Jump to content

నయాగరా నది

వికీపీడియా నుండి
నయాగరా నది యొక్క ఉపగ్రహ చిత్రం

నయాగరా నది (Niagara River - నయాగరా రివర్) అనేది ఏరీ సరస్సు నుంచి అంటారియా సరస్సుకు ఉత్తరంగా ప్రవహించే ఒక నది. ఇది కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ (పశ్చిమాన), యునైటెడ్ స్టేట్స్ లో న్యూయార్క్ రాష్ట్రం (తూర్పున) మధ్యన సరిహద్దు భాగంగా ఉంది. ఈ నది యొక్క పేరు పుట్టుకపై విభిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. ఇరోక్వియన్ స్కాలర్ బ్రూస్ ట్రిగ్గర్ ప్రకారం స్థానికంగా నివసిస్తున్న స్థానిక తటస్థ సమాఖ్య యొక్క ఒక శాఖ ఇచ్చిన పేరు నుండి "నయాగరా" అని పేరు వచ్చింది, ఆ ప్రదేశాలలోని ప్రజలు అనేక మార్లు అప్పటి 17 వ శతాబ్దపు ఫ్రెంచ్ పటాల్లో "నయాగగరేగ" ప్రజలు అని వర్ణించబడ్డారు.[1] జార్జ్ ఆర్. స్టీవర్ట్ ప్రకారం, ఇది "రెండుగా కట్ అయిన భూమి పాయింట్" అనే అర్థానిచ్చే "ఒంగినియాఅహ్రా" అనే ఒక ఐరోక్వోయిస్ పట్టణం పేరు నుండి వచ్చింది.[2]

ఈ నది దాని కొనసాగింపుగా ఉన్న నయాగరా జలపాతం సహా 58 కిలోమీటర్ల (36 మైళ్లు) పొడవుతో ఇది అప్పుడప్పుడు ఒక జలసంధి గా వర్ణించబడుతుంది.[3]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Bruce Trigger, The Children of Aataentsic (McGill-Queen's University Press, Kingston and Montreal,1987, ISBN 0-7735-0626-8), p. 95.
  2. Stewart, George R. (1967) Names on the Land. Boston: Houghton Mifflin Company; p. 83.
  3. Mobot.org

బయటి లింకులు

[మార్చు]