Jump to content

దక్షిణాసియా

వికీపీడియా నుండి
దక్షిణాసియా
వైశాల్యం5,134,641 కి.మీ2 (1,982,496 చ. మై.)
జనాభా1,814,014,121 (2018) (1st)[1][2]
జనసాంద్రత362.3/చ.కి. (938/చ.మై.)
GDP (nominal)$3.461 trillion (2018)[3]
GDP (PPP)$12.752 trillion (2018)[3]
GDP per capita$1,908 (nominal)[3]
$7,029 (PPP)[3]
HDIIncrease0.642 (medium)[4]
నివసించేవారుSouth Asian
Desi (colloquial)
దేశాలు
ఆధారపడేవారు
ఇంటర్‌నెట్ టాప్ లెవెల్ డొమైన్.af, .bd, .bt, .in,
.lk, .mv, .np, .pk
పెద్ద నగరాలు[note 1]

ఆసియా ఖండంలో దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని దక్షిణాసియా అంటారు.ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు దేశాలు దక్షిణాసియా పరిధిలోకి వస్తాయి [5][note 2] ఈ 8 దేశాలు తమ మధ్య ఆర్థిక స్నేహ సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) అనే మండలిని ఏర్పరుచుకున్నాయి. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది

దక్షిణాసియా విస్తీర్ణం 52 లక్షల చ.కి.మీ. ఇది ఆసియా ఖండంలో 11.71%. ప్రపంచ భూ ఉపరితల వైశాల్యంలో 3.5%.[7]దక్షిణాసియా జనాభా 189.1 కోట్లు. ఇది ప్రపంచ జనాభాలో నాలుగవ వంతు. ప్రపంచంలో అత్యధిక జనాభా, అత్యధిక జనసాంద్రత కలిగిన భౌగోళిక ప్రాంతం.[8] మొత్తమ్మీద, ఇది ఆసియా జనాభాలో సుమారు 39.49%, ప్రపంచ జనాభాలో 24% కంటే ఎక్కువ.[9][10][11]

2010 నాటి లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, జొరాస్ట్రియన్లు దక్షిణాసియా లోనే ఉన్నారు . [12] ప్రపంచ హిందువుల జనాభాలో 98.47%, ప్రపంచ సిక్కులలో 90.5%, ప్రపంచ ముస్లింలలో 31%, 3.5 కోట్ల క్రైస్తవులు, 2.5 కోట్ల బౌద్ధులూ దక్షిణాసియాలో ఉన్నారు. [13][14][15][16]

భూమి, నీటి విస్తీర్ణం

[మార్చు]

ఈ జాబితాలో ఆయా దేశాల సార్వభౌమత్వం కింద ఉన్న ప్రాంతాలన్నీ ఉన్నాయి. అంటార్కిటికా లోని ప్రాంతాలు ఇందులో భాగం కాదు. EEZ TIA అనేది తనకే స్వంతమైన ఆర్థిక మండలం (EEZ), మొత్తం అంతర్గత ప్రాంతం (TIA). ఇందులో భూ విస్తీర్ణం, దాని లోని అంతర్గత జలాలూ కలిసి ఉన్నాయి.

ర్యాంకు దేశం విస్తీర్ణం (చ.కి.మీ) స్వంత ఆర్థిక

మండలం

షెల్ఫ్

(చ.కి.మీ)

స్వంత ఆర్థిక మండలం

అంతర్గత విస్తీర్ణం (చ.కి.మీ)

1  భారతదేశం 32,87,263 23,05,143 4,02,996 55,92,406
2  పాకిస్తాన్ 8,81,913 2,90,000 51,383 11,17,911
3  Afghanistan 6,52,864 0 0 6,52,864
4  Bangladesh 1,47,570 86,392 66,438 2,30,390
5  Nepal 1,47,181 0 0 1,47,181
6  Sri Lanka 65,610 5,32,619 32,453 5,98,229
7  Bhutan 38,394 0 0 38,394
8  Maldives 298 9,23,322 34,538 9,23,622
మొత్తం 52,21,093 41,37,476 5,87,808 93,00,997

సమాజం

[మార్చు]

భాషలు

[మార్చు]
దక్షిణ[permanent dead link] ఆసియా జాతి-భాషా విస్తరణ పటం

దక్షిణాసియాలో అనేక భాషలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాట్లాడే భాషలు ఎక్కువగా భౌగోళిక స్థానాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి మతాతీతంగా ఉంటాయి. కాని లిపి మాత్రం మతపరమైన విభజనలకు లోబడి ఉంటుంది.. ముఖ్యంగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి దక్షిణాసియాలోని ముస్లింలు అరబిక్ వర్ణమాలను, పెర్షియన్ నాస్తలీఖ్ను ఉపయోగిస్తారు. 1952 వరకు, ముస్లిం-మెజారిటీ బంగ్లాదేశ్ (అప్పటికి తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు) కూడా నస్తలీఖ్ లిపిని తప్పనిసరి చేసింది. కాని ఆ తరువాత, అప్పటి తూర్పు పాకిస్తాన్ అధికారిక భాషగా బెంగాలీని స్వీకరించాలని కోరుతూ జరిగిన భాషా ఉద్యమం తరువాత బెంగాలీని స్వీకరించింది. దక్షిణాసియాలోని ముస్లిమేతరులు, భారతదేశంలోని కొంతమంది ముస్లింలు తమ సాంప్రదాయ పురాతన వారసత్వ లిపిలను వాడుతారు. ఇండో-యూరోపియన్ భాషలకైతే బ్రాహ్మి లిపి నుండి వచ్చినవాటిని, ద్రావిడ భాషలకు ఇతరులకూ అయితే బ్రాహ్మియేతర లిపిలనూ ఉపయోగిస్తున్నారు . [17]

సాంప్రదాయికంగా నాగరి దక్షిణాసియాలో ప్రధానమైన లిపి. [18] దేవనాగరి లిపి 120 కి పైగా దక్షిణాసియా భాషలకు ఉపయోగిస్తున్నారు. [19] వీటిలో హిందీ, [20] మరాఠీ, నేపాలీ, పాలి, కొంకణి, బోడో, సింధి, మైథిలి, ఇతర భాషలు, మాండలికాలూ ఉన్నాయి. ఆ విధంగా ఇది ఎక్కువగా వాడే లిపిలలో ఒకటి. [21] శాస్త్రీయ సంస్కృత గ్రంథాలకు కూడా దేవనాగరి లిపిని ఉపయోగిస్తారు. [19]

ఈ ప్రాంతంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ, తరువాత బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ ఉన్నాయి. [22] ఆధునిక యుగంలో, ఉత్తర దక్షిణాసియాలోని ముస్లిం సమాజం (ముఖ్యంగా పాకిస్తాన్, భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాలు) ఉపయోగించే ఉర్దూ వంటి కొత్త సమకాలీకరణ భాషలు అభివృద్ధి చెందాయి. [23] పంజాబీ భాషను ఇస్లాం, హిందూ, సిక్కు మతస్థులు ముగ్గురూ మాట్లాడుతారు..మాట్లాడే భాష సారూప్యంగా ఉంటుంది గానీ లిపిలు మాత్రం మూడు రకాలుగా ఉన్నాయి. సిక్కులు గుర్ముఖి వర్ణమాలను ఉపయోగిస్తారు, పాకిస్తాన్లోని ముస్లిం పంజాబీలు నస్తలీఖ్ లిపిని ఉపయోగిస్తుండగా, భారతదేశంలోని హిందూ పంజాబీలు గుర్ముఖి లేదా నాగర లిపిని ఉపయోగిస్తారు. గురుముఖి, నాగరి లిపిలు విభిన్నమైనవే గానీ నిర్మాణంలో అవి దగ్గరగా ఉంటాయి. కానీ పెర్షియన్ నస్తలీఖ్ లిపి చాలా భిన్నంగా ఉంటుంది. [24]

బ్రిటిషు ఇంగ్లీషును పట్టణ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఇది దక్షిణాసియాలోని ప్రధాన ఆర్థిక భాష . [25]

మతాలు

[మార్చు]
ప్రపంచంలోని[permanent dead link] ప్రధాన మతాల మ్యాప్

2010 నాటి లెక్కల ప్రకారం దక్షిణాసియాలో హిందువులు, జైనులు, సిక్కుల జనాభా ప్రపంచంలోనే అత్యధికం. [26] సుమారు 51 కోట్ల మంది ముస్లింలు, [27] 2.5 కోట్ల మంది బౌద్ధులు, 3.5 కోట్ల క్రైస్తవులూ ఉన్నారు. [28] 90 కోట్లతో హిందువులు, దక్షిణాసియా మొత్తం జనాభాలో 68 శాతం ఉన్నారు. [29] హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు భారతదేశం, నేపాల్, శ్రీలంక, భూటాన్లలో కేంద్రీకృతమై ఉండగా, ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ (99%), బంగ్లాదేశ్ (90%), పాకిస్తాన్ (96%), మాల్దీవుల్లో (100%) ఎక్కువ శాతంలో ఉన్నారు. [30]

భారతదేశంలో ఉద్భవించిన మతాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధమతం, సిక్కు మతం. ఇవి భారతీయ మతాలు [31] భారతీయ మతాలు విభిన్నమైనవి, అయితే పరిభాష, భావనలు, లక్ష్యాలు, ఆలోచనల్లో సారూప్యత ఉంటుంది. ఈ మతాలు దక్షిణాసియా నుండి తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాల్లో వ్యాపించాయి. [31] క్రైస్తవం, ఇస్లాంలను వ్యాపారులు దక్షిణాసియాలోని తీర ప్రాంతాలలో ప్రవేశపెట్టారు. తరువాత సింధ్, బలూచిస్తాన్, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలపై అరబ్ కాలిఫేట్‌లతో పాటు పర్షియా మధ్య ఆసియా నుండి వచ్చిన ముస్లింల ప్రవాహాలు విజయం సాధించాయి. దీని ఫలితంగా షియా, సున్నీ ఇస్లాంలు రెండూ దక్షిణాసియాలోని వాయవ్య ప్రాంతాలలో వ్యాపించాయి. తదనంతరం, ఇస్లామిక్ సుల్తానేట్లు, మొఘల్ సామ్రాజ్యపు ముస్లిం పాలకుల ప్రభావంతో ఇస్లాం దక్షిణాసియాలో వ్యాపించింది. [32] [33] ప్రపంచ ముస్లింలలో మూడింట ఒకవంతు మంది దక్షిణాసియాకు చెందినవారే. [34] [35]

దేశం జాతీయ మతం మొత్తం జనాభాలో ఒక శాతం మత జనాభా
అహ్మదియ్య బౌద్ధమతం క్రైస్తవ మతం హిందూమతం ఇస్లాం మతం కిరాటిజం సిక్కుమతం ఇతరులు లెక్కించిన సంవత్సరం
ఆఫ్ఘనిస్తాన్ ఇస్లాం - - - - 99,7% - - 0.3% 2019 [36]
బంగ్లాదేశ్ ఇస్లాం 0.06% 0.6% 0.4% 9.5% 89.5% - ~ 0.0% - 2011 [37]
భూటాన్ బౌద్ధం - 74.8% 0.5% 22.6% 0.1% - - 2% 2010 [38] [39]
భారతదేశం ఏదీ లేదు - 0.7% 2.3% 79,8% 14.2% - 1.7% 1.3% 2011[40][41]
మాల్దీవులు సున్నీ ఇస్లాం - - - - 100% - - - [42][43][44]
నేపాల్ గమనిక - 9% 1.3% 81.3% 4.4% 3% - 0.8% 2013 [45]
పాకిస్థాన్ ఇస్లాం 0.22% - 1.59% 1.85% 96,28% - - 0.07% 2010 [46]
శ్రీలంక థేరవాద బౌద్ధమతం - 70,2% 6.2% 12.6% 9.7% - - 1.4% 2011 [47]


నోట్స్

[మార్చు]
  1. Among the top 100 urban areas of the world by population.
  2. Afghanistan is considered to be part of Central Asia. It regards itself as a link between Central Asia and South Asia.[6]

మూలాలు

[మార్చు]
  1. "World Population prospects – Population division". United Nations. Archived from the original on 5 ఫిబ్రవరి 2019. Retrieved 16 July 2019.
  2. "Overall total population" (xlsx). United Nations. Retrieved 16 July 2019.
  3. 3.0 3.1 3.2 3.3 "Report for Selected Countries and Subjects". imf.org. IMF. Outlook Database, October 2018
  4. "Human Development Report 2019 – "Human Development Indices and Indicators"" (PDF). HDRO (Human Development Report Office) United Nations Development Programme. pp. 22–25. Retrieved 10 December 2019.
  5. "Afghanistan". Regional and Country Profiles South Asia. Institute of Development Studies. Archived from the original on 20 May 2017. Retrieved 28 February 2019.; "Composition of macro geographical (continental) regions, geographical sub-regions, and selected economic and other groupings: Southern Asia". United Nations Statistics Division. Archived from the original on 17 April 2010. Retrieved 31 January 2016.; Arnall, A (24 September 2010). "Adaptive Social Protection: Mapping the Evidence and Policy Context in the Agriculture Sector in South Asia". Institute of Development Studies (345). Archived from the original on 15 June 2016. Retrieved 31 January 2016.; "The World Bank". Archived from the original on 10 November 2015. Retrieved 5 November 2015.; "Institute of Development Studies: Afghanistan". Archived from the original on 1 June 2017. Retrieved 28 February 2019.; "Harvard South Asia Institute: "Afghanistan"". Archived from the original on 17 November 2015. Retrieved 5 November 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help); "Afghanistan". BBC News. 2018-01-31. Archived from the original on 29 July 2018. Retrieved 21 July 2018.; "The Brookings Institution". 2001-11-30. Archived from the original on 5 September 2015. Retrieved 5 November 2015.; "South Asia". The World Factbook. Central Intelligence Agency. Archived from the original on 2 April 2015. Retrieved 4 March 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. Saez 2012, p. 35.
  7. "Afghanistan". Regional and Country Profiles South Asia. Institute of Development Studies. Archived from the original on 20 May 2017. Retrieved 28 February 2019.; "Composition of macro geographical (continental) regions, geographical sub-regions, and selected economic and other groupings: Southern Asia". United Nations Statistics Division. Archived from the original on 17 April 2010. Retrieved 31 January 2016.; Arnall, A (24 September 2010). "Adaptive Social Protection: Mapping the Evidence and Policy Context in the Agriculture Sector in South Asia". Institute of Development Studies (345). Archived from the original on 15 June 2016. Retrieved 31 January 2016.; "The World Bank". Archived from the original on 10 November 2015. Retrieved 5 November 2015.; "Institute of Development Studies: Afghanistan". Archived from the original on 1 June 2017. Retrieved 28 February 2019.; "Harvard South Asia Institute: "Afghanistan"". Archived from the original on 17 November 2015. Retrieved 5 November 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help); "Afghanistan". BBC News. 2018-01-31. Archived from the original on 29 July 2018. Retrieved 21 July 2018.; "The Brookings Institution". 2001-11-30. Archived from the original on 5 September 2015. Retrieved 5 November 2015.; "South Asia". The World Factbook. Central Intelligence Agency. Archived from the original on 2 April 2015. Retrieved 4 March 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "South Asia Regional Overview". South Asian Regional Development Gateway. Archived from the original on 21 November 2008. Retrieved 6 జూన్ 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. Desai, Praful B. 2002. Cancer control efforts in the Indian subcontinent. Japanese Journal of Clinical Oncology. 32 (Supplement 1): S13-S16. "The Indian subcontinent in South Asia occupies 2.4% of the world landmass and is home to 16.5% of the world population...."
  10. "Asia" > Overview Archived 1 మే 2011 at the Wayback Machine. Encyclopædia Britannica. Encyclopædia Britannica Online, 2009: "The Indian subcontinent is home to a vast diversity of peoples, most of whom speak languages from the Indo-Aryan subgroup of the Indo-European family."
  11. "Indian Subcontinent Archived 21 జనవరి 2012 at the Wayback Machine". Encyclopedia of Modern Asia. Macmillan Reference USA (Gale Group), 2006: "The area is divided between five major nation-states, Bangladesh, India, Nepal, Pakistan, and Sri Lanka, and includes as well the two small nations of Bhutan and the Maldives Republic... The total area can be estimated at 4.4 million square kilometres or exactly 10 percent of the land surface of Asia... In 2000, the total population was about 22 percent of the world's population and 34 percent of the population of Asia."
  12. Diplomat, Akhilesh Pillalamarri, The. "How South Asia Will Save Global Islam". The Diplomat (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-02-07.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  13. "Religion population totals in 2010 by Country". Pew Research Center. 2012. Archived from the original on 9 December 2016.
  14. Pechilis, Karen; Raj, Selva J. (2013). South Asian Religions: Tradition and Today (in ఇంగ్లీష్). Routledge. p. 193. ISBN 9780415448512.
  15. "Region: Asia-Pacific". Pew Research Center. 27 January 2011. Archived from the original on 10 October 2017. Retrieved 13 March 2016.
  16. "10 Countries With the Largest Muslim Populations, 2010 and 2050". Pew Research Center's Religion & Public Life Project. 2015-04-02. Archived from the original on 4 May 2017. Retrieved 2017-02-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  17. Braj B. Kachru; Yamuna Kachru; S. N. Sridhar (2008). Language in South Asia. Cambridge University Press. pp. 122–127, 419–423. ISBN 978-1-139-46550-2. Archived from the original on 18 January 2017. Retrieved 27 December 2016.
  18. George Cardona; Dhanesh Jain (2003). The Indo-Aryan Languages. Routledge. pp. 75–77. ISBN 978-0-415-77294-5.
  19. 19.0 19.1 Devanagari (Nagari) Archived 2 జూలై 2017 at the Wayback Machine, Script Features and Description, SIL International (2013), United States
  20. Hindi Archived 28 మే 2012 at the Wayback Machine, Omniglot Encyclopedia of Writing Systems and Languages
  21. George Cardona; Dhanesh Jain (2003). The Indo-Aryan Languages. Routledge. pp. 75–77. ISBN 978-0-415-77294-5.
  22. Braj B. Kachru; Yamuna Kachru; S. N. Sridhar (2008). Language in South Asia. Cambridge University Press. pp. 122–127, 419–423. ISBN 978-1-139-46550-2. Archived from the original on 18 January 2017. Retrieved 27 December 2016.
  23. Shamsur Rahman Faruqi (2008), Urdu Literary Culture: The Syncretic Tradition Archived 26 అక్టోబరు 2012 at the Wayback Machine, Shibli Academy, Azamgarh
  24. Peter T. Daniels; William Bright (1996). The World's Writing Systems. Oxford University Press. p. 395. ISBN 978-0-19-507993-7.
  25. Braj B. Kachru; Yamuna Kachru; S. N. Sridhar (2008). Language in South Asia. Cambridge University Press. pp. 391–394. ISBN 978-1-139-46550-2. Archived from the original on 18 January 2017. Retrieved 27 December 2016.
  26. "Region: Asia-Pacific". Pew Research Center. 27 January 2011. Archived from the original on 10 October 2017. Retrieved 13 March 2016.
  27. "Region: Asia-Pacific". Pew Research Center. 27 January 2011. Archived from the original on 10 October 2017. Retrieved 13 March 2016.
  28. "Religion population totals in 2010 by Country". Pew Research Center. 2012. Archived from the original on 9 December 2016.
  29. "Region: South Asia". 2011-01-27.
  30. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; pewforum.org అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  31. 31.0 31.1 Adams, C. J., Classification of religions: Geographical Archived 14 డిసెంబరు 2007 at the Wayback Machine, Encyclopædia Britannica, 2007. Accessed: 15 July 2010; Quote: "Indian religions, including early Buddhism, Hinduism, Jainism, and Sikhism, and sometimes also Theravāda Buddhism and the Hindu- and Buddhist-inspired religions of South and Southeast Asia".
  32. Alberts, Irving, T., . D. R. M. (2013). Intercultural Exchange in Southeast Asia: History and Society in the Early Modern World (International Library of Historical Studies). I.B. Tauris.
  33. Lisa Balabanlilar (2012). Imperial Identity in Mughal Empire: Memory and Dynastic Politics in Early Modern Central Asia. I.B. Tauris. pp. 1–2, 7–10. ISBN 978-1-84885-726-1. Archived from the original on 10 June 2016. Retrieved 27 December 2016.
  34. Pechilis, Karen; Raj, Selva J. (1 January 2013). South Asian Religions: Tradition and Today (in ఇంగ్లీష్). Routledge. ISBN 9780415448512.
  35. Diplomat, Akhilesh Pillalamarri, The. "How South Asia Will Save Global Islam". The Diplomat (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 8 February 2017. Retrieved 7 February 2017.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  36. "CIA – The World Factbook – Afghanistan". CIA. Archived from the original on 20 September 2017. Retrieved 2012-03-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  37. "Archived copy" জানুন [Bangladesh] (PDF) (in Bengali). US department of States. Retrieved 16 October 2019.
  38. "CIA – The World Factbook". CIA. Archived from the original on 28 December 2010. Retrieved 2012-03-27. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  39. Pew Research Center – Global Religious Landscape 2010 – religious composition by country Archived 13 డిసెంబరు 2016 at the Wayback Machine.
  40. "C −1 Population by religious community – 2011". Office of the Registrar General & Census Commissioner. Archived from the original on 25 ఆగస్టు 2015. Retrieved 6 జూన్ 2020.
  41. Ahmadiyyas are considered a sect of Islam in India. Other minorities are 0.4 Jains and 0.23% irreligious population.
  42. "religion". Maldives. Archived from the original on 28 September 2007. Retrieved 2010-08-23. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  43. "Maldives". Law.emory.edu. 1920-02-21. Archived from the original on 11 February 2013. Retrieved 2010-08-23.
  44. Maldives – Religion Archived 7 డిసెంబరు 2010 at the Wayback Machine, countrystudies.us
  45. Statistical Yearbook of Nepal - 2013. Kathmandu: Central Bureau of Statistics. 2013. p. 23. Archived from the original on 18 సెప్టెంబరు 2016. Retrieved 16 October 2019. {{cite book}}: More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  46. "POPULATION BY RELIGION" (PDF). Pakistan Burau of Statistics, Government of Pakistan: 1. Archived from the original (PDF) on 2018-11-14. Retrieved 2020-06-06.
  47. "Census of Population and Housing 2011". Department of Census and Statistic. Archived from the original on 6 జనవరి 2020. Retrieved 16 October 2019. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)