Jump to content

దుద్వా జాతీయ ఉద్యానవనం

అక్షాంశ రేఖాంశాలు: 28°30.5′N 80°40.8′E / 28.5083°N 80.6800°E / 28.5083; 80.6800
వికీపీడియా నుండి
దుద్వా జాతీయ ఉద్యానవనం
దుద్వా పులుల సంరక్షణ కేంద్రం
Forest in Dudhwa National Park
Map showing the location of దుద్వా జాతీయ ఉద్యానవనం
Map showing the location of దుద్వా జాతీయ ఉద్యానవనం
Locationలక్మి పూర్ ఖేర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
Nearest cityపాలియా కలన్
9 కిలోమీటర్లు (5.6 మై.) E
Coordinates28°30.5′N 80°40.8′E / 28.5083°N 80.6800°E / 28.5083; 80.6800
Area490.3
Established1977

దుద్వా జాతీయ ఉద్యానవనం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్మి పూర్ ఖేర్ అనే ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం 490.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం 1879లో దుధ్వా పులుల రిజర్వ్ గా ఏర్పరిచారు. ఆ తరువాత 1958లో ఈ ప్రాంతంలో ఉన్న చిత్తడి జింకల కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చేశారు.ఇలా 1977లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా గుర్తించబడింది. ఈ ఉద్యానవనాన్ని 1987లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు, ‘ప్రాజెక్ట్ టైగర్’ పరిధిలోకి తీసుకువచ్చారు.[2]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవనం యొక్క ప్రాంతం ఎగువ గంగా మైదానం పరిధిలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సాల్ అడవులు ఎల్లప్పుడూ దట్టంగా ఉంటాయి, ఉత్తర ఉష్ణమండల అర్ధ-సతత హరిత అడవి, ఉత్తర భారత తేమతో కూడిన ఆకురాల్చే అడవి, ఉష్ణమండల కాలానుగుణ చిత్తడి అటవీ, ఉత్తర ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవిగా వర్గీకరించవచ్చు. ఇందులో ఉన్న వృక్షజాలంలో సాల్, అస్నా, షిషామ్, జామున్, గులార్, సెహోర్, బహేరా వంటి జాతుల వృక్షాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో 19% పచ్చిక భూములు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో నదులు, సరస్సులు, చిత్తడి నేలలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం భారతదేశంలోని ఉన్న అత్యుత్తమ అడవులలో ఒకటి, ఇందులో ఉన్న కొన్ని చెట్లు 150 సంవత్సరాలకు పైగా, 70 అడుగుల (21 మీ) ఎత్తులో ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. Mathur, P. K. and N. Midha (2008). Mapping of National Parks and Wildlife Sanctuaries, Dudhwa Tiger Reserve Archived 2015-04-12 at the Wayback Machine. WII – NNRMS - MoEF Project, Final Technical Report. Wildlife Institute of India, Dehradun.
  2. Kumar, S. (2009). Retrieval of forest parameters from Envisat ASAR data for biomass inventory in Dudhwa National Park, U.P., India (PDF). Indian Institute of Remote Sensing and International Institute for Geo-information Science and Earth Observation.