నాయుడుతోట
నాయుడుతోట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°45′49″N 83°12′44″E / 17.763476°N 83.212255°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530029 |
Vehicle registration | ఏపి-31 |
నాయుడుతోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1]
భౌగోళికం
[మార్చు]ఇది 17°45′49″N 83°12′44″E / 17.763476°N 83.212255°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో వేపుగుంట, కాకాని నగర్, ఎన్.ఎ.డి, సింహాచలం, వాలిమెరక మొదలైన గ్రామాలు ఉన్నాయి. దీనికి దక్షిణ దిశలో గాజువాక మండలం, తూర్పు వైపు విశాఖపట్నం మండలం, దక్షిణ దిశలో పెదగంట్యాడ మండలం, పశ్చిమాన సబ్బవరం మండలం ఉన్నాయి.[2]
వాణిజ్యం
[మార్చు]విశాఖపట్నంలోని శివారు ప్రాంతాలలో ఒకటైన నాయుడుతోట ప్రాంతంలో అనేక గృహ సముదాయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. కళాశాలలు, పాఠశాలలకు ఇది ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ కూడా ఉంది.[3] పెతకంశెట్టి అప్పలనరసింహం, సదరం అప్పల నాయుడులను స్మరించుకుంటూ నాయుడు తోట,నాయుడు క్వార్టర్స్అని పేరు పెట్టారు
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నాయుడుతోట మీదుగా గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, మల్కాపురం, ద్వారకా నగర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Naidu Thota Locality". www.onefivenine.com. Retrieved 12 May 2021.
- ↑ "Naiduthota Village". www.onefivenine.com. Retrieved 12 May 2021.
- ↑ "Property in Naidu Thota, Vizag | Real Estate in Naidu Thota, Vizag - Commonfloor.com". www.commonfloor.com. Retrieved 12 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 12 May 2021.