన టోర్నడోలు, బంతి మెరుపుల వంటి అసాధారణ వాతావరణ దృగ్విషయాల ఫలితంగా పంట వలయాలు ఏర్పడవచ్చని కొందరు సూచించారు. అయితే ఈ కారణాలలో వలన పంట వలయాలు ఏర్పడినట్లు ఆధారాలేమీ లేవు.[2][18]
మానవాతీత శక్తి
[మార్చు]1980లలో మీడియా దృష్టిని విస్తృతంగా ఆకర్షించినప్పటి నుండి, పంట వలయాలపై ఊహాగానాలు పెరిగాయి. విచిత్రమైన వాతావరణ దృగ్విషయాల నుండి గ్రహాంతర జీవుల నుండి వచ్చిన సందేశాలని చెప్పే వరకు వివిధ పారానార్మల్, యూఎఫ్‌వోలు పరిశోధకుల ఊహాగానాలు ఇందులో ఉన్నాయి.[19] పంట వలయాలకు, ప్రపంచం లోని వివిధ ప్రదేశాల్లో ఉన్న చారిత్రిక కట్టడాలను కలిపే ఊహాత్మక రేఖలకూ సంబంధం ఉందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.[20] [21] అనేక కొత్త తరం సమూహాల విశ్వాసాల్లో పంట వలయాలు కూడా ఒక భాగం.
కొంతమంది మానవాతీత సిద్ధాంత సమర్థకులు, పంట వలయాలు బాల్ లైటింగ్ వల్ల ఏర్పడతాయనీ, ఆ నమూనాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని, వాటిని ఏదో ఒక శక్తి నియంత్రిస్తున్నానీ భావించేవారు. [22] వారు ప్రతిపాదించిన అలాంటి కొన్ని శక్తులు - గ్లోబల్ వార్మింగ్, మానవ కాలుష్యాన్ని ఆపమని కోరే గియా సిద్ధాంతం, దేవుడు, అతీంద్రియ జీవులు (ఉదాహరణకు భారతీయ దేవతలు ), "క్వాంటం ఫీల్డ్", గ్రహాంతర జీవులు. [22]
UFOలలో వచ్చే "గ్రహాంతర జీవులే" పంట వలయాలు కనిపించడానికి కారణమనే స్థానిక నమ్మకాలకు ప్రతిస్పందిస్తూ, ఇండోనేషియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ (LAPAN), పంట వలయాలు "మానవ నిర్మితమైనవి"గా అభివర్ణించింది. లాపాన్‌లోని ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనా ప్రొఫెసర్ థామస్ జమాలుద్దీన్, "ఈ 'సంగతిని' శాస్త్రీయంగా నిరూపించబడదని మేము అంగీకరించాం." మానవాతీత సిద్ధాంత విశ్వాసులు, యూఫాలజిస్ట్‌లు, అనామలిస్టిక్ ఇన్వెస్టిగేటర్‌లు కమిటి ఫర్ స్కెప్టికల్ ఎంక్వైరీతో సహా ఇతరులు చెప్పే ఊహాజనిత వివరణలను విమర్శకులు, శాస్త్రవేత్తలు సూడో సైంటిఫిక్‌గా విమర్శించారు.[12][23] గ్రహాంతర మూలాలకు సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లభించలేదు.
జంతు కార్యకలాపాలు
[మార్చు]2009లో, ఆస్ట్రేలియా లోని టాస్మానియా రాష్ట్రానికి చెందిన అటార్నీ జనరల్, ఆస్ట్రేలియన్ వాలబీలు ఓపియమ్ గసగసాల పొలాల్లో పంట వలయాలను సృష్టిస్తున్నట్లు కనుగొన్నాడు. వీటిని ఔషధ వినియోగం కోసం చట్టబద్ధంగా పెంచుతారు. ఓపియేట్ నిండిన గసగసాలలో కొన్నింటిని తిన్న తర్వాత ఈ వాలబీలు పొలాల్లో పరిగెత్తి ఈ వలయాలను ఏర్పరచారు.[24]
పంటలలో వచ్చిన మార్పులు
[మార్చు]కొందరు శాస్త్రవేత్తలు (భౌతిక శాస్త్రవేత్త ఎల్ట్జో హాసెల్‌హాఫ్, దివంగత జీవభౌతిక శాస్త్రవేత్త విలియం లెవెన్‌గూడ్), వృత్తాల లోపల, వాటికి వెలుపల ఉన్న పంటల మధ్య వ్యత్యాసాలను కనుగొన్నారు. అవి మానవ నిర్మితమైనవి కావు అనడానికి ఇది రుజువు అని వారు పేర్కొన్నారు.
లెవెన్‌గూడ్ 1994 1999లో ఫిజియోలాజియా ప్లాంటారమ్ జర్నల్‌లో పత్రాలను ప్రచురించాడు. తన 1994 పేపర్‌లో సర్కిల్‌ల లోపల ఉన్న ధాన్యంలో కొన్ని వైకల్యాలకు, సర్కిల్‌లోని ఆ ధాన్యం ఉన్న స్థానానికీ పరస్పర సంబంధం ఉందని అతను రాసాడు. 1996లో స్కెప్టిక్ జో నికెల్ పరస్పర సంబంధం ఉన్నంత మాత్రాన అది కారణం కాజాలదని ఆక్షేపిస్తూ,[18] లెవెన్‌గూడ్ అవలంబించిన పద్ధతులు, అంచనాలపై అనేక అభ్యంతరాలను లేవనెత్తాడు. "అతను చేసిన పనితో ఏ సంబంధమూ లేకుండా, శాస్త్రీయ ప్రోటోకాల్‌ల ప్రకారం చేసిన ఇతర స్వతంత్ర అధ్యయనాలలో కూడా అవే ఫలితాలను పొందితే తప్ప, లెవెన్‌గూడ్ చేసే అనేక సందేహాస్పద వాదనలను సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు -'పశువుల వికృతీకరణ' సైట్‌ల లోని మొక్కలు, సంబంధిత ఇతర పరిశోధనలతో సహా." అని అతను అన్నాడు.[25]
అయస్కాంతత్వం
[మార్చు]17 సంవత్సరాలుగా పంట వలయాలపై పరిశోధనలు చేస్తూ ఉన్న కోలిన్ ఆండ్రూస్, 80% మానవ నిర్మితమని తాను విశ్వసించినప్పటికీ, మిగిలిన వృత్తాలు, భూమి అయస్కాంత క్షేత్రంలో వచ్చే మూడు-డిగ్రీల మార్పు ద్వారా వివరించవచ్చని 2000 లో భావించాడు. ఈ మార్పు పంటలకు "విద్యుద్ఘాతం" కలిగించే కరెంట్‌ను సృష్టిస్తుంది, తద్వారా అవి చదునై పోయి ఈ వృత్తాలను ఏర్పరుస్తాయి.[6]
గమనికలు
[మార్చు]- ↑ In a newspaper article Lewis Cohen wrote, "Williams is probably best known as the only person in the UK to be successfully prosecuted for making crop circles. He has since made a name for himself creating crop circles for TV companies and commercial firms..."[13]
- ↑ The website Crop Circle Research.com described one formation stating, "It looks reminiscent of a fake dummy constructed by 'Balok' in a Star Trek episode called 'Corbomite Manourvre' [sic] (series 1)' or the logo of local soccer club Feyenoord".[14]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 William E. Schmidt (10 September 1991). "2 'Jovial Con Men' Demystify Those Crop Circles in Britain". The New York Times.William E. Schmidt (10 September 1991). "2 'Jovial Con Men' Demystify Those Crop Circles in Britain". The New York Times.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 . "Coming soon to a field near you".
- ↑ Margry & Roodenburg 2007, pp. 140–42.
- ↑ 4.0 4.1 4.2 Graham Brough (1991). "Men who conned the world". Today (defunct). UK.Graham Brough (1991). "Men who conned the world". Today (defunct). UK.
- ↑ "Two British artists admit playing 'circles' hoax for the past 13 years". Houston Chronicle (Star ed.). Houston Chronicle News Services. 10 September 1991. p. A2.
- ↑ 6.0 6.1 "Magnetic 'solution' to crop circle puzzle". BBC News. 9 August 2000. Retrieved 30 September 2015.
- ↑ 7.0 7.1 "Flattened. (crop circles hoax)". The Economist. US. 14 September 1991. Archived from the original on 15 May 2013 – via Highbeam.
- ↑ 8.0 8.1 8.2 Ridley, Matt (15 July 2002). "Crop circle confession".
- ↑ "Farmer embarrassed by crop circle hoax". canada.com. Canwest News Service. 2 October 2007. Archived from the original on 18 October 2013.
- ↑ Sagan 1997.
- ↑ Roel Van der Meulen (1994). "Faking UFOs". Roel Van der Meulen. Archived from the original on 23 November 2011.
- ↑ 12.0 12.1 John Vidal (5 June 2009). "The bizarre revival of crop circles – and advice on how to make your own". The Guardian.John Vidal (5 June 2009). "The bizarre revival of crop circles – and advice on how to make your own". The Guardian.
- ↑ Lewis Cohen (25 February 2008). "Mystery surrounds emergency landing". thisiswiltshire.co.uk. Weybridge.
- ↑ 14.0 14.1 14.2 Margry & Roodenburg 2007, pp. 143–45.
- ↑ Austin, Jon (22 September 2015). "Former RAF engineer: MI5 'paid people to fake crop circles' to discredit UFO research". Daily Express.
- ↑ Ridley, Matt (4 June 2011). "Houdini, crop circles and the need to believe". The Wall Street Journal.
- ↑ "Crop circle research held back by UFO conspiracy links". ABC News. 26 July 2016.
- ↑ 18.0 18.1 Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ "Mayan 'apocalypse' crop circle appears at Silbury Hill". The Daily Telegraph. 8 July 2009. Archived from the original on 12 January 2022.
- ↑ Eltjo Haselhoff (2001). The Deepening Complexity of Crop Circles: Scientific Research & Urban Legends. Frog Ltd. ISBN 1583940464.
- ↑ Margry & Roodenburg 2007, pp. 138–39.
- ↑ 22.0 22.1 Margry & Roodenburg 2007, p. 138.
- ↑ Ika Krismantari (6 February 2011). "Crop circles provide food for thought". The Star. Archived from the original on 30 October 2012.
- ↑ "Stoned wallabies make crop circles". BBC News. 25 June 2009. Retrieved 31 May 2011.
- ↑ Joe Nickell (June 1996). "Levengood's crop-circle plant research". Skeptical Inquirer. 6 (2). Archived from the original on 9 March 2010. Retrieved 31 March 2010.