దివ్య ప్రభ
దివ్య ప్రభ | |
---|---|
జననం | త్రిస్సూర్, కేరళ రాష్ట్రం | 1991 మే 18
జాతీయత | బారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
పురస్కారాలు | కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డు |
దివ్య ప్రభ (జననం 1991 మే 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ భాషా చిత్రాలలో నటిస్తుంది. ఆమె టేక్ ఆఫ్ (2017) [1], థమాషా (2019) [2] చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ధిచెందింది. 2015లో, ఈశ్వరన్ సాక్షియై అనే టీవీ సీరియల్‌లో తన నటనకు గాను ఆమె ఉత్తమ రెండవ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డును గెలుచుకుంది.[3] 2022లో, కార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన అరిప్పు చిత్రానికి అంతర్జాతీయ పోటీ విభాగంలో ఆమె ఉత్తమ నటిగా ఎంపికైంది.[4]
కెరీర్
[మార్చు]ఆమె 2013 చిత్రం లోక్‌పాల్ చిత్రంతో ఎండితెరపైకి అడుగుపెట్టింది.[5][6] ఆమె మొదటి తమిళ చిత్రం ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన కయల్ (2014). రాజేష్ పిళ్లై దర్శకత్వం వహించిన వేట్టా (2016) చిత్రంలో ఆమె క్యారెక్టర్ రోల్ పోషించింది. టేకాఫ్ (2017) లో ఆమె నర్సుగా నటించింది.[7] 2018లో, ఆమె పీరియడ్ ఫిల్మ్ కమ్మర సంభవం, స్పోర్ట్స్ థ్రిల్లర్ నాన్సెన్స్‌లో సహాయ పాత్రలు పోషించింది. 2019లో, రోషన్ మాథ్యూ దర్శకత్వం వహించిన ఎ వెరీ నార్మల్ ఫ్యామిలీ అనే థియేటర్ ప్లేలో ఆమె నటించింది.[8] ఆ తర్వాత థమాషా సినిమాలో నటించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Nair, Vidya (27 April 2017). "The Best 'Take Off'". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 8 July 2021.
- ↑ 2.0 2.1 Mythily Ramachandran (26 June 2019). "'Thamaasha' stars on bringing unlikely heroes into the spotlight". Gulf News. Retrieved 29 June 2019.
- ↑ "'Eswaran Sakshiyayi' wins five State Awards". The Times of India. 2016-06-11. ISSN 0971-8257. Retrieved 2023-07-20.
- ↑ "Kunchacko Boban, Mahesh Narayanan on Locarno Competition Title 'Ariyippu' (EXCLUSIVE)". 3 August 2022.
- ↑ Sandy (18 October 2019). "Divya Prabha – Malayalam film and television actress". My Words & Thoughts (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 July 2021.
- ↑ Sajin Shrijith (11 June 2019). "Rehearsals are so comforting: 'Thamaasha' actor Divyaprabha". The New Indian Express. Retrieved 29 June 2019.
- ↑ Nair, Vidya (27 April 2017). "The Best 'Take Off'". Deccan Chronicle. Retrieved 10 June 2017.
- ↑ Cris (4 February 2019). "'A Very Normal Family' at Mathrubhumi Lit Fest: Meet the fun cast and crew". The News Minute. Retrieved 29 June 2019.