థేని జిల్లా
Theni district
தேனி மாவட்டம் | |
---|---|
District | |
Country | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | Theni |
Established | July 07, 1996 |
ప్రధాన కార్యాలయం | Theni |
Boroughs | Periyakulam, Theni, Andipatti, Uthamapalayam, Bodinayakanur |
Government | |
• Collector & District Magistrate | Dr K.S Palanisami IAS |
విస్తీర్ణం | |
• District | 2,889 కి.మీ2 (1,115 చ. మై) |
జనాభా (2011)[1] | |
• District | 12,43,684 |
• జనసాంద్రత | 430/కి.మీ2 (1,100/చ. మై.) |
• Metro | 5,91,841 |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC 5:30 (IST) |
పిన్‌కోడ్ | 625531 |
టెలిఫోన్ కోడ్ | 04546 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | TN-60 |
Coastline | 0 కిలోమీటర్లు (0 మై.) |
Largest city | Theni |
లింగ నిష్పత్తి | M-50.5%/F-49.5% ♂/♀ |
అక్షరాస్యత | 71.58%% |
Legislature type | elected |
Legislature Strength | 5 |
Precipitation | 833.5 మిల్లీమీటర్లు (32.81 అం.) |
Avg. summer temperature | 40.5 °C (104.9 °F) |
Avg. winter temperature | 15 °C (59 °F) |
తేని లేదా థేని జిల్లా, భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. థేని జిల్లా సుందరమైన కొండ ప్రాంతాల ద్వారా బాగా రక్షించబడిన ఈ జిల్లా మధురై జిల్లాతో పాటుగా కూడా ఉంది. థేని పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా రెండు సహజ విభాగాలుగా విభజించబడింది.కొండ ప్రాంతాలు ఐదు తాలూకాలోని తేని, బోడినాయకనూర్, పెరియకుళం, ఉత్తమపాళయం, అండిపట్టి, దట్టమైన వృక్షాలతో పశ్చిమ వైపున ఉన్న కొండల నుండి శాశ్వత ప్రవాహాలతో ఉత్తమపాళయం తాలూకాలో ఉన్న కంబం లోయతో ఏర్పడ్డాయి.[2] 2011 నాటికి, థేని జిల్లాలో 1,245,899 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 980 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.
చరిత్ర
[మార్చు]తేనిజిల్లా 1996 జూలై 7 న మదురై జిల్లా ఉత్తమపాళయం రెవెన్యూ డివిషన్‌ను జిల్లాగా రూపొందించబడింది. అలాగే తేని, బోడినాయకనూరు తాలూకాలుగా చేయబడ్డాయి. 1996 డిసెంబరు 31 వరకు పట్టణం తేని తాత్కాలిక జిల్లా కార్యాలయముగా ఉన్నప్పటికీ 1997 జనవరి 1 న తేని తాలూకాను ఉన్నతస్థితిలో జిల్లా కేంద్రంగా మారింది.[3]
తేని జిల్లాలో 1900 వరకూ మనుష్య సంచారం అరుదుగా ఉంటూ వచ్చింది. 1886లో నిర్మించబడిన ముల్లై పెరియార్ ఆనకట్ట జిల్లకు అవసరమైన జలాలను అందించింది. పెరియార్ నది కంబం లోయ నుండి భూభాగంలో ప్రవేశించి ముల్లై నదిలో సంగమిస్తుంది. ఆనకట్ట నిర్మాణం అధికసంఖ్యలో ప్రజలు కంబం లోయలో స్థిరపడడానికి దోహదం అయింది. 1900 వరకూ థేని గురించి మిగిలిన ప్రపంచానికి తెలియనప్పటికీ ముల్లై పెరియారు కలయికతో సమీపంలో ఉన్న శివకాశి, కోవిల్పట్టి, విరుదునగర్, సాత్తూరు, సమీప టౌన్లలోని మెట్టభూములు సారవంతమైన పంటభూములుగా మారాయి. భూములు సారనతం కావడంతో ప్రజలు స్థిరపడం అధికమైంది. అలా జాసందోహం అధికమైన భూభాగంలో కంబం ప్రాంతం ఒకటి. అందువలన 1880 నుండి 1990 వరకు ప్రస్తుత తేని ప్రాంతంలో కూడా ప్రజల సంఖ్య అధికమైంది. ఆ సమయంలో బోడినాయకనూరు, పెరియకుళం ప్రసిద్ధిచెందిన ప్రాంతాలుగా ఉండేవి. తరువాత పలువిధములైన వాణిజ్య కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తేని ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందింది.
భౌగోళికం
[మార్చు]తేని జిల్లా పడమటి కనుమల పాదప్రదేశంలో ఉంది. 9'38, 10' 39 అక్షాంశం ఉంది. 77'00, 78'30 రేఖాంశంలో ఉపస్థితమై ఉంది. తేని ఉత్తర సరిహద్దులలో దిండిగల్, తూర్పు సరిహద్దులో మదురై, ఆగ్నేయ సరిహద్దులో విరుదునగర్, పడమటి సరిహద్దులో కేరళ రాష్ట్రానికి చెందిన ఇడుక్కి జిల్లలు ఉన్నాయి. జిల్లాలో పెరియకుళం (తేని), బోడినాయకనూరు, కంబం, ఉత్తమపాళయం, కొంబై, గూడలూర్, చిన్నమనూరు, ఆండిపట్టి దేవారం, పొట్టిపురం, రామకృష్ణపురం, లక్ష్మీపురం, భద్రకాళీపురం, సుక్కంగ పట్టి, సదైయల్ పట్టి, మీనాక్షీపురం, మేలసిండలైచేరి, కొత్తూరు, పల్లవరాయన్ పట్టి వంటి గ్రామాలు తమిళనాడుకే ప్రత్యేకమైన జల్లికట్టుకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. జిల్లలో పలు పర్వతశ్రేణులు ఉన్నాయి. జిల్లాలో పడమటి కనులకు సమాంతరంగా పొరుగున ఉన్న కేరళ రాష్ట్రాన్ని విడదీస్తూ ఉత్తర దక్షిణాలుగా ఒక పర్వతశ్రేణి ఉంది. 2,889 కి.మీ2 (1,115 చ. మై.).[4]
వాతావరణం
[మార్చు]మైదానాలలో ఉష్ణోగ్రత 13 °-39 ° సెంటీగ్రేడ్లు, కొండ ప్రాంతాలలో 4-5°-25 ° ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనానికి జిల్లా అత్యంత ప్రసిద్ధిచెందింది.
నదులు ఆనకట్టలు
[మార్చు]జిల్లాలో వైగై నది, కొత్తగుడి నది, సురులియార్ నది, వరంగానది, మంజలారు నది, వరత్తారు నది ప్రవహిస్తున్నాయి. అంతే కాక వైగై ఆనకట్ట, సోత్తుపారై ఆనకట్ట, మనలారు ఆనకట్ట, మేల్ మనలారు ఆనకట్ట జిల్లాలోని వ్యవసాయ భూములకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తేని జిల్లాలో 1,245,899 జనాభా ఉంది. ప్రతి 1,000 మంది పురుషులకు 991 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ. జనాభాలో 53.81% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[6] మొత్తం జనాభాలో 119,661 మంది ఆరేళ్లలోపు వారు, వారిలో 61,873 మంది పురుషులు, 57,788 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 20.72% ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.15% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 69.84%, జాతీయ సగటు 72.99% కంటే తక్కువ.[6] జిల్లాలో మొత్తం 3,38,112 నివాస గృహాలు ఉన్నాయి. మొత్తం 5,91,642 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 36,371 మంది సాగుదారులు, 2,75,585 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 12,714 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడినవారు, 205,921 మంది ఇతర కార్మికులు, 61,051 మంది ఉపాంత కార్మికులు, 1,996 మంది ఉపాంత కార్మికులు, కార్మికులు 1,996 మంది ఉన్నారు.[7]
భాషలు
[మార్చు]తేని జిల్లాలో 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం భాషలు తమిళం 79.04% మంది,[8] తెలుగు 12.75% మంది, కన్నడ 7.86% మంది, ఇతర భాషలు మాట్లాడేవారు 0.35% మంది ఉన్నారు.
ఆర్ధికం
[మార్చు]తేని జిల్లా అత్యధికంగా వ్యవసాయ ఆధారిత ఆదాయం కలిగి ఉంది. జిల్లాలో పంటభూమిగా ఉపయోగపడుతున్న 40.33%.భూమిలో, 2005-2006 ముఖ్యమైన పంటలు చెరుకు 12,01,221, పత్తి 95,360 బేళ్ళు, వడ్లు 66.043 టన్నులు, చిరుధాన్యాలు 57,081 టన్నులు, పప్పుధాన్యాలు 6,677, వేరుశనగ 4,021, నువ్వులు 325 టన్నులు పండిస్తారు. [9]
పట్టు పురుగు పెంపకం, అరటి, కొబ్బరి,తేయాకు, కాఫీ, యాలకులు,ద్రాక్ష, మొక్కజొన్న మొదలైనవి జిల్లాలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తిగా ఉన్నాయి.[10] కంబంలోయలో ద్రాక్షతోటలు అధికంగా ఉన్నాయి. దాదాపు 4.000 మంది సన్నకారు రైతులు 90,000 టన్నుల మస్కట్ ద్రాక్ష (పనీర్ ద్రాక్ష), 10,000 టన్నుల సుల్తానా ద్రాక్ష (తాంసన్ సీడ్‌లెస్ ద్రాక్ష), ఉత్పత్తి చేస్తున్నారు. సామాన్యంగా వేసవిలో మాత్రమే పండించడుతున్న ద్రాక్ష ఇక్కడ సంవత్సరమంతా ద్రాక్ష పండించడం విశేషం.
జిల్లాలో కాటన్ మిల్లులు, షుగర్ మిల్లులు ప్రధాన పరిశ్రాలుగా ఉన్నాయి. అందిపట్టి తాలుకాలో చేనేత, పవర్‌లూంలు అత్యధికంగా ఉన్నాయి. ఉత్తమపాళయం తాలూకాలో హైవేవిస్ ఎస్టేట్ గుర్తించతగినంతగా టీపొడి ఉత్పత్తి చేస్తుంది. బోడినాయకనూరు యాలుకలు, కాఫీ గింజలు, టీ, మిరియాల వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. బోడినాయకనూరులో అత్యధికంగా యాలుకల విక్రయం జరుగుతున్నందున ఈ ఊరు యాలుకల నగరంగా పిలువబడుతూ ఉంది. యాలుకలు ఇక్కడ వేలం పద్ధతిలో విక్రయించబడుతుంటాయి.[4]ది పెరియార్ అండ్ హైడ్రో పవర్ స్టేషన్లు, వైగై మైక్రో హైడ్రో పవర్ స్టేషన్‌ల నుండి స్థాపన విద్యుత్తు ఉత్పత్తి శక్తి 181 మెగావాట్లు కాగా వాస్తవానికి 1996 నుండి 494 మెగావాట్లు ఉత్పత్తి చేయబడుతుంది. తమిళనాడు పడమటి ప్రాంతంలో ఉన్న వాణిజ్యకేంద్రాలలో ప్రముఖమైనది థేని ప్రధానమైనది. తేని పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా రావడానికి కృషిచేస్తుంది. జిల్లాలో 41.09 కిలోమీటర్ల పొడవైన మీటర్‌గేజ్ రైలుమార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో మదురైను కలుపుతూ 3 రైలు స్టేషన్లు ఉన్నాయి.
అరణ్య వనరులు
[మార్చు]థేని జిల్లాలో అరణ్యల శాతం 33%. తేని జిల్లాలో 27 అరణ్యప్రాంతాలు ఉన్నాయి. అరణ్యభూభాగం వైశాల్యం 795.81 చదరపుమైళ్ళు. వీటిలో 19 ప్రాంతాలు అభయారణ్యాలు. వీటి వైశాల్యం 225.44 చదరపు మైళ్ళు. 8 ప్రాంతాలు మైదానప్రాంత అభయారణ్యాలు. వీటి వైశాల్యం 540.37 చదరపు మైళ్ళు. జిల్లా మొత్తం పచ్చదనం నిండిన భూమిగా భావించబడుతుంది. వర్గీకరించని అరణ్యాలు థేని జిల్లాలో లేవు. అయినప్పటికీ మానవనిర్మిత వనాలు 44.65 చదరపు మైళ్ళలో విస్తరించి ఉన్నాయి.జిల్లలోని అరణ్యల నుండి నిప్పుకోడి, సాఫ్ట్‌వుడ్, వంటచెరకు, జీడి, నిమ్మ, చింతపండు మొదలైనవి అరణ్యాల నుండి లభిస్తున్న వనసనాదలు. అరణ్యప్రాంతంలో వీటీని నాటి పంటను అభివృద్ధిచేస్తున్నారు. జిల్లాలో బయోలాజికల్ వనరులను సంరక్షించే పథకాలు అమలు చేయబడలేదు. వన్యమృగాల సమాచారం అందుబాటులో ఉండడం ప్రత్యేకత.
పర్యాటక ప్రదేశాలు
[మార్చు]- వైగై డ్యామ్ - థేని నుండి 20 కిమీ
- సురుళి - థేని నుండి 50 కిమీ
- మంజలారు ఆనకట్ట - థేని నుండి 35 కిమీ
- మేఘమలై హిల్ - థేని నుండి 67 కిమీ
- బోడీ మెట్టు హిల్ - థేని నుండి 45 కిమీ
- కుంబకరై జలపాతం - థేని నుండి 24 కిమీ)
- సోత్తుపారై ఆనకట్ట - థేని నుండి 24 కిమీ
- షన్ముగనాథన్ ఆనకట్ట - థేని నుండి 50 కిమీ
- రామక్కల్ మెట్టు - థేని నుండి 30 కిమీ
- కురంగని - థేని నుండి 20 కిమీ
- హైవీవ్స్ - థేని నుండి 80 కిమీ
కేరళలో సమీప స్థలాలు
[మార్చు]- తేక్కడి - థేని నుండి 80 కిమీ)
- మున్నార్ - థేని నుండి 95 కిమీ )
- కుములి - థేని నుండి 70 కిమీ)
ఉత్సవాలు
[మార్చు]- థేని లోని ఉత్తమపాళయం వద్ద జరుగుతున్న రంజాన్ పెరునాళ్.
- మేమాసంలో వీరపాండి, కంబం లలో కోలాహలంగా జరిగే గౌరియమ్మన్ ఆలయ ఉత్సావాలు.
- భద్రకాళీపురంలో శ్రీభద్రకాళీయమ్మన్‌కు జరిగే చిత్తిరై ఉత్సవాలు.
- థేని అల్లినగరంలో చిత్తిరై తిరునాళ్ సమయంలో శ్రీ వీరప్ప అయ్యనార్ ఉత్సవాలు చాల ప్రసిద్ధిచెందినవి.
- దేవధానపట్టిలో నిర్వహించబడే కామాక్షి అమ్మన్ ఉత్సవాలు, కుచనూరులో జరిగే శనీశ్వరన్ ఉత్సవాలు జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
- థేని జిల్లాలో సంక్రాంతి వైభవంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఈ ఉత్సవాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా పల్లవరాయన్ పట్టి, అయ్యంపట్టి, పుదుపట్టిలలో జల్లికట్టు అనే ఎద్దుక పందాలు నిర్వహిస్తారు. బూదిపురం - వాల్కనో స్పోర్ట్ క్లబ్ నిర్వహించే కబడీ, క్రికెట్ పందాలు కూడా ప్రాముఖ్యత సంతరుంచుకున్న విషయాలలో ఒకటి.
- మరిక ముఖ్యమైన ఉత్సవాలలో గూడలూరులో శ్రీమంగళదేవి కణ్ణగికి చేసే చిత్రాపూర్ణిమ ఒక్కటి. ఇది మే మాసంలో నిర్వహించబడుతుంది.
- ఈ ప్రాంతంలో నిర్వహించబడే ప్రాముఖ్యత సంతరించుకున్న ఉత్సవాలలో కామాక్షి అమ్మన్ ఆలయంలో మాసిమహం, శివరాత్రి ముఖ్యమైనవి. ఇవి ఫిబ్రవరి- మార్చి మాసాలలో నిర్వహించబడుతుంది. అలాగే కొత్తూరులో ఏకాదశి కూడా కోలాహలంగా నిర్వహించబఆడుతుంది.
- అనియమలయాంపట్టిలో క్రిస్మస్, న్యూ ఇయర్ కోలాహాంగా నిర్వహించబడుతుంది.
- అళగర్ చిత్రాపౌర్ణమి నాడు గోవిందనగరం వద్ద ఫంగుణి తిరువిళా ఘనంగా నిర్వహించబడుతుంది.
- గండమనూరు ఫంగుణి తిరువిళా కూడా ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగలో ఒకటి.
- అరుళ్‌మిగు పాట్టలమ్మన్, కాళియమ్మన్, కరుప్పస్వామి ఆలయం ఉత్సవాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
- ↑ National Environmental Information System (India). "Environment Profile for Theni district" (PDF). ENVIS. pp. 1–29. Retrieved 2008-09-14.
- ↑ M.Subramani. "History of Theni District". thenitimes.sitesled.com. pp. history p1/2. Archived from the original on 2008-05-10. Retrieved 2008-09-14.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 4.0 4.1 M.Subramani. "History of Theni District". thenitimes.sitesled.com. pp. history p2/2. Archived from the original on 2009-07-15. Retrieved 2008-09-14.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
- ↑ 6.0 6.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Census Info 2011 Final population totals - Theni district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Table C-16 Population by Mother Tongue: Tamil Nadu". Census of India. Registrar General and Census Commissioner of India.
- ↑ Collectorate staff (2006–2007). "District Profile Theni District" (PDF). District Collectorate, Theni. pp. 1–15. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2008-09-15.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: date format (link) - ↑ Collectorate staff (2006–2007). "District Statistical Handbook 2006-2007 Theni District" (PDF). District Collectorate, Theni. pp. 1–47. Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2008-09-15.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: date format (link)