తుంగ నది
స్వరూపం
తుంగ నది | |
---|---|
స్థానం | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | కర్ణాటక |
భౌతిక లక్షణాలు | |
మూలం | గంగ మూల |
• స్థానం | చిక్కమగళూరు జిల్లా, కర్ణాటక |
సముద్రాన్ని చేరే ప్రదేశం | తుంగభద్ర |
• స్థానం | కూడ్లి, భద్రావతి, కర్ణాటక |
పొడవు | 147 కి.మీ. (91 మై.)approx. |
తుంగ నది కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది గంగమూల వద్ద పడమటి కనుమల లోని వరాహ పర్వతంపై పుట్టి చిక్క మగళూరు, షిమోగా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. తరువాత తూర్పుగా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నది నీరు స్వచ్ఛంగా తాగేందుకు మధురంగా ఉంటుందని చెబుతూ "గంగా స్నానం తుంగా పానం" అనే సామెత ఉంది.
గజనూరు వద్ద ఈ నదిపై ఒక ఆనకట్ట ఉంది. ఇది తుంగభద్ర నదిలో సంగమించాక, ఆ నదిపై హోస్పేట వద్ద ఒక పెద్ద ఆనకట్ట ఉంది.
పవిత్ర ప్రదేశాలు
[మార్చు]శృంగేరి వద్ద తుంగ నది ఒడ్డున చాలా దేవాలయాలున్నాయి. వానిలో శారదా పీఠం, విద్యాశంకరాలయం ప్రముఖమైనవి.
వికీమీడియా కామన్స్‌లో Tunga Riverకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.