Jump to content

ధుబ్రి జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 26°02′00″N 89°58′00″E / 26.0333°N 89.9667°E / 26.0333; 89.9667
వికీపీడియా నుండి
Dhubri district
ধুবুৰী জিলা
Dhuburi collage
(Clockwise from top) Netai Dhubunir Ghat, Historical Panbari Mosque, Chilarai statue at Dhubri town, Sri Guru Tegh Bahadur Sahib Gurdwara, and Bhola Nath College
[[File:Matherjhar Aitihasik mathh mandir Matherjher Dhubri Assam. dhepdhepi Kali mandir, Balajan kali mandir,|100x100px|border|Flag of Dhubri district]]
Dhubri district's location in Assam
Dhubri district's location in Assam
Countryభారత దేశము
Stateఅసోం
ప్రధాన కార్యాలయంధుబ్రి
విస్తీర్ణం
 • Total2,838 కి.మీ2 (1,096 చ. మై)
జనాభా
 (2011)
 • Total19,48,632
 • జనసాంద్రత690/కి.మీ2 (1,800/చ. మై.)
Time zoneUTC 05:30 (IST)
ISO 3166 codeIN-AS-DB
Websitehttp://dhubri.gov.in/

ధుబ్రి జిల్లా, (అస్సామీ:ধুবুৰী) భారతదేశం లోని అస్సాం రాష్ట్ర జిల్లాలలో ఒకటి. జిల్లా ప్రధానకేంద్రం ధుబ్రి పట్టణంలో ఉంది. ఇది రాష్ట్ర రాజధాని గౌహతికి 290కి.మీ దూరంలో ఉంది.1876లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మునుపటి గోల్‌పారా జిల్లాకు కూడా ఇది కేంద్రంగా ఉంది. 1883లో గోల్‌పారా జిల్లా 4 వేరువేరు జిల్లాలుగా విభజించబడ్డాయి. ఇందులో ధుబ్రి ఒకటి. అస్సాంలోని ముస్లిములు ఆధిక్యతలో ఉన్న జిల్లాలలో ధిబ్రీజిల్లా ఒకటి. ధుబ్రీజిల్లాలో 75% ముస్లిములు ఉన్నారు. 2011 గణాంకాల ఆధారంగా అత్యంత జనసాంధ్రత కలిగిన జీల్లాలలో ఇది ద్వితీయ స్థానంలో ఉంది.[1]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఒకప్పుడు చంద్ సదాగర్ కథలో ప్రధానపాత్ర " నేతై ధుబానీ " బ్రహ్మపుత్రానదీ తీరంలో తనదుస్తులను ఉతికిన రేవుప్రాంతమే ధుబ్రీ అయిందని భావిస్తున్నారు. ఆప్రత్యేక ప్రాంతంలో ఇప్పుడు " నేతై ధుబునీర్ ఘాట్ " ఉంది.

చరిత్ర

[మార్చు]
Gurdwara Sri Guru Tegh Bahadur Sahib at Dhubri
Chilarai statue at Dhubri Town

గతంలో ధుబ్రీ అస్సాం ప్రవేశద్వారంగా పలుజాతుల కూడలి ప్రాంతంగా ఉంది. పలు జాతులకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తూ ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈప్రాంతంలో సమీకృతమైన వైవిధ్యమైన జాతులు, కులాలు, మతాలకు చెందిన ప్రజల, దాడులు, వలసప్రజల కారణంగా విలసిల్లిన సాంస్కృతికాభివృద్ధి భాషా, కళలు మతం మీద ప్రభావం చూపింది.

రాజారాం సింగ్

[మార్చు]

సా.శ.1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తిరుగుబాటు చేస్తున్న అహూం రాజు చకేధ్వాజ్ సింఘాల్‌ను అణచడానికి రాజారాం సింగ్ (అంబర్ కుమారుడు) ని ఈప్రాంతానికి రాజప్రతినిధిగా పంపాడు. ఇలాంటి కార్యం నెరవేర్చడానికి అస్సాం కష్టసాధ్యమైన ప్రాంతం అని భావించిన రాజారాం సింగ్ గురుతేజ్ సింగ్ సహాయం కొరకు అభ్యర్థించాడు.గురుతేజ్ సింగ్ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రధానపాత్ర వహించాడు. వాస్తవానికి రాజారాం సింగ్‌కు ఈకార్యం ఒక శిక్షగా అప్పగించబడింది. అంతకు కొన్ని సంవత్సరాలకు ముందు రాజారాం నిర్భంధంలో ఉన్న శివాజీ ఆయన కుమారుడు పారిపోయినందుకు శిక్షగా మొఘల్ చక్రవర్తి రాజారాం సింఘ్‌కు ఈ పని అప్పగించబడింది.

తేజ్ బహదూర్

[మార్చు]

సా.శ. 1669 ఫిబ్రవరిలో కామరూప్ ఈప్రాంతంలో ప్రవేశించింది. రంగమతి కోటలో రాజారాం సింగ్ సేనలతో మకాం వేసిన సమయంలో గురు తేజ్ బహదూర్ ధుబ్రీ ప్రాంతంలో మకాం వేసాడు. మొఘల్ సైన్యం ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ అస్సామీ ప్రజల మంత్రతంత్రశక్తులకు వ్యతిరేకంగా పోరాడడానికి గురుతేజ్ బహదూర్ సహాయం అవసరమని భావించారు. నదికి ఆవలితీరంలో ఉన్న అసామీలు వారి మంత్రశక్తులు, మాంత్రుకుల శక్తుల మీద విశ్వాసం ఉంచి అశేషంగా నిలిచిన మొఘల్ సైన్యాలను చూసిన తరువాత కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిలిచారు.

అస్సామీ మంత్రగత్తెలు

[మార్చు]

అస్సామీ మంత్రగత్తెలు తమమాంత్రిక శక్తులను ఉపయోగించి మంత్రాలను ఉచ్ఛరిస్తూ నదికి ఆవలితీరంలో ఉన్న గురుతేజ్ బహదూరు మకాంను ధ్వశం చేయడానికి మాంత్రికప్రయోగాలు చేసారు. అయినప్పటికీ వారి మంత్రశక్తులు గురు తేజ్ బహదూరుకు హాని కలిగించడంలో విఫలం అయ్యాయి. మంత్రగత్తెలు తమ మంత్రశక్తులతో ఎటువంటి మానవులకైనా హానికలించవచ్చని అతిగా విశ్వశించారు. నదిమీదుగా వారు 26 అడుగుల పొడవైన రాతిని విసిరారు. ఆరాయి మిస్సైల్ మాదిరి ఆకాశమార్గం నుండి గురు తేజ్ బహదూర్ మకాం సమీపంలో పడింది. తీవ్రంగా విసరబడిన రాతిలో సగం పొడవు భూమిలో పాతుకుపోయింది.అది ఇప్పటికీ అదే స్థితిలో కనిపిస్తూ ఉంది. నగరకేంద్రంలో ఉన్న రాతిని తొలగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించినా అది సఫలం కాలేదు.జరిగిన సంఘటనకు సాక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉంచిన ఇత్తడి టాబ్లెట్ అక్కడ దర్శనం ఇస్తూ ఉంది.

మంత్రగత్తెలు విసిరిన రాయి గురు తేజ్ బహదూర్ మాకాంకు హానికలిగించడంలో విఫలం అయిన తరువాత వారు ఒక చెట్టును ప్రయోగించారు. అది మకాంలోని వ్యక్తులకు హానిచేయకుండా గురు తేజ్ బహదూర్ మాకం సమీపంలో పడింది. గురు తేజ్ బహదూరు మంత్రగత్తెల మీద బాణాల ప్రయోగం చేసిన తరువాత మాంత్రికశక్తులు ముగిసాయి. మంత్రగత్తెలు తమ మత్రశక్తులు గురు తేజ్ బహదూర్ శక్తుల ముందు ఓటమి పొందాయని గ్రహించారు. తరువాత వారు నదిని దాటి వచ్చి గురుతేజ్ బహదూరుకు హాని కలిగించినందుకు ఆయనను క్షమించమని వేడుకున్నారు. వారు తమను బానిసలను చేయడానికి ప్రయత్నించిన విదేశీశక్తులను వ్యతిరేకిస్తూ మాత్రమే తాము పోరాటం సాగించామని అంగీకరించారు.గురు తేజ్ బహదూర్ తాను రాజారాం సింగ్, అహూం కింగ్ మధ్య శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తానని వారికి వాగ్ధానం చేసాడు.

శాంతి ప్రయత్నాలు

[మార్చు]

గురుతేజ్ సింగ్ శాంతిప్రయత్నాలను మొఘల్, అహూం సైన్యాలు స్వాగతించాయి. ఇరువైపుల ఉన్న సైన్యాలు మోసుకువచ్చిన ఎర్రమట్టితో ఒక గుట్టను స్మారక చిహ్నంగా స్థాపించారు. గురుతేజ్ బహదూర్ సాగించిన విజయవంతమైన శాంతి చిహ్నం ధుబ్రీలో ఇప్పటికీ నిలిచి ఉంది. దేశమంతటి నుండి భక్తులు ధుబ్రీకి వచ్చి గురు డండమా సాహెబ్‌కు నివాళులు సమర్పిస్తుంటారు. వారు హిందూ, ముస్లిం సైన్యాలు నిర్మించిన మట్టిదిబ్బను కూడా సందర్శిస్తుంటారు.అహో పాలనను వ్యతిరేకిస్తూ రాజారాం సింగ్‌తో వచ్చిన 5 గురు సూఫీ సన్యాసులు నిర్మించిన " పాచ్ పీర్ దర్గా " కూడా నగరంలో ఉంది.

చారిత్రక ప్రదేశాలు

[మార్చు]
Historic Panbari Mosque at Dhubri
Inside look of Historic Panbari Mosque at Dhubri
Historic Netai Dhubunir Ghat at Dhubri

తూర్పు ధుబ్రీకి 25 కి.మీ. దూరంలో పాంబరి, రంగమతి సమీపంలో జాతీయ రహదారి 31 సమీపంలో చారిత్రాత్మకమైన " పాంబరి మసీదు " ఉంది. ఇది అస్సాంలో ఉన్న అతిపురాతన మసీదుగా గుర్తించబడుతుంది. దీనిని 1493, 1519 మధ్యకాలంలో బెంగాల్ గవర్నర్ హుస్సేన్ షాహ్ నిర్మించాడు. మొఘల్ మొహమ్మదీయ సైనికులకు ఇది ప్రార్థనామందిరంగా ఉండేది. అంతేకాక నగరంలో అదేసమయంలో నిర్మించబడినవిగా భావించబడుతున్న ఇడ్గాహ్, లోతైన బావి ఉన్నాయి.

పాంబరి బహర్

[మార్చు]

నగరంలో పంబరి " పహర్ " (అసాంలోని ముస్లిముల పవిత్రక్షేత్రం) ఉంది. అందమైన ఈకొండప్రాంతం చక్కని వృక్షాలతో సుసంపన్నంగా ఉంటుంది. ఇది నిర్మాణప్రాధాన్యత ఒక పర్యాటక ఆకర్షణగా మారింది. 200 సంవత్సరాల ముందు ఈప్రాంతం ప్రజలు ఇక్కడ దట్టమైన అటవీప్రాంతం మద్య ఉన్న మసీదును కనుగొన్నరని భావిస్తున్నారు. తరువాత వారు మసీదును శుభ్రపరిచి నమాజు చేయడం మొదలుపెట్టారు. ఈద్ సమయంలో ఈ మసీదు ప్రత్యేకకళ సంతరించుకుంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి మసీదును సందర్శిస్తుంటారు. భారతీయులే కాక ఇంగ్లాండ్, జపాన్ దేశాల నుండి కూడా పర్యాటకులు ఈ మసీదును సందర్శించడానికి వస్తుంటారు.

పంచ్‌పీర్ దర్గా

[మార్చు]

" పంచ్ పీర్ దర్గా " రాజారాం సింగ్ వెంట వచ్చిన సుఫీ సన్యాసులతో నిర్మించబడింది.

ఆధునిక ధుబ్రి

[మార్చు]

ఆధునిక ధుభ్రీ 1983 జూలై 1న రూపొందించబడింది. ఇది గోల్పారా జిల్లా నుండి విభజించబడింది.[2]

నైసర్గికం

[మార్చు]

ధుబ్రీ జిల్లా వైశాల్యం 2838 చ.కి.మీ.[3] ఇది రష్యా లోని జెమ్ల్యా జార్గా వైశాల్యానికి సమానం.[4] ధుబ్రీ జిల్లా రాష్ట్రీయ, అంతర్జాతీయ సరిహద్దుల ప్రాంత కూడలిలో ఉంది. జిల్లా సరిహద్దులో గోల్పారా, బోగైగావ్ జిల్లా సరిహద్దులు, మేఘాలయ రాష్ట్రం లోని గారో హిల్స్ సరిద్దులు అలాగే పశ్చిమ బెంగాల్ సరిహద్దులు, అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

ధుబ్రీ జిల్లా ప్రాథమికంగా వ్యవసాయ ఆదాయం, వన్యసంబంధిత ఆదాయం మీద ఆధారపడి ఉంది. ప్రధాన వ్యవసాయ పంట వరి శిశిరం, హేమంత ఋతువులలో పండించబడుతుంది. జనపనార, ఆవాలు వాణిజ్యపంటలుగా పండించబడుతున్నాయి. గోధుమలు, మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు, చెరకు కూడా తగినంత పండించబడుతుంది. అడవుల నుండి కొయ్య, వెదురు నుండి ఆదాయం లభిస్తుంది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక కూడా లభిస్తుంది. చేపలు, పాలు, మాంసం, గుడ్లు ఆదాయంలో కొంత భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో టీ తోటల నుండి లభించే ఆదాయం మీద జిల్లా దృష్టిసారించడం లేదు. టీ 1362.33 హెక్టారుల విస్తీర్ణంలో పండించబడుతుంది. చెక్ గేట్స్, ఎగుమతి పన్ను ద్వారా తగినంత ఆదాయం లభిస్తుంది. జిల్లా నిధులు అధికంగా నిర్వహణ, అభివృద్ధి పనులు, వెల్ఫేర్ పనుల కొరకు వ్యయం చేయబడుతున్నాయి.జిల్లా సహజవనరులను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లా ఆర్థికరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు.

కొన్ని ప్రధాన ఉత్పత్తులు, ఆదాయం:[5]

  • బియ్యం ఉత్పత్తి: సుమారుగా 15,000 టన్నులు.
  • వన్యసంబంధిత ఆదాయం: సుమారుగా 40,00000.00 రూపాయలు.
  • ఎక్సైజ్ ఆదాయం: సుమారుగా 1,70,80,742.00 రూ (2000–2001)
  • అమ్మకం పన్ను: సుమారుగా. 10,13,36,902.00 రూ (2000–2001)

విభాగాలు

[మార్చు]

జిల్లాలో ప్రస్తుతం మూడు విభాగాలు ఉన్నాయి: 1. ధుబ్రీ (సాదర్)
2. బిలాసిపరా
3. దక్షిణ సల్మరా - హత్సింగిమారి, మంకచార్.

జిల్లాలో 8 రెవెన్యూ విభాగాలు, 7 తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో 8 పోలీస్ స్టేషన్లు, 4 బేసిక్ టౌన్లు ఉన్నాయి.

జిల్లాలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: మంకచార్, సల్మరా సౌత్, ధుబ్రీ, గౌరిపూర్, గోలక్గంజ్, బిలాసిపరా వెస్ట్, బిలాసిపరా తూర్పు.[6] 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ధుబ్రీ లోక్ సభా నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్నాయి.[7]

ప్రయాణ వసతులు

[మార్చు]

వాయుమార్గం

[మార్చు]

ధుబ్రి జిల్లాలో ధుబ్రీ పట్టణానికి 23 కి.మీ దూరంలో ఉన్న " రూప్సీ ఎయిర్ పోర్ట్ " జిల్లా వాసులకు వాయుమార్గ ప్రయాణసేవలు అందిస్తుంది. ఇది రెండవ ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వంచేత (సైనికావసరాల కొరకు) నిర్మించబడింది. 1983 వరకు ఇండియన్ ఎయిర్ లైంస్, ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్స్ ఇక్కడి నుండి కొలకత్తా, గౌహతీ, ధుబ్రీ లమద్య విమానాలన సేవలు అందించాయి. అయినప్పటికీ ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం పునరుద్ధరణ, విస్తరణ కార్యక్రమాలు ఆరంభం అయ్యాయి.

జలమార్గం

[మార్చు]

జిల్లాలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్రానదీ తీరంలో రద్దిగా ఉండే నౌకాశ్రయం ఉంది. ఇది పొరుగున ఉన్న దేశాలకు సరుకును చేరవేస్తూ అంతర్జాతీయ రవాణాసేవలు (ప్రత్యేకంగా బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ) అందించింది. ప్రస్తుతం ఇది ఉపయోగంలో లేదు.

రైలుమార్గం

[మార్చు]

1947 నుండి ఎం.జి. మార్గం రైలుమార్గం సేవలు అందిస్తుంది. ఇది కొలకత్తా నుండి మునుపటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్ ) రైలుమార్గంలో ఉంది. 2010లో సరికొత్తగా రైలు సేవలు ఆరంభించబడ్డాయి. ధుబ్రీ రల్వేస్టేషన్ నుండి సిల్ ఘాట్‌కు (రాజ్య రాణి ఎక్స్ప్రెస్), ధుబ్రీ నుండి న్యూ జల్పైగురికు (సిలిగురి) (ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్), ధుబ్రీ ఫకీరాగ్రాం పాసింజర్ రైలు సేవలు అందిస్తున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,948,632, [1]
ఇది దాదాపు. లెసొతొ దేశ జనసంఖ్యకు సమానం.[8]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[9]
640 భారతదేశ జిల్లాలలో. 240వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1171 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.4%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 952:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 59.36%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ముస్లిములు 1,216,455 (74.29%)
హిందువులు 405,065
క్రైస్తవులు 12,477 .[10]

చ.కి.మీకి 584 మంది ప్రజలు నివసిస్తున్న ధుబ్రీ జిల్లా భారతదేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. 2001 గణాంకాలను అనుసరించి ఇది జనసాంధ్రతలో అస్సాంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో నాగావ్ జిల్లా ఉంది. అక్షరాస్యత 48.21%. ఇందులో పురుషుల అక్షరాస్యత 55.91%, స్త్రీల అక్షరాస్యత 40.04% ఉంది. జిల్లాలో గోలపరియా, బెంగాలీ భాషలు వాడుక భాషగా (మాట్లాడే భాషగా) ఉన్నాయి. అస్సామీ భాష అధికారభాషగా ఉంది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా 26.22 - 25.28 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో, 89.42 - 90-12 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా నైసర్గికంగా సముద్రమట్టానికి 30 మీటర్ల ఎత్తులో ఉంది. భౌగోళికంగా జిల్లా అక్కడక్కడా చిన్న చిన్న కొండలతో (తొకొరబంధా, దుధ్నాధ్, చందర్దింగా, బౌకుయామారి, బోరో పహర్, చక్రశిలా మొదలైన కొండలు) కూడిన మైదానప్రాంతంగా ఉంటుంది. కొండలు జిల్లా ఈశాన్యప్రాంతంలో ఉన్నాయి.జిల్లాలో తూర్పు పడమరలుగా బ్రహ్మపుత్ర నది చంపాబతి, గౌరంగ్, గదాధర్, గంగాధర్, తిప్కై, సిలై, జింజిరం మొదలైన ఉపనదులతో ప్రవహిస్తుంది. జిల్లా వార్షిక వర్షపాతం 2,916 మి.మీ.

సస్కృతి

[మార్చు]

టెర్రకోటా, పాటరీకళ

[మార్చు]

ప్రపంచ టెర్రకోటా మార్కెటులో ధుబ్రీ జిల్లా ప్రధానపాత్ర వహిస్తుంది. అస్సామీ టెర్రకోటా కళలకు రాష్ట్రం లోని ధుబ్రీ జిల్లాలో ఉన్న గౌరీపూర్ పట్టణం సమీపంలో అషరికండీ గ్రామం జన్మస్థానంగా ఉంది. ఈ గ్రామంలో 80% కంటే అఫ్హికమైన కుటుంబాలు తాము ఉత్పత్తి చేసిన టెర్రకోటా ఉత్పత్తులను అంతర్జాతీయ, జాతీయ మార్కెటులో విక్రయించడంద్వారా తమ జీవనానికి అవసరమైన ఆదాయం పొందుతూ ఉన్నారు.[11]

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

ధుబ్రీ జిల్లాలో గురుద్వారా గురు తేజ్ బహదూర్ సాహెబ్, మహామాయా ధాం, రంగమాతి (పంబారి మసీదు) (ఇది ఈశాన్యభారతంలో ఉన్న అత్యంత పురాతనమైన మసీదు) [12] చర్కశలా వన్యప్రాణి అభయారణ్యం, ఫ్లోరికన్ గార్డెన్, పంచ్పీర్ దర్గా మొదలైన పర్యాటక ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి.

జిల్లాలో ఉన్న " గురుద్వారా దందామా సాహెబ్ " (థారా సాహెబ్ ) జిల్లాకు ప్రత్యేకత సంతరించింది. సిక్కు ప్రథమ గురువు " గురు నానక్ " ఈప్రాంతానికి విచ్ఛేసినందుకు గుర్తుగా ఇది నిర్మించబడింది. తరువాత దీనిని 9వ సిక్కు గురువు " గురు తేజ్ బహదూర్ " సందర్శించిన తరువాత ఈ గురుద్వారాకు తిరిగి " శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్ " పేరు మార్చబడింది. అప్పటి నుండి ఇది సిక్కులకు ప్రధాన గురుద్వారాలలో ఒకటిగా మారింది.

ధుబ్రీ జిల్లాలో ధుబ్రీ, గౌరిపూర్, బిలాసిపరా, గోలక్పంజ్, తమార్తట్, సపత్గ్రాం, చాపర్ (ధుబ్రీ), హత్సింగిమారి, మంకచార్, అగోమొని, హలకురా మొదలైన పట్టణాలు ఉన్నాయి.

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1994 జూలై 14న ధుబ్రీ జిల్లాలోని అరణ్యప్రాంతం " అభయారణ్యం "గా అస్సాం ప్రభుత్వం చేత అధికారిక ప్రకటన చేయబడింది. దీనికి " చర్కశిలా అభయారణ్యం " అని పేరును నిర్ణయించారు. 11,260 ఎకరాల విస్తీర్ణం కలిగిన " చర్కశిలా అభయారణ్యం " ఈశాన్యభారతంలో అతిచిన్న అభయారణ్యంగా భావించబడుతుంది. ఇందులో " గోల్డెన్ లాంగూర్ ", (ప్రెస్ బైటిస్ గీ) ఇది అస్సాం, భూటాన్ సరిహద్దులో మినహా మరెక్కడా కనిపించదు. ఇక్కడ అరుదైన వృక్షజాతులు, పొదలు, ఔషధ మొక్కలు, క్షీరదాలు, సరీసృపాలు, అంతరించి పోతున్న పక్షులు, ఇంజెక్టులు ఉన్నాయి.

ధుబ్రీ జిల్లాలో అస్సాం రాష్ట్ర పశ్చిమ సరిహద్దులో " చర్కశిలా అభయారణ్యం " 26-15 నుండి 26-26 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90-15 నుండి 90-20 డిగ్రీల తూర్పురేఖాంశంలో ఉంది. ఇది జిల్లా కేంద్రం ధుబ్రీ నుండి 68 కి.మీ, గౌహతీలో ఉన్న బొర్ఝర్ విమానాశ్రయం నుండి 219కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అడవి జంతువుల దాహార్తిని తీర్చడానికి పలు సెలయేళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ హౌహొవీ ఝొరా, బమునీ ఝొరా సెలయేరులు నిరంతరం ప్రవహిస్తుంటాయి. రాళ్ళు మద్య ఉరుకులుపరుగులతో ప్రవహించే ఈ సెలయేరులు అద్వితీయ సౌందర్యంతో చూపరులను ఆకర్షిస్తుంటాయి.

చర్కశిలా అభయారణ్యం వాతావరణం శీతాకాలంలో పొడిగా వేసవికాలంలో వేడిగా ఉంటుంది. వేసవి తరువాత అత్యధిక వర్షపాతం ఉంటుంది. వార్షిక వర్షపాతం 200-400 సె.మీ. ఉష్ణోగ్రతలు సంవత్సరంలో 8-30 డిగ్రీల సెంటీగ్రేడుతో వైవిధ్యంగా ఉంటాయి. అభయారణ్యంలో పులి, చిరుత, గోల్డెన్ లాంగూర్, చ్రుత పిల్లి, గౌర్, పొర్క్యూపైన్, పంగోలైన్, ఎగిరే ఉడుత, సివెట్ పిల్లి మొదలైన క్షీరదాలు ఉన్నాయి. చర్కశలా అభయారణ్యంలో పలు రకాల వైవిధ్యమైన వృక్షజాతులు ఉన్నాయి.

అభయారణ్యంలో అంతర్జాతీయంగా గుర్తించబడిన ధీర్, దీప్లై అనే చిత్తడిభూములు ఉన్నాయి. ఇవి అభయారణ్యంలో అంతభాగంగా లేనప్పటికీ చర్కశిలా అభయారణ్యం పర్యావరణంలో భాగం వహిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని అభయారణ్యంలో చేర్చగలరని భావిస్తున్నారు.

విద్య

[మార్చు]
Bhola Nath College at Dhubri

ప్రస్తుతం జిల్లాలో ఉన్నతవిద్య కొరకు 15 కళాశాలలు ఉన్నాయి. 1946లో బి.ఎన్. కాలేజ్, ధుబ్రి స్థాపించబడింది. ఇది అస్సాంలోని అతిపురాతన, ప్రబలవిద్యాసంస్థగా గుర్తించబడుతుంది. బిలాసిపరా పట్టణంలో స్థాపించబడిన " బిలాసిపరా కాలేజి " బి.ఎ. బి.ఎస్.సీ. డిగ్రీలతో హెచ్.ఎస్.ఎస్.ఎల్.సీ సైన్సు, ఆర్ట్స్ సర్టిఫికేట్లను అందిస్తుంది. చాపర్ (ధుబ్రీ) లో స్థాపించబడిన " రత్నపీఠ్ కాలేజి " జిల్లాలోని ప్రబల విద్యాసంస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ది గవర్నమెంట్ బాయిస్ హైయ్యర్ సెకండరీ స్కూల్, గరల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ ధుబ్రీ పట్టణంలోని ప్రముఖ, పురాతన పాఠశాలలుగా గుర్తించబడుతున్నాయి. సి.బి.ఎస్.సీ సిలబస్‌తో పాఠాలను బోధిస్తున్న " హ్యాపీ కాన్వెంటు స్కూల్ ఉన్నతస్థాయి పాఠశాలగా గుర్తించబడుతుంది.జిల్లాలో ఒక " ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్ ", 30 ప్రైవేట్ యాజమాన్య కంప్యూటర్ విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లాలో 100 కంటే అధికంగా హై, హయ్యర్ సైఅండరీ స్కూల్స్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  3. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Assam: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1116. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Zemlya Georga 2,821km2
  5. "Economy". Dhubri. Retrieved 2013-01-01.
  6. "List of Assembly Constituencies showing their Revenue & Election District wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  7. "List of Assembly Constituencies showing their Parliamentary Constituencies wise break - up" (PDF). Chief Electoral Officer, Assam website. Archived from the original (PDF) on 22 మార్చి 2012. Retrieved 26 September 2011.
  8. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lesotho 1,924,886 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. West Virginia 1,852,994
  10. Indian Census
  11. Asharikandi: Famous for Terracota
  12. "Panbari Mosque at Dhubri". Archived from the original on 2012-02-08. Retrieved 2014-09-25. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలిలింకులు

[మార్చు]

26°02′00″N 89°58′00″E / 26.0333°N 89.9667°E / 26.0333; 89.9667