దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ
దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ | |
---|---|
Coordinates: 20°25′N 72°50′E / 20.42°N 72.83°E | |
దేశం | భారతదేశం |
స్థాపన | 26 January 2020[1] |
రాజధాని | డామన్[2] |
Government | |
• Body | యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యూ |
• లెఫ్టినెంట్ గవర్నర్ | ప్రఫుల్ ఖోడా పటేల్[3] |
• పార్లమెంటు సభ్యుడు | లోక్‌సభ (2) |
• ఉన్నత న్యాయస్థానం | ముంబాయి ఉన్నత న్యాయ స్థానం |
విస్తీర్ణం | |
• Total | 603 కి.మీ2 (233 చ. మై) |
• Rank | 33 వ ర్యాంకు (విస్తీర్ణం ప్రకారం) |
జనాభా (2011) | |
• Total | 5,85,764 |
• జనసాంద్రత | 970/కి.మీ2 (2,500/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ |
Time zone | UTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
ISO 3166 code | IN-DH |
Vehicle registration | వాహనాల నమోదు కోడ్స్ |
జిల్లాల సంఖ్య | 3 |
దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ పశ్చిమ భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం.[5][6] గతకాలపు కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ విలీనం ద్వారా ఇది ఏర్పడినది. 2019 జూలైలో విలీన ప్రణాళిక ప్రకటించగా, చట్టానికి పార్లమెంట్ 2019 డిసెంబరులో ఆమోదం తెలిపింది. 2020 జనవరి 26న అమలులోకివచ్చింది.[7][8] ఈ ప్రాంతం భౌగోళికంగా వేరుగా వున్న నాలుగు ప్రాంతాలతో కూడివుంది. అవి దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ (ద్వీపం). 1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇవి పోర్చుగీస్ వలసరాజ్యాలుగా ఉన్నాయి. 1961లో ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.
దీని మొత్తం వైశాల్యం 603 చ. కి. మీ. నగర్-హవేలీ అనేది మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కి.మీ. ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో దాద్రా అనే ప్రాంతముంది. డామన్ గంగా నది ముఖద్వారాన ఉంది. గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలో కథియవార్ దగ్గర ఉన్న ఒక ద్వీపం పేరు డయ్యూ.
చరిత్ర
[మార్చు]ఇంగ్లీషువారితోను, మొగలు చక్రవర్తులతోను తమకున్న వైరం, తరచు జరిగే తగవుల కారణంగా మరాఠా పేష్వాలు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు.అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.
1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉంది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు.1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతీ, నగరు హవేలీ జిల్లా పంచాయతీ, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
పోర్చుగీసుల పాలనకు ముందు
[మార్చు]రాజపుత్ర రాజులు కొహ్లి సామంతరాజుల మీద యుద్ధం చేసి వారిని ఓడించడంతో మొదటి సారిగా దాద్రానాగర్ హైవేలీ చరిత్ర మొదలైంది. 18వ శతాబ్దంలో మరాఠీ రాజులు రాజపుత్ర రాజుల నుండి ఈ ప్రాంతం తిరిగి స్వాధీనపరచుకుంది. 1779 లో మరాఠీ పీష్వా పోర్చుగీసు వారితో సంబధబాంధవ్యాలు ఏర్పరచుకుని దాద్రానాగర్ హవేలీ లోని 79 గ్రామాల మీద పన్ను వసూలు చేసే అధికారం సంపాదించారు. స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈప్రాంతం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంది.1954 ఆగస్టు 2 న ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం లభించింది. 1961లో ఈ ప్రాంతం భారతదేశంతో విలీనమైంది.[9]
పోర్చుగీసు శకం
[మార్చు]1783 జూన్ 10 న నాగర్ హవేలీని పోర్చుగీసు ఆక్రమించుకుంది.[10] తరువాత 1785లో పోర్చుగీసు దాద్రాను కొనుగోలు చేసింది.పోర్చుగీసు పాలనలో దాద్రా, హవేలీ " ఎస్టాటో డా ఇండియా " (పోర్చుగీసు ఇండియా) లోని " డిస్ట్రిటో డీ డమావో " (ఇండియన్ డామన్ జిల్లా) లో ఒక భాగంగా ఉండేది. రెండు ప్రాంతాలు కలిసి " నాగర్ హవేలీ " అనే పేరుతో ఒకే కాంచెల్హో (పురపాలకం) గా ఉండేది. 1885 వరకు నాగర్ హవేలీ పురపాలకానికి " దరారా" కేంద్రంగా ఉంటూ వచ్చింది, తరువాత " సివస్సాకు " మారింది. ప్రాంతీయ పాలనా వ్యవహారాలను ప్రజలచేత ఎన్నుకొనబడిన " కమారా మునిసిపల్" (మునిసిపల్ కౌన్సిల్) నిర్వహణలో జరుగుతూ ఉన్నప్పటికీ అతిముఖ్యమైన వ్యవహారాలను డామన్ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉండేది. 1954 వరకు పోర్చుగీసు పాలన కొనసాగిన తరువాత ఈ ప్రాంతం భారతప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురాబడింది.
పోర్చుగీసు పాలన ముగింపు
[మార్చు]1947లో భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత 1954లో దాద్రా నాగర్ హవేలీ నివాసులు యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ది నేషనల్ మూవ్మెంట్ ఆఫ్ లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆచార్ గోమంతక్ దళ్ వంటి అర్గనైజేషన్ల సహకారంతో " పోర్చుగీసు ఇండియా " నుండి స్వాతంత్ర్యం సంపాదించారు.[11]
ఇండియాలో విలీనం
[మార్చు]" డీ ఫాక్టో " నుండి స్వతంత్రం పొందిన తరువాత కూడా దాద్రా నాగర్ హవేలీ ఇప్పటికీ పోర్చుగీసు ప్రాంతంగానే పరిగణించబడుతుంది.[12] పాతకాలనీ నివాసులు భారతప్రభుత్వాన్ని పాలనాపరమైన సహాయం కొరకు అభ్యర్థించారు. భారతప్రభుత్వం " కె.జి బదలానీ" (ఐ.ఎ.ఎస్ అధికారి) ని ఈ ప్రాంతానికి నిర్వాహకునిగా పంపింది.
1954 నుండి 1961 వరకు దాద్రా నాగర్ హవేలీ " వరిష్ట పంచాయితీ " ఈ ప్రాంత పాలనా నిర్వహణా బాధ్యతను వహించింది.[13][14]1961లో దాద్రా నాగర్ హవేలీని భారతదేశంలో విలీనం చేసారు. 1974 డిసెంబరు 31 న డామన్, డయ్యు, గోవా, దాద్రా నాగర్ హవేలీ ప్రాంతాలపై భారతప్రభుత్వ సాధికారాన్ని అంగీకరిస్తూ పోర్చుగీసు ఒప్పందం మీద సంతకం చేసింది.[15]
భౌగోళికం
[మార్చు]దాద్రా నాగర్ హవేలీ వైశాల్యం 491 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో మహారాష్ట్రా ఉన్నాయి.ఈ కేంద్రపాలిత ప్రాతం భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజించింది. జిల్లా వైశాల్యం 491 చ .కి. మీ ఉంటుంది.[16] ఈ జిల్లా ఫిలిప్పైన్‌లోని " బిలిరాన్ ద్వీపం" వైశాల్యానికి సమానం.[17] భారతీయ కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రాలలో 32వ స్థానంలో ఉంది.[18] ఈ భూభాగం పడమటి సరిహద్దులో గుజరాత్ లోని వల్సాడ్ జిల్లా, ఉత్తర, తూర్పు సరిహద్దులో మహారాష్ట్రా లోని తానా జిల్లా ఉంది.[19]
భూమి వర్ణన
[మార్చు]జిల్లా దక్షిణ భూభాగం పర్వతాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. వాయవ్యభాగంలో సహ్యాద్రి పర్వతాలు (పడమటి కనుమలు), మద్యలో అల్యూవియల్ (సారవంతమైన) మైదానం వ్యవసాయానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంది. పడమటి సముద్రతీరానికి 64 కి.మీ దూరం నుండి ప్రవహిస్తున్న దామన్ గంగానది దాద్రా నాగర్ హవేలీ గుండా ప్రవహించి దామన్, డయ్యూ వద్ద అరేబియా సముద్రంలో సంగమిఅంతేకాక మొత్తం భూభాగంలో స్తుంది. ఈ నదికి విజ్, వర్న, పిప్రి, సకర్తాండ్ అనే ఉపనదులు ఈ ప్రాంతంలో డామన్ గంగా నదితో సంగమిస్తూ ఉన్నాయి.[20][21]
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]దాద్రా నగరు హవేలీ జిల్లాలో 43% అరణ్యాలతో నిండి ఉంటుంది. మొత్తం భూభాగంలో 40% భూభాగం కొహిస్ అభయారణ్యం ఉంది. సంరక్షితారణ్యం 2.45% ఉంది.2008 ఉపగ్రహ సమాచారం అనుసరించి ఈ ప్రాంతం వైశాల్యం 114 చ.కి.మీ. ఇందులో 94 చ.కి.మీ దట్టమైన అరణ్యం ఆక్రమించుకుని ఉంది. అరణ్యాలలో ఖైర్, టేకు ప్రధాన ఉత్పత్తిగా ఉన్నాయి. ఖాహిర్, మహార, సిసం వృక్షాలు అధికంగా ఉన్నాయి.[21]
ఈ వృక్షజాతులు దాదాపు 27 చ.కి.మీ ఉంది. అంతేకాక మొత్తం భూభాగంలో 5% ఉన్నాయి.[22] వృక్షసంపన్నమై అనుకూల వాతావరణం ఉన్నందున ఈ ప్రాంతలో వివిధ పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. ఇక్కడ ఎకోపర్యాటకం పేరుతో పర్యటనలకు వసతి కల్పిస్తున్నారు. " సిల్వస్స, బఫర్ లాండ్ " ఔత్సాహిక వన్యమృగ పరిశీలనకు ఆస్కారం కలిగిస్తుంది.
వాతావరణం
[మార్చు]దాద్రా నగరు హవేలీలో వాతావరణం ఉష్ణమండల సముద్రతీరం వాతావరణం ఉంటుంది. తూర్పు భూభాగంలో నివాసాలు తక్కువగా ఉన్నాయి. వేసవి కాలం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వేసవి చివరిలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో మే మాసంలో ఉష్ణోగ్రతలు 39° వరకు ఉంటుంది. జూన్ మాసంలో ఆరంభమయ్యే వర్షాలు సెటెంబర్ వరకు కొనసాగుతుంటాయి. నైరుతి ఋతుపవనాల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. పడమటి భారతదేశభూభాగంలో అధికభాగం ఉన్న చిరపుంజిలో వర్షపాతం 200-250 మి.మీ ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 14° నుండి 30° ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతుంటాయి.[23][24]
మీడియా సమాచారం
[మార్చు]ప్రింట్ మీడియా
[మార్చు]గుజరాతీ
[మార్చు]- గుజరాత్ డైలీ
- గుజరాత్ మిత్రా
- దివ్య భాస్కర్
- అకిలా డైలీ
- సందేశ్ (వార్తాపత్రిక)
- సిల్వాస్సా టైమ్స్
ఆంగ్లం
[మార్చు]- భారతదేశ టైమ్స్
- హిందూస్తాన్ టైమ్స్
- ది హిందూ మతం
- వ్యాపారం లైన్
- ఎకనామిక్ టైమ్స్
- ఇండియన్ ఎక్స్‌ప్రెస్
- సిల్వాస్సా టైమ్స్
హిందీ
[మార్చు]- భూభాగం టైమ్స్
- సవేరా భారతదేశం
- నవ భారత్
- జన్సత్తా
- ప్రతాహ్ వార్తా
- సిల్వాస్సా టైమ్స్
టెలికమ్యూనికేషన్స్
[మార్చు]- భారతి ఎయిర్టెల్ , ఎయిర్సెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, రిలయన్స్ మొబైల్, డొకొమో, వోడాఫోన్ మొదలైనవి
- శాటిలైట్ టెలివిజన్':
- ఎయిర్టెల్ డిజిటల్ టి.వి, డిష్ టి.వి, రిలయన్స్ డిజిటల్ టి.వి, టాటా స్కై.
- 'రేడియో'
- ఆల్ భారతదేశం రేడియో, ఎఫ్.ఎం. ప్రసారం.
పాలనానిర్వహణ
[మార్చు]కేంద్రపాలిత ప్రాంతం పాలనా నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహిస్తాడు.188 చ.కి.మీ వైశాల్యం ఉన్న కేంద్రపాలితంలో రెండు తాలూకాలు ఉన్నాయి.
- దాద్రా
- నగర్ హవేలీ
దాద్రా తాలూకా ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం, 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.[25]
వ్యవసాయం
[మార్చు]దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట వరి (40%). చిరుధాన్యాలు రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి, వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి, వంకాయలు వంటి కూరగాయలు, మామిడి, చిక్కో, జామ, కొబ్బరి, అరటి వంటి పండ్లను పండిస్తున్నారు.[26] వ్యవసాయరంగం జిల్లా ఆర్థికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు కూడా వనాల అభివృద్ధి, జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే.[26] పూర్తి స్థాయి వెటర్నరీ హాస్పిటల్, తొమ్మిది వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ వివిధ వ్యాధులకు వ్యాధినిరోధక టీకాలు వేయడం క్రమం తప్పకుండా జరుగుతుంది.[19]
పరిశ్రమలు
[మార్చు]దాద్రా నగరు హవేలీ జిల్లా ఇతర ఆదాయవనరులలో పరిశ్రమలకు ప్రాధాన్యత ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇచ్చారు కనుక జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. క్రమాభివృద్ధితో సంవత్సరానికి ఉపాధి కల్పనలో 5% పెరుగుదల సాధిస్తుంది
1965 నుండి ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన మొదలైంది. మొదటి పారిశ్రామిక యూనిట్ పిపారియా, సిల్వస్సా లలో " దన్ ఉద్యోగ్ సహకారి సంఘం " అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. దానిని అనుసరించి 1978లో మసాలి, 1982లో ఖడోలీ,1985లో సిల్వస్సాల వద్ద మరొక 3 పరిశ్రమలు స్థాపినబడ్డాయి. 1865కు ముందు సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు, ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, అద్దకం, ప్రింటింగ్ యూనిట్లు 1970 వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.
1971 భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. 1988 సెప్టెంబరు 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. 1984 నుండి 1998 వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన 2005లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.[27] జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.[19] జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు 2118, మద్య తరహా పరిశ్రమలు 564, బృహత్తర పరిశ్రమలు 28 ఉన్నాయి.
2011 జనాభా గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 342,853 [28] |
ఇది దాదాపు | బెలెజె దేశజనసంఖ్యకు సమానం[29] |
అమెరికాలోని జనసంఖ్యకు | |
640 భారతదేశ జిల్లాలలో | 566 వ |
1చ.కి.మీ జనసాంద్రత | 698 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 55.5% [28] |
స్త్రీ పురుష నిష్పత్తి | 775: 1000 |
జాతియ సరాసరి (928) కంటే | అల్పం |
అక్షరాస్యత శాతం | 77.65 |
జాతియ సరాసరి (72%) కంటే [28] | అధికం |
గిరిజనులు
[మార్చు]దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనుల శాతం 62%. వీరిలో ధోడియా ప్రజలు 16.90%, కొక్న ప్రజలు ప్రజలు 16.85%, వర్లి ప్రజలు 62.94% ఉన్నారు. చిన్న,చిన్న బృందాలుగా కోలి, కథోడీ, నైక, డుబ్ల జిల్లా అంతటా చెదురుమదురుగా ఉన్న ప్రజలందరి శాతం 3.31% ఉన్నారు. డోడియాలు, డూబుల్ ప్రజలు జిల్లాలోని ఉత్తరప్రాంతంలో ఉన్నారు. కోక్నాలు, వర్లీలు ప్రాంతమంతా ఉన్నారు. వారి ప్రధానదైవం డీస్ (సూర్యుడు), చంద్ (చంద్రుడు), నరందేవ్, కనాసరి, హిమై, వీర్, రంగ్తై, వగ్దేవ్.
భాషలు
[మార్చు]దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనేతర ప్రజలు దేసమంతటి నుండి వచ్చి స్థిరపడిన వారు కావడం విశేషం. ఈ ప్రాంతంలో గుజరాతీ ప్రజలకు ప్రత్యేక ప్రభావం ఉంది. అందువలన ఇక్కడ ఉన్న 3 అధికార భాషలలో గుజరాతీ కావడం విశేషం. మీగిలిన రెండు అధికారభాషలు ఆంగ్లం, హిందీ. అంతేకాక మరాఠీ, రాజస్థానీ, బీహారీ, తమిళ, ఉత్తరప్రదేశ ప్రజలు కూడా ఉన్నారు. ఇది పారిశ్రామిక కేంద్రంగా ఉండడమే ఇంతటి విభిన్నతకు కారణం. సుందర ప్రకృతి, ఉద్యోగావకాశాలు, మంచి వాతావరణం విభిన్న ప్రజలను నగరం వైపు ఆకర్షిస్తుంది.
2001 గణాంకాలు
[మార్చు]2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 137,225. వీరిలో 2.8% (3,796) క్రైస్తవులు ఉండగా మిగిలిన వారు హిందువులే.[30] 2001 లో కొంకణలో క్రైస్తవులు అధికంగా ఉంది.6.7% జైనులు ఉన్నారు. రాజధాని సిల్వస్సాలో దిగంబర జైనులు ఆలయం నిర్మించారు. జిల్లాలోని ప్రధాన నగరాలైన దాద్రా, సిల్వస్సాలలో శ్వేతాంబర జైనులు ఆఅయాలను నిర్మించారు. సిల్వస్సాలో స్వామినారాయణ ప్రభావం అధికంగా ఉంది. వారి ఆలయం నిర్మాణదశలో ఉంది. అది ఈ ప్రాంతంలో అత్యంత ఖరీదైనది, అత్యంత విశాలమైనది ఉండగదని భావిస్తున్నారు.
భాష
[మార్చు]వరలి ప్రజలు వరలి భాషను మాట్లాడుతుంటారు. అగ్రి సంప్రదాయ ప్రజలు అగ్రి భాషను మాట్లాడుతుంటారు. ఈ భాషలకు మరాఠీ- కొంకణి లిపిని వాడుతుంటారు. రోమన్ కాథలిక్ ప్రజలు ఒకప్పటి పోర్చుగీసును పోలిన భాషను, సిల్వెస్సాను మాట్లాడుతుంటారు. మరాఠీ, కొంకణి, గుజరాతీ భాషలను అత్యధికంగా మాట్లాడుతుంటారు.[31] హిందీ, మరాఠీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.[31] వరలి, ధోడియా, కొంకణికి చెందిన వారు అత్యధికంగా ఉంది.[32]
కులాలు
[మార్చు]జిల్లాను అత్యధికంగా ఆక్రమించుకుని ఉన్న ప్రధాన కులాలకు చెందిన ప్రజలలో ముఖ్యులు రాజస్థాని, అహిర్స్, చమర్, మహార్, సంబంధిత కులాలకు చెందిన వారు ప్రాంతీయ ప్రజలలో భాగమై ఉన్నారు.[32]
వరలి
[మార్చు]మహారాష్ట్రా గుజరాత్‌లతో కలిసి ఉన్నప్పటికీ వర్లీస్ ప్రజలను దాద్రానాగర్ హవేలీ ప్రజలుగానేభావిస్తారు. ఎందుకంటే వర్లీస్ పూర్వీకం దాద్రానాగర్ హవేలి అన్నదే వాస్తవం. ఆర్యన్ జాతికి చెందని ప్రజలలో వర్లి ప్రజలు కూడా ఒకరు. ఈ కేంద్రపాలిత ప్రదేశంలో వర్లి ప్రజలు మొత్తం గిరిజన జాతికి చెందిన ప్రజలలో 62.94% ఉన్నారు. వర్లీ ప్రజలకు ఆచారాలు చాలా ముఖ్యం. వారు ప్రకృతి ఆరాధకులు. వారు ఆరాధించే 3 దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. వీరు సొరకాయ బుర్రతో చేసిన వాయిద్యాలను (గంగల్) వాయుస్తుంటారు.సాధారణంగా వర్లి ప్రజలు లోయిన్ వస్త్రంతో చేసిన చిన్న వెయిస్ట్ కోటు, టర్బన్ ధరిస్తుంటారు. స్త్రీలు మోకాళ్ళ పొడవున ఒక గజం చీరెను వెండి, వైట్ మెటల్ ఆభరణాలతో అలకరించి ధరిస్తుంటారు.[33]
డోడియా
[మార్చు]డోడియా అనే పేరు ధుండి నుండి వచ్చింది. ధుండి అంటే కప్పబడిన గుడిశ అని అర్ధం. ధోడియాలు అత్యధికంగా గుడిశవాసులు. వీరు అత్యధికంగా " దాద్రా నగరు హవేలీ " ఉత్తర భూభాగంలో ఉంది. అందరి గిరిజనులలో ధోడియాలలో అధికంగా విద్యావంతులు, వ్యవసాయదారులు ఉన్నారు. వీరిలో కొందరికి స్వంత భూములు, తమ అవసరాలకు తగినంత ఆదాయం కలిగి ఉన్నారు. పురుషులు మోకాలి వరకు ఉండే తెల్లని ధోవతి. వెయిస్ట్ షర్టు ధరిస్తుంటారు. తెల్లని లేక రంగుల టోపీలు, చెవిపోగుల చంటి ఆభరణాలు, వెండి గొలుసులు ధరిస్తుంటారు. స్త్రీలు మోకాలి పొడవైన ముదురు నీలవర్ణ చీరెలు, ఆంచల్ ధరిస్తుంటారు. మెడలో రంగురంగు పూసల మాలలు ధరిస్తుంటారు. స్త్రీలు మెడలో లోహపు రింగులు, లావైన కంటెలు ధరిస్తుంటారు.[33]
కొకన్
[మార్చు]కొకన్లకు పశ్చిమ భారతీయ కొంకణి నుండి ఈ పేరు వచ్చింది. వారికి స్వంత వ్యవసాయ భూములు ఉంటాయి. వరిలిలో నివసిస్తున్న వీరు వడ్లు, ఇతర పంటలను పండిస్తుంటారు. వారిలో ప్రభుత్వం ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తరువాత వారిలో అధికులు సాంఘిక జీవితానికి అలవాటు పడుతున్నారు. దృఢకాయులైన కొక్నాల స్త్రఉరుషులిరువురు వారి శరీరాలలో భుజాలు, మోకాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు ఉంది. వారు కోటు లేక షర్టు ధరిస్తుంటారు. స్త్రీలు గిరిజనులకే ప్రత్యేకమైన వర్ణరంజితమైన చీరెలను కొందరు మోకాళ్ళ వరకు కొందరు పూతి పొడవున ధరిస్తారు.[33]
ఖదోడియా
[మార్చు]దాద్రాలో ఖదోడీలు (మహారాష్ట్రలో ఖదోరీలు) 08%, ఉన్నారు. వీరి వృత్తి కాట్చ్యూ తయారీ. సాధారణంగా వీరు అరణ్యాలలో కొయ్య - రాక్షసిబొగ్గుతో నిర్మించిన గృహాలలో!నివసిస్తుంటారు. ప్రభుత్వం వారిజీవిత స్థాయిని పెంపొదించడానికి వారిలో సరికొత్త వృత్తులను ప్రవేశపెట్టింది. వారిలో స్త్రీలు మితమైన ఆభరణాలు ధరిస్తుంటాయి.[33]
విద్య
[మార్చు]- ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్, తోకర్ఖడ
- ప్రభాత్ పండితులు అకాడమీ
- సెయింట్ జార్జ్ ఇంగ్లీష్ స్కూల్, సిల్వాస్సా
- తండ్రి ఆగ్నెలో ఇంగ్లీష్ హై స్కూల్
- జవహర్ నవోదయ
- లయన్స్ ఇంగ్లీష్ స్కూల్
- కేంద్రీయ విద్యాలయ
- అలోక్ పబ్లిక్ స్కూల్
- సెయింట్ జేవియర్స్ స్కూల్
- కంప్యూటర్ శిక్షణ సంస్థలు
- డైమండ్ కంప్యూటర్లు, కిలావ్ని నాకా, సిల్వాస్సా
దాద్రా నాగర్ హవేలి లో ప్రసిద్ధ కళాశాలలు
[మార్చు]- సైన్సు, కామర్స్, ఆర్ట్స్ * ఎస్ఎస్ఆర్ కళాశాల
- డాక్టర్ బిబిఎ ప్రభుత్వ పాలిటెక్నిక్, కరాడ్
- ప్రముఖ్ స్వామి ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్వామినారాయణ్ సాంస్కృతిక సముదాయం
మూలాలు
[మార్చు]- ↑ "Data" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 19 డిసెంబరు 2019. Retrieved 9 June 2020.
- ↑ "Daman to be Dadra & Nagar Haveli, Daman & Diu UTs capital". 23 January 2020.
- ↑ "Tweet". Retrieved 9 June 2020 – via Twitter.మూస:Primary source inline
- ↑ "New vehicle registration mark DD for Dadra & Nagar Haveli and Daman and Diu". Deccan Herald. 23 January 2020. Retrieved 31 January 2020.
- ↑ Dutta, Amrita Nayak (10 July 2019). "There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu". Retrieved 31 January 2020.
- ↑ "Data" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 9 డిసెంబరు 2019. Retrieved 9 June 2020.
- ↑ "Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli".
- ↑ "Data" (PDF). 164.100.47.4. Retrieved 9 June 2020.
- ↑ "History & Geography of Dadra & Nagar Haveli". Retrieved 25 February 2012.
- ↑ NAIR, RAJESHWARY (1 October 2011). "STUDY OF ETHNOBOTANICAL PLANTS OF DADRA AND NAGAR HAVELI AND THEIR SIGNIFICANCE TO THE TRIBES" (PDF). Life sciences Leaflets: 7. ISSN 0976-1098. Archived from the original (PDF) on 3 డిసెంబరు 2013. Retrieved 25 February 2012.
- ↑ P S Lele, Dadra and Nagar Haveli: past and present, published by Usha P. Lele, 1987,
- ↑ "Case cing Right of Passage over Indian Territory (Merits), Judgement of 12 April 1960" (PDF). International Court of Justice Reports 1960: 6. Archived from the original (PDF) on 20 డిసెంబరు 2011. Retrieved 2011-04-01.
{{cite journal}}
: More than one of|accessdate=
and|access-date=
specified (help); More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Constitution of India, 10th Amendment
- ↑ Umaji Keshao Meshram & Ors v. Radhikabhai w/o Anandrao Banapurkar AIR 1986 SC 1272: this judgment mentions the Administration of Dadra and Nagar Haveli in this period
- ↑ TREATY BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE GOVERNMENT OF THE REPUBLIC OF PORTUGAL ON RECOGNITION OF INDIA'S SOVEREIGNTY OVER GOA, DAMAN, DIU, DADRA AND NAGAR HAVELI AND RELATED MATTERS 1974
- ↑ Srivastava, Dayawanti, ed. (2010). "States and Union Territories: Dadra and Nagar Haveli". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1213. ISBN 978-81-230-1617-7.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Biliran Island 501km2
- ↑ "India.gov Site Map". Retrieved 15 June 2012.
- ↑ 19.0 19.1 19.2 Singh, A.K. (2008). Socio Economic Development of Dadra and Nagar Haveli since its Liberation. 24.
- ↑ "Dadra and Nagar Haveli – Land, Climate and transport". Retrieved 2012-06-12.
- ↑ 21.0 21.1 "Tourism Perspective Plan for Dadra & Nagar Haveli" (PDF). Government of India. 2002.
- ↑ "Forest and Tree Resources in States and Union Territories" (PDF). Forest Survey of India. 2011. pp. 255–257.
- ↑ "Hotels Silvassa summary sections". Archived from the original on 14 జూన్ 2012. Retrieved 12 June 2012.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:". tourism. Archived from the original on 26 జూన్ 2012. Retrieved 13 June 2012.
- ↑ "Dadra and Nagar Haveli". Government of D&NH. Administration of D&NH. Archived from the original on 18 నవంబరు 2012. Retrieved 19 November 2012.
- ↑ 26.0 26.1 "Agriculture Department" (PDF). Government of Dadra and Nagar Haveli. UT of Dadra and Nagar Haveli. Archived from the original (PDF) on 13 ఏప్రిల్ 2012. Retrieved 27 November 2012.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;dnh_ind
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 28.0 28.1 28.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.[permanent dead link]
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "PRIMARY CENSUS ABSTRACT INDICATORS SEARCH UPTO TOWN / VILLAGE LEVEL". Census 2001. Government of India. Retrieved 19 November 2012.
- ↑ 31.0 31.1 https://web.archive.org/web/20060616040015/http://dnh.nic.in/Home Page_files/Tourism/silvassa.pdf
- ↑ 32.0 32.1 http://www.krepublishers.com/02-Journals/T-Anth/Anth-11-0-000-09-Web/Anth-11-1-001-09-Abst-PDF/Anth-11-1-065-09-521-Meitei-S-Y/Anth-11-1-065-09-521-Meitei-S-Y-Tt.pdf
- ↑ 33.0 33.1 33.2 33.3 Tribes of Silvassa (PDF). Silvassa: Department of Tourism, UT of D&NH. pp. 1–7. Archived from the original (PDF) on 2015-10-19. Retrieved 2014-04-30.
{{cite book}}
: More than one of|accessdate=
and|access-date=
specified (help); More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)