Jump to content

నారాయణ కొచ్చెర్లకోట

వికీపీడియా నుండి
నారాయణ కొచ్చెర్లకోట

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
అక్టోబరు 8, 2009
ముందు గారీ హెచ్. స్టెర్న్

వ్యక్తిగత వివరాలు

పూర్వ విద్యార్థి యూనివర్శిటీ ఆఫ్ చికాగో (పిహెచ్.డి)
ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ (ఎ.బి.)
వృత్తి ఆర్థికవేత్త

నారాయణ కొచ్చెర్లకోట (జ. అక్టోబరు 12, 1963) భారతీయ సంతతికి చెందిన అమెరికా ఆర్థికవేత్త, మిన్నియాపోలిస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు 12వ, ప్రస్తుత అధ్యక్షుడు.

జీవిత చరిత్ర

[మార్చు]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కొచ్చెర్లకోట బాల్టిమోర్, మేరీలాండ్ నందు, ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు, కానీ ఈయన బాల్యమంతా చాలామటుకు మానిటోబా రాష్ట్రంలోని విన్నీపెగ్లో గడిచింది. 15 సంవత్సరాల వయసులో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించి 1983లో గణితశాస్త్రంలో నాలుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకొనెను. అతను 1987 లో చికాగో విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పిహెచ్.డి పట్టా అందుకున్నాడు.[1]

విద్యారంగంలో

[మార్చు]

కొచ్చెర్లకోట తొలుత నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని కెల్లాగ్ బిజినెస్ స్కూల్లో అధ్యాపకునిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ఐయోవా విశ్వవిద్యాలయం, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం, మిన్నసోటా విశ్వవిద్యాలయంలలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా పనిచేశాడు.[2][3] మానిటరీ ఎకనామిక్స్, ఆసెట్ ప్రైజింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అంశాలపై కొచ్చెర్లకోట చేసిన పరిశోధన ఎకానీమెట్రికా, జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, జర్నల్ ఆఫ్ ఎకనాకమిక్ థియరీ, జర్నల్ ఆఫ్ మానిటరీ ఎకనామిక్స్, జర్నల్ ఆఫ్ మనీ, క్రెడిట్ అండ్ బ్యాంకింగ్ తదితర ఆర్థికశాస్త్ర పరిశోధనా పత్రికలలో వెలువడింది.

మిన్నియాపోలిస్ ఫెడరల్ రిజర్వు అధ్యక్షునిగా

[మార్చు]

2009, అక్టోబర్ 8న గారీ హెచ్. స్టెర్న్ పదవీవిరమణాంతరం, కొచ్చెర్లకోట మిన్నియాపోలిస్ ఫెడరల్ రిజర్వు యొక్క అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాడు. కొచ్చెర్లకోట 1999 నుండి మిన్నియాపోలిస్ ఫెడరల్ రిజర్వుకు సలహాదారుగా పనిచేస్తున్నాడు.

2011 జనవరిలో కొచ్చెర్లకోట, 2000 దశకంలో హౌసింగ్ బబుల్ (గృహరంగంలో ఏర్పడిన ద్రవ్యోల్భణ బుడగ) సంభవించడానికి మూలకారణం ఫెడరల్ రిజర్వు యొక్క చర్యలేనన్న ఆరోపణను వ్యతిరేకించాడు. "భూమి ధరలు పెరగటం 1996లో మొదలైంది. ఫెడరల్ రిజర్వు యొక్క నిర్ణీత వడ్డీరేట్లు 4.75% నుండి 6.5% మధ్యలో ఉండిన, 1996 - 2001 మధ్య కాలంలో సాలీనా ధరలు 11% దాకా పెరుగుతూ వచ్చాయి. అంత ఎక్కువ వడ్డీరేట్లు ఉండటం ఏమాత్రం సడలించిన మానిటరీ పాలసీ కాదు.'"[4]

2011 ఆగస్టులో, సమీపకాలంలో వడ్డీరేట్లను సున్నాకు దగ్గరగా ఉంచడాన్ని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తామని, హామీ ఇస్తూ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ముగ్గురు ఫెడరల్ రిజర్వు గవర్నర్లలో కొచ్చెర్లకోట ఒకడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కొచ్చెర్లకోట బార్బరా మెక్కచ్చియాన్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఈయన భార్య చికాగో విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి పట్టా పొందింది.[6]

మూలాలు

[మార్చు]
  1. Serres, Chris (2009-12-13). "New chief rocks Minneapolis Fed". Minneapolis Star Tribune. p. D1.
  2. Jon Hilsenrath; Mark Whitehouse (2009-10-01). "Unconventional Thinker Gets Fed Post". Wall Street Journal. p. A2.
  3. Serres, Chris (2009-10-01). "U economics chair is new head of Minneapolis Federal Reserve". Minneapolis Star Tribune. p. D1. Archived from the original on 2012-10-14. Retrieved 2013-05-15.
  4. Goldstein, Steve, "Kocherlakota: Fed didn't cause housing bubble", MarketWatch, Jan. 11, 2011, 2:00 p.m. EST. Retrieved 2011-01-11.
  5. Appelbaum, Binyamin (2011-08-09). "Its Forecast Dim, Fed Vows to Keep Rates Near Zero". New York Times.
  6. Minneapolis Fed: Federal Reserve Bank of Minneapolis names Narayana Kocherlakota new president Archived 2009-10-03 at the Wayback Machine September 30, 2009

బయటి లింకులు

[మార్చు]