Jump to content

జితేంద్ర కుమార్ మహేశ్వరి

వికీపీడియా నుండి
జితేంద్ర కుమార్ మహేశ్వరి
జితేంద్ర కుమార్ మహేశ్వరి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 జనవరి 2021
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు అరూప్ కుమార్ గోస్వామి

పదవీ కాలం
7 అక్టోబరు 2019 – 5 జనవరి 2021
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు చాగంటి ప్రవీణ్ కుమార్ (acting)
తరువాత అరూప్ కుమార్ గోస్వామి

పదవీ కాలం
25 నవంబరు 2005 – 6 అక్టోబరు 2019
సూచించిన వారు యోగేష్ కుమారు సభర్వాల్
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-29) 1961 జూన్ 29 (వయసు 63)
జౌరా, మధ్యప్రదేశ్
జీవిత భాగస్వామి ఉమా మహేశ్వరి
సంతానం మను, దీక్ష

జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి (జననం 29 జూన్ 1961) ఒక భారతీయ న్యాయమూర్తి. జనవరి 2021 లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అతను మధ్యప్రదేశ్ లోని జౌరాలో జన్మించాడు. అతను బెంచ్‌కు ఎదగడానికి ముందు గ్వాలియర్‌లో ప్రాక్టీస్ చేసే న్యాయవాది.[1]

వివాదాలు

[మార్చు]

అక్టోబరు, 2021 లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశాడు. ఏపీ హైకోర్టును సుప్రీం కోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని అన్నాడు, ప్రధాన న్యాయమూర్తి తో సహా ఐదుగురు హైకోర్టు జడ్జిల పేర్లను లేఖలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్వరి బదిలీ అయ్యాడు. జనవరి 6,2021 వీడ్కోలు సభలో ప్రసంగిస్తూ ఏపీ హైకోర్టు ప్రతిష్టతను మరింత పెంచేందుకు తన వంతుగా ప్రయత్నించానని, వ్యవస్థలు, సంస్థల ఉన్నతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పాడు [2]

మూలాలు.

[మార్చు]
  1. Singh, Chandeep (30 August 2019). "3. 2019.08.22-Andhra Pradesh-J.K. Maheshwari". Bar & Bench. Retrieved 30 August 2019.
  2. "చీఫ్ జస్టిస్ మహేశ్వరి భావోద్వేగం: ఆ వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోనంటూ.. బదిలీపై కీలక వ్యాఖ్యలు!". సమయం. 2021-01-06. Retrieved 2021-01-27.