నల్లకుంట (హైదరాబాదు)
Nallakunta | |
---|---|
Coordinates: 17°23′55″N 78°30′29″E / 17.398558°N 78.508043°E | |
Country | India |
State | Telangana |
District | Hyderabad |
Metro | Hyderabad |
Languages | |
• Official | Telugu |
Time zone | UTC 5:30 (IST) |
PIN | 500 044 |
Vehicle registration | TS |
Lok Sabha constituency | Secunderabad |
Vidhan Sabha constituency | Amberpet |
Planning agency | GHMC |
నల్లకుంట హైదరాబాదు నగరంలోని ప్రాంతం. ఐఐటీ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకత. ఇది తార్నాకా నుండి కోఠికి వెళ్లే మార్గంలో ఉన్నది.
ప్రముఖమైన సంస్థలు
[మార్చు]- శ్రీ శృంగేరి శంకర మఠం
- శివం, సత్య సాయి బాబా హైదరాబాదు నివాసం, మందిరం.
- ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వాంధ్ర ప్రాచ్య కళాశాల: ఖండవల్లి లక్ష్మీరంజనం 1958లో స్థాపించిన విద్యాసంస్థ.
- ఫీవర్ హాస్పిటల్ (ఒకప్పుడు కోరంటి.)
- హిందీ మహావిద్యాలయము
- రామయ్య విద్యాసంస్థలు
- నారాయణ విద్యాసంస్థలు
- భారతీయ స్టేట్ బ్యాంకు, విద్యానగర్ శాఖ
- కెనరా బ్యాంకు, నల్లకుంట శాఖ
- ఆంధ్రా బ్యాంకు, నల్లకుంట శాఖ
- ఎస్.ఎల్.డయగ్నాస్టిక్ సెంటర్
సంస్కృతి
[మార్చు]శృంగేరి శంకర మఠం హైదరాబాదులోని పురాతన మఠం. 1960లో అక్షయ తృతీయ రోజున 35వ జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామీజీ దేవాలయ ప్రతిష్ఠ కుంభాభిషేకం నిర్వహించాడు.[1] ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ నవరాత్రులు జరుపబడుతాయి.[2]
అభివృద్ధి పనులు
[మార్చు]హుస్సేన్ సాగర్ వరద నీరు వల్ల, వర్షాల వల్ల నల్లకుంట ప్రాంతంలోని నాలా పరిసరాల్లో పలు కాలనీలు జలమయం అవుతున్నాయి. వరద నీరు రాకుండా ఉండడంకోసం స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ. 68.4 కోట్ల వ్యయంతో ఫీవర్ ఆస్పత్రి వద్ద రక్షణ గోడను నిర్మించనున్నారు. 2021 డిసెంబరు 30న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నాలా రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాడు.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Nallakunta - Sringeri Sharada Peetham". Retrieved 2018-06-10.
- ↑ "Devotional fervour". The Hindu. 2005-10-14. Retrieved 2018-06-10.
- ↑ "హుస్సేన్ సాగర్ వరద నీటి నాలాకు రక్షణ గోడ.. కేటీఆర్ శంకుస్థాపన". Namasthe Telangana. 2021-12-30. Archived from the original on 2021-12-30. Retrieved 2021-12-30.